స్వీట్ షాక్ ఇచ్చేలా..

  ఈ ఏడాదిలోనే మోస్ట్ వెయిటెడ్ మూవీస్‌లో మొదటగా వస్తున్న ‘సాహో’ టీజర్ గురువారం విడుదల కానుంది. యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇన్‌సైడ్ టాక్ ప్రకారం టీజర్ మొత్తం భారీ యాక్షన్‌తో కళ్ళు చెదిరిపోయే విజువల్స్‌తో ఉంటుందట. ప్రభాస్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటూ ఒకటి హీరోగా… రెండోది విలన్ తరహాలో అనిపించే నెగటివ్ యాంగిల్‌లో ఉంటూ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చేలా […] The post స్వీట్ షాక్ ఇచ్చేలా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ ఏడాదిలోనే మోస్ట్ వెయిటెడ్ మూవీస్‌లో మొదటగా వస్తున్న ‘సాహో’ టీజర్ గురువారం విడుదల కానుంది. యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇన్‌సైడ్ టాక్ ప్రకారం టీజర్ మొత్తం భారీ యాక్షన్‌తో కళ్ళు చెదిరిపోయే విజువల్స్‌తో ఉంటుందట. ప్రభాస్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటూ ఒకటి హీరోగా… రెండోది విలన్ తరహాలో అనిపించే నెగటివ్ యాంగిల్‌లో ఉంటూ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చేలా ప్లాన్ చేశారట. సినిమాలో ఏ రేంజ్‌లో ట్విస్టులు ఉంటాయో శాంపిల్ రూపంలో టీజర్‌లో చూపించబోతున్నట్టు తెలిసింది. ఇక అదరగొట్టే టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం. రఫ్ కట్ చూసిన యువి సంస్థ సన్నిహితులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో టీజర్ కొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని నమ్మకంగా చెబుతున్నారు. ఆగస్ట్ 15న విడుదల కానున్న ‘సాహో’ బిజినెస్ మీద ఈ టీజర్ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అందుకే గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలను కొన్నింటిని ఇందులోనే పొందుపరిచినట్టు వినికిడి. ‘బాహుబలి 2’ తర్వాత రెండేళ్ల గ్యాప్‌తో ప్రభాస్ చేస్తున్న మూవీ కాబట్టి ‘సాహో’ మీద బయ్యర్లకు చాలా గురి ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్రం టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా నిలవబోతోంది.

Saaho teaser launches at 11am today

The post స్వీట్ షాక్ ఇచ్చేలా.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: