బ్రిటన్ ప్రధాని అభ్యర్థులకు…భారత సంతతి టోరీల మద్దతు…

  బోరిస్ జాన్సన్‌కు ముగ్గురు, రాబ్‌కు ఇద్దరు లండన్: ప్రధాని థెరెసా మే స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో సన్నా హాలు జరుగుతున్నాయి. ప్రధాని పదవికి బోరి స్ జాన్సన్, డోమినిక్ రాబ్ పోటీపడుతున్నారు. భారతీయ సంతతికి చెందిన ఐదుగురు కన్జర్వేటివ్ పార్టీ ఎంఎల్‌ఏలు బోరిస్‌కు తమ మద్దతు ప్రకటించారు. అలాగే, డోమినిక్ రాబ్‌కు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. ఇలా ఉండగా సోమవారంతో నామినేషన్ల గడువుముగియడం తో ప్రధాని పదవి రేసులో ఉన్న ఇద్దరూ హామీ […] The post బ్రిటన్ ప్రధాని అభ్యర్థులకు… భారత సంతతి టోరీల మద్దతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బోరిస్ జాన్సన్‌కు ముగ్గురు, రాబ్‌కు ఇద్దరు

లండన్: ప్రధాని థెరెసా మే స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో సన్నా హాలు జరుగుతున్నాయి. ప్రధాని పదవికి బోరి స్ జాన్సన్, డోమినిక్ రాబ్ పోటీపడుతున్నారు. భారతీయ సంతతికి చెందిన ఐదుగురు కన్జర్వేటివ్ పార్టీ ఎంఎల్‌ఏలు బోరిస్‌కు తమ మద్దతు ప్రకటించారు. అలాగే, డోమినిక్ రాబ్‌కు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. ఇలా ఉండగా సోమవారంతో నామినేషన్ల గడువుముగియడం తో ప్రధాని పదవి రేసులో ఉన్న ఇద్దరూ హామీ ల్ని గుప్పిస్తున్నారు. బ్రిటన్ కు మరింత ప్రయోజనం చేకూరేలా యూరోపియన్ యూనియన్ లో విడాకుల బిల్లును నిలిపి ఉంచుతామన్నా రు. అలాగే పన్నుల్లో కోత విధిస్తామని ఆయన, ఇతర అభ్యర్థులు చెబుతున్న విషయం చర్చనీయాంశమైంది. రెండు విడతల్లో జరిగే ఎన్నికల్లో 318 ఎంపీలు తొలి విడతలో ఓటేస్తారు.

మద్దతిస్తున్న ఇండియన్ ఎంపీలు వీరే

సానుకూలతనే కాక, ప్రతికూలతను కూడా ఎదుర్కొంటున్న జాన్సన్‌కు భారతీయ సంతతికి చెందిన ముగ్గురు కన్జర్వేటివ్‌లు జూనియర్ మినిస్టర్ రిషి సునాక్ (ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణమూర్తి అల్లుడు), మినిస్టర్ ఆఫ్ స్టేట్ అలోక్ శర్మ, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మాజీ సెక్రెటరీ ప్రీతి పటేల్ ఉన్నారు. ఇకపోతే మరో ప్రధాన అభ్య ర్థి రాబ్ కు మాజీ జూనియర్ మంత్రులు శైలేష్ వర, సుయెల్లా మద్దతిస్తున్నారు. జాన్స న్ తర్వాత ఎక్కువ మద్దతున్న అభ్యర్థుల్లో ఫారి న్ సెక్రెటరీ జెరెమీ హంట్ ఉన్నారు. ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ మైఖేల్ గోవ్, హోం సెక్రెటరీ సాజిద్‌కు అంతగా మద్దతు లభించడం లేదు.

బరిలో పది మంది

ప్రధాని పదవికి పోటీ పడుతున్న పది మంది అభ్యర్థులు : ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ మైఖేల్ గోవ్, హెల్త్ సెక్రెటరీ మాట్‌కాంకాక్, మాజీ చీఫ్ విప్ మార్క్ హార్పర్, ఫారిన్ సెక్రెటరీ జెరిమీ హంట్, హోం సెక్రెటరీ సాజిద్ జావిద్, మాజీ ఫారిన్ సెక్రెటరీ బోరిస్ జాన్సన్, మాజీ సభా నాయకుడు ఆండ్రియా లీడ్‌సోం, మాజీ వర్క్ అండ్ పెన్షన్స్ సెక్రెటరీ ఈస్తర్ మెక్ వే, మాజీ బ్రెగ్జిట్ సెక్రెటరీ డోమినిక్ రాబ్, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెక్రెటరీ రారో స్టీవార్ట్.

Indian descents support to Prime Ministerial candidates

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్రిటన్ ప్రధాని అభ్యర్థులకు… భారత సంతతి టోరీల మద్దతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: