సిఆర్‌పిఎఫ్‌పై ఉగ్రదాడి

   ఐదుగురు జవాన్ల మృతి  తుపాకులు వదిలి చర్చలకు రండి  మిలిటెంట్లకు కశ్మీర్ గవర్నర్ ఆహ్వానం శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో కాపలాదళంపై ఉగ్రవాదులు బుధవారం జరిపిన దాడిలో ఐదుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించారు. కాల్పుల్లో ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్, మరో పౌరుడు కూడా గాయపడ్డారు. తమపై దాడిచేసిన ఉగ్రవాదుల్లో ఒకరిని సిఆర్‌పిఎఫ్ బృందం చంపినట్టు తెలుస్తోంది. అనంత్‌నాగ్‌లోని కెపి రోడ్డులో ఈ సంఘటన జరిగింది. కాపలా బృందంపై ఉగ్రవాదులు ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్పులు జరిపారు […] The post సిఆర్‌పిఎఫ్‌పై ఉగ్రదాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 ఐదుగురు జవాన్ల మృతి
 తుపాకులు వదిలి చర్చలకు రండి
 మిలిటెంట్లకు కశ్మీర్ గవర్నర్ ఆహ్వానం

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో కాపలాదళంపై ఉగ్రవాదులు బుధవారం జరిపిన దాడిలో ఐదుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించారు. కాల్పుల్లో ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్, మరో పౌరుడు కూడా గాయపడ్డారు. తమపై దాడిచేసిన ఉగ్రవాదుల్లో ఒకరిని సిఆర్‌పిఎఫ్ బృందం చంపినట్టు తెలుస్తోంది. అనంత్‌నాగ్‌లోని కెపి రోడ్డులో ఈ సంఘటన జరిగింది. కాపలా బృందంపై ఉగ్రవాదులు ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్పులు జరిపారు గ్రెనేడ్లు విసిరారని పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. గాయపడిన అనంత్‌నాగ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్షాద్ అహ్మద్‌ను చికిత్సకోసం శ్రీనగర్‌కు తరలించారు. పుల్వామాలో ఒక ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించిన కొన్ని నెలల తర్వాత ఇప్పుడీ సంఘటన చోటుచేసుకుంది.
తుపాకులు వదిలిపెట్టండి
ఈ సంఘటనపై స్పందించిన జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తుపాకులు విడిచిపెట్టమని మిలిటెంట్లకు విజ్ఞప్తి చేశారు. చర్చలకు రమ్మని ఆహ్వానించారు. అప్పుడే రాజ్యాంగ పరిధిలో వాళ్లు కోరుకునేది పొందగలరని, హింసతో సాధించేది ఏమీ ఉండదని తెలిపారు. ‘మా నుంచి అన్నీ పొందండి. ప్రాణమైనా ఇస్తాం. కానీ ప్రేమ, చర్చల ద్వారా మాత్రమే అది జరుగుతుంది. అందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, మేము సిద్ధంగా ఉన్నాం. చర్చలకు రండి. ముందడుగు వేద్దాం’ అని గవర్నర్ తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మీడియాకు వివరిస్తూ చెప్పారు. ‘మీకు మీ రాజ్యాంగం ఉంది. మీ జెండా ఉంది. అంతకు మించి ఏం కావాలన్నా ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా, భారత రాజ్యాంగం పరిధిలో మాత్రమే పొందగలరు’ అని స్పష్టం చేశారు.వాస్తవం ఏమిటో ప్రస్తుతం మిలిటెంట్లకు ఇప్పుడు తెలీకపోవచ్చు. కానీ తాము తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నామని పదేళ్ల తర్వాత తెలిసి పశ్చాత్తాప పడతారని గవర్నర్ హితవు చెప్పారు.

5 CRPF Soldiers died in Terror attack at Jammu & Kashmir

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సిఆర్‌పిఎఫ్‌పై ఉగ్రదాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: