ఆస్ట్రేలియా జయభేరి

వార్నర్ శతకం, ఫించ్ మెరుపులు ఆమిర్ శ్రమ వృథా, పాకిస్థాన్‌కు మరో ఓటమి టాంటన్: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మూడో విజయం నమోదు చేసింది. బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియాకు ఇది మూడో గెలుపు కావడం విశేషం. మరోవైపు పాకిస్థాన్‌కు ఇది రెండో ఓటమి. నాలుగు మ్యాచుల్లో పాక్ కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించగా, ఒక మ్యాచ్ వర్షం […] The post ఆస్ట్రేలియా జయభేరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వార్నర్ శతకం, ఫించ్ మెరుపులు

ఆమిర్ శ్రమ వృథా, పాకిస్థాన్‌కు మరో ఓటమి
టాంటన్: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మూడో విజయం నమోదు చేసింది. బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియాకు ఇది మూడో గెలుపు కావడం విశేషం. మరోవైపు పాకిస్థాన్‌కు ఇది రెండో ఓటమి. నాలుగు మ్యాచుల్లో పాక్ కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించగా, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఈ ఓటమితో పాకిస్థాన్ నాకౌట్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. కాగా, పాక్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా మరోసారి రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (107) శతకంతో ఆసీస్‌ను ఆదుకున్నాడు. పాకిస్థాన్ జట్టులో మహ్మద్ అమిర్ ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 45.4 ఓవర్లలో కేవలం 266 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు.
ప్రారంభంలోనే..
భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన పాక్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫకర్ జమాన్ (౦) మూడో ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. అతను ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కమిన్స్‌కు ఈ వికెట్ దక్కింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన బాబర్ ఆజమ్‌తో కలిసి మరో ఓపెనర్ ఇమాముల్ హక్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరు వేగం తగ్గకుండా చూశారు. బాబర్ ఆజమ్ తన మార్క్ షాట్లతో అలరించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఆజమ్ వరుస బౌండరీలను బాదాడు. చెలరేగి ఆడిన ఆజమ్ ఏడు ఫోర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన సీనియర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ హఫీజ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హఫీజ్‌హక్‌లు కుదురుగా ఆడడంతో పాక్ కోలుకున్నట్టే కనిపించింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హక్ ఏడు ఫోర్లతో 53 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా ఆడిన హఫీజ్ 48 పరుగులు సాధించాడు. కాగా, కీలక సమయంలో ఆస్ట్రేలియా బౌలర్లు వరుసగా వికెట్లు తీశారు. దీంతో పాక్ ఒక దశలో 160 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ సర్ఫరాజ్, హసన్ అలీ, వహాబ్ రియాజ్‌లు అసాధారణ పోరాట పటిమతో జట్టుకు అండగా నిలిచారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ 40 పరుగులు చేశాడు. చెలరేగి ఆడిన హసన్ అలీ మూడు సిక్స్‌లు, మరో 3 ఫోర్లతో వేగంగా 32 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను హడలెత్తించిన వహాబ్ మూడు సిక్సర్లు, రెండు బౌండరీలతో 45 పరుగులు చేశాడు. ఈ త్రయం కీలక దశలో వెనుదిరగడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ మూడు, స్టార్క్, రిచర్డ్‌సన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.


వార్నర్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ శుభారంభం అందించారు. ఇద్దరు పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ 84 బంతుల్లోనే 4సిక్సర్లు, మరో ఆరు బౌండరీలతో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వార్నర్‌తో కలిసి తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించాడు. మరోవైపు అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన వార్నర్ సెంచరీతో మెరిశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 111 బంతుల్లో ఒక సిక్స్, మరో 11 ఫోర్లతో 107 పరుగులు చేశాడు. ఒక దశలో 34 ఓవర్లలో 223/2తో ఉన్న ఆస్ట్రేలియాను ఆమిర్ హడలెత్తించాడు. అతని ధాటికి ఆసీస్ 307 పరుగులకే కుప్పకూలింది. ఆమిర్ 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అతని ధాటికి ఆస్ట్రేలియా చివరి 8 వికెట్లను 84 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం.

World Cup 2019: AUS beat pakistan by 41 runs

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆస్ట్రేలియా జయభేరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: