పాండిచ్చేరిలో సైరా

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. ప్రస్తుతం పాండిచ్చేరిలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో భాగంగా లైవ్ లొకేషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారట. కథలో అత్యంత కీలకమైన పార్ట్‌ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారట. బ్రిటీష్ అధికారులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే అతి కీలకమైన ఒప్పందాల నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాలట ఇవి. వీటి కోసం ఆ కాలం నాటి బ్రిటీష్ బిల్డింగ్‌ల సెట్ వేయాల్సి ఉందట. కానీ అందుకు పరిస్థితులు […] The post పాండిచ్చేరిలో సైరా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. ప్రస్తుతం పాండిచ్చేరిలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో భాగంగా లైవ్ లొకేషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారట. కథలో అత్యంత కీలకమైన పార్ట్‌ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారట. బ్రిటీష్ అధికారులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే అతి కీలకమైన ఒప్పందాల నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాలట ఇవి. వీటి కోసం ఆ కాలం నాటి బ్రిటీష్ బిల్డింగ్‌ల సెట్ వేయాల్సి ఉందట. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాండిచ్చేరిలో ఇంకా మిగిలి ఉన్న ఆ కాలం నాటి కొన్ని పురాతన భవనాల్లో ‘సైరా’ టీమ్ చిత్రీకరణ జరుపుతోందనీ సమాచారం. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ’సైరా’ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఇక ప్రస్తుతం దాదాపు చివరి దశ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తికాగానే నిర్మాణానంతర కార్యక్రమాలపై దృష్టిపెడతారు. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘సైరా’ ట్రైలర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

The post పాండిచ్చేరిలో సైరా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: