జూలై 15న చంద్రయాన్-2 ప్రయోగం

     సెప్టెంబర్ 6 లేదా 7వ తేదీన జాబిలిపై ల్యాండింగ్!  రూ.1000కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వివరాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్ శివన్ బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి ముహూర్తం ఖరారు అయింది. చంద్రయాన్ -2ను జులై 15న ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన చంద్రయాన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జిఎస్‌ఎల్‌వి ఎంకె-౩ […] The post జూలై 15న చంద్రయాన్-2 ప్రయోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

 సెప్టెంబర్ 6 లేదా 7వ తేదీన జాబిలిపై ల్యాండింగ్!
 రూ.1000కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వివరాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్ శివన్

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి ముహూర్తం ఖరారు అయింది. చంద్రయాన్ -2ను జులై 15న ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన చంద్రయాన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జిఎస్‌ఎల్‌వి ఎంకె-౩ వాహక నౌక ద్వారా జూలై 15న ఉదయం 2.51 గంటలకు చంద్రయాన్-2ను నింగిలోకి పంపించనున్నట్లు ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 6 లేదా 7న చంద్రయాన్-2 రోవర్ జాబిలిపై దిగుతుందని ఆయన తెలిపారు. 3.8 టన్నుల బరువు ఉండే చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్(విక్రమ్), రోవర్ (ప్రగ్యాన్) అనే మూడు మాడ్యూల్స్ ఉంటాయని తెలిపారు.ఇప్పటికే ఆలస్యమైనా పూర్తి స్థాయిలో సిద్ధమైందని పేర్కొన్నారు. ఇదే సమయంలో చంద్రయాన్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను తొలిసారి మీడియాకు విడుదల చేశారు.

ఈ ప్రయోగం ద్వారా మీట రు పొడవైన 25 కేజీల బరువున్న రోవర్, ఆర్బిటర్, ల్యాండర్లను జాబిలిపైకి పంపనున్నట్లు శివన్ తెలిపారు. ఈ ప్రయోగంలో జిఎస్‌ఎల్‌వి మార్క్-3 రాకెట్ సాయంతో శ్రీహరికోట నుంచి నింగిలోకి చేరుకొంటుంది. అక్కడి నుంచి ఆర్బిటర్ ప్రొప్లైజేషన్ విధానంలో ఈ మూడు పరికరాలు చంద్రుడి కక్ష్యలోకి చేరతాయి. అక్కడ ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి జాబిలివైపు దూసుకెళుతుంది. ఆర్బిటర్ నిర్దేశిత కక్ష్యలో తిరుగుతుంది. మరోపక్క ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రాంతంలో దిగుతుంది. అనంతరం దానిలోంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు ప్రారంభిస్తుంది. ఈ రోవర్ ప్రయోగాలు చేయడానికి అవసరమైన పరికరాలను కూడా ల్యాండర్‌పై భాగంలో అమర్చారు. సెప్టెంబర్ నుంచి ఇది సంకేతాలను ఇస్రోకు పంపనుంది. కాగా 2009లో ప్రయోగించిన చంద్రయాన్-1 విజయవంతం కావడంతో దాదాపు రూ. 1000 కోట్ల అంచనా వ్యయంతో చంద్రయాన్-2 ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.

చంద్రయాన్2 విశేషాలు…
ఖర్చు      : రూ.1,000 కోట్లు
వాహకనౌక : జిఎస్‌ఎల్‌వి మార్క్-3 రాకెట్
పేర్లు        : ఆర్బిటర్, ల్యాండర్‌కు విక్రమ్. రోవర్‌కు ప్రజ్ఞ అని పేరుపెట్టారు.
బరువు     : 3.8టన్నులు.
పరికరాలు  : మొత్తం 13 రకాలు
లక్ష్యం      : చంద్రుడి ఉపరితలం పరిశోధన, ఖనిజాలు వంటి వాటిని అన్వేషించడం.
* నాసా సమకూర్చిన లేజర్ ర్యాంగింగ్‌ను ఉచితంగా చంద్రుడిపైకి తీసుకెళుతున్నారు.
* పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాజెక్టు. నేవిగేషన్, గైడెన్స్ కోసం నాసా డీప్‌స్పేస్ నెట్‌వర్క్‌కు చెల్లింపులు జరిపి భారత్   వాడుకొంటుంది.
* ఇస్రో చేపట్టిన అత్యంత కఠినమైన ప్రాజెక్టు ఇదే. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయేందుకు 15 నిమిషాల సమయం   పడుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో ఇదే కీలకం.
* చంద్రయాన్‌లో ల్యాండర్, రోవర్ దిగే దక్షిణ ధ్రువ ప్రదేశానికి ఇంతవరకు ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు చేరలేదు.

ISRO launching Chandrayaan-2 on July 15th

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జూలై 15న చంద్రయాన్-2 ప్రయోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: