టిఆర్‌ఎస్ పిపి నేడు భేటీ…

    పార్లమెంట్‌లో వ్యూహంపై ఎంపిలకు కెసిఆర్ దిశా నిర్దేశం హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి సిఎం కెసిఆర్ ఎంపిలకు దిశానిర్ధేశం చేయనున్నారు. సమావేశానికి హాజరుకావాలని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు టిఆర్‌ఎస్ పార్టీ ఆహ్వానం పంపింది. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశా లు జరుగనున్న నేపథ్యంలో […] The post టిఆర్‌ఎస్ పిపి నేడు భేటీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

పార్లమెంట్‌లో వ్యూహంపై ఎంపిలకు కెసిఆర్ దిశా నిర్దేశం

హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి సిఎం కెసిఆర్ ఎంపిలకు దిశానిర్ధేశం చేయనున్నారు. సమావేశానికి హాజరుకావాలని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు టిఆర్‌ఎస్ పార్టీ ఆహ్వానం పంపింది. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశా లు జరుగనున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపిలతో సిఎం కెసిఆర చర్చించనున్నారు.

కొత్తగా ఎంపికైన ఎంపిలు పార్లమెంట్‌లో ఎలా నడుచుకోవాలి, ఇతర పార్టీల ఎంపిలతో ఎలా వ్యవహరించాలి..? తమ గళాన్ని ఎలా వినిపించాలి..? తదితర అంశాలపై సిఎం కెసిఆర్ దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా రిజర్వేషన్ల పెంపు అంశంపై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలిసింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని నీతి అయోగ్ చేసిన సిఫార్సులపై పార్లమెంట్‌లో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా గుర్తింపుపై ఎంపిలు పార్లమెంట్‌లో పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది.

వీటితోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించనునున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తొమ్మిది ఎంపిలతో పాటు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జోగినిపల్లి సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొంటారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన తొమ్మిది మంది టిఆర్‌ఎస్ ఎంపిలు పి. రాములు(నాగర్‌కర్నూల్), మన్నె శ్రీనివాస్ రెడ్డి(మహబూబ్‌నగర్), మాలోత్ కవిత(మహబూబాబాద్), నామా నాగేశ్వర్‌రావు(ఖమ్మం), రంజిత్ రెడ్డి(చేవెళ్ల), బీబీ పాటిల్(జహీరాబాద్), పసునూరి దయాకర్(వరంగల్), కొత్త ప్రభాకర్ రెడ్డి(మెదక్), నేతకాని వెంకటేశ్(పెద్దపల్లి) పార్లమెంట్‌లో ప్రమాణం చేయనున్నారు.

TRS Parliamentary Party Meeting

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్‌ఎస్ పిపి నేడు భేటీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: