బిజెపిపి కమిటీలు ఖరారు

లోక్‌సభలో మోడీ, రాజ్‌నాథ్ రాజ్యసభలో థావర్ చంద్, పియూష్ న్యూఢిల్లీ: బిజెపి పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యవర్గ కమిటీని బుధవారం ప్రకటించారు. లోక్‌సభలో ఈ కార్యవర్గ కమిటీ నాయకుడిగా ప్రధాని మోడీ, ఉప నాయకుడిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యవహరిస్తారు. ఇక ఎగువ సభ రాజ్యసభలో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లోట్ ఈ కమిటీకి నేతగా ఉంటారు. ఉపనేతగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యవహరిస్తారని బిజెపి వర్గాలు బుధవారం ఒక ప్రకటన వెలువరించాయి. […] The post బిజెపిపి కమిటీలు ఖరారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లోక్‌సభలో మోడీ, రాజ్‌నాథ్

రాజ్యసభలో థావర్ చంద్, పియూష్
న్యూఢిల్లీ: బిజెపి పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యవర్గ కమిటీని బుధవారం ప్రకటించారు. లోక్‌సభలో ఈ కార్యవర్గ కమిటీ నాయకుడిగా ప్రధాని మోడీ, ఉప నాయకుడిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యవహరిస్తారు. ఇక ఎగువ సభ రాజ్యసభలో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లోట్ ఈ కమిటీకి నేతగా ఉంటారు. ఉపనేతగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యవహరిస్తారని బిజెపి వర్గాలు బుధవారం ఒక ప్రకటన వెలువరించాయి. రాజ్యసభలో ఇంతకు ముందటి వరకూ సీనియర్ నేత అరుణ్ జైట్లీ బిజెపి నేతగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన స్థానంలోకి గెహ్లోట్ వచ్చారు. తనకు ఎటువంటి పదవులు బాధ్యతలు వద్దని, తాను ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సి ఉందని ఇటీవలే జైట్లీ కోరుకున్నారు.

త్వరలోనే నూతన లోక్‌సభ సమావేశాలతో పార్లమెంట్ భేటీ జరుగనుండటంతో ఉభయ సభలలో అధికార పార్టీ కమిటీసభ్యుల ఖరారు జరిగింది. కమిటీలోకి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని సభ్యురాలిగా తీసుకున్నారు. పార్టీ చీఫ్ విప్ గా సంజయ్ జైస్వాల్‌ను నియమించారు. కార్యవర్గ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర ప్రసాద్, అర్జున్ ముండా, తోమార్, జువాల్ ఒరామ్‌లను తీసుకున్నారు. ఈసారి ఏర్పాటు అయిన బిజెపి పార్లమెంటరీ పార్టీ కార్యవర్గ కమిటీలో నియామకాలతో పార్టీలో తలెత్తిన తరాల మార్పిడి స్పష్టం అయింది. ఎంపిలుగా లేని అద్వానీ, మురళీమనోహర్ జోషీలతో పాటు జైట్లీ, సుష్మా స్వరాజ్‌ల కు కమిటీలో చోటు లేకుండా చేశారు. పార్టీ కొత్త కార్యవర్గ కమిటీ భేటీ ఈనెల 16న మధ్యాహ్నం రెండున్నరకు జరుగుతుంది. అదేరోజున ప్రధా ని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం నిర్ణయించింది.

BJP Parliamentary party Committee reconstituted

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిజెపిపి కమిటీలు ఖరారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: