రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రారంభం

నితిన్, రష్మిక మండన హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘భీష్మ’ గురువారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎస్.రాధాకృష్ణ, సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ “ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయి”అని తెలిపారు. దర్శకుడు వెంకీ కుడుముల […] The post రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నితిన్, రష్మిక మండన హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘భీష్మ’ గురువారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎస్.రాధాకృష్ణ, సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ “ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయి”అని తెలిపారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ “స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. నితిన్ క్యారెక్టర్‌ను చక్కగా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్‌కు కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగుతుంది”అని చెప్పారు. నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ : మహతి స్వరసాగర్, కెమెరామెన్: సాయి శ్రీరామ్ , ఆర్ట్ : సాహి సురేష్, ఎడిటర్: నవీన్ నూలి.

The post రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: