మూడు దశాబ్దాల్లో ఇదే సుదీర్ఘ వేసవి…

  భానుడి భగభగకు దేశం కుతకుత మూడింట రెండొంతుల ప్రాంతం నిప్పుల కొలిమి త్వరలో రుతుపవనాలు లేనట్టే న్యూఢిల్లీ: దేశంలో దాదాపు మూడింట రెండొంతుల ప్రాంతం మంగళవారంనాడు భానుడి ప్రతాపానికి గురైంది. అత్యధిక వేడిమితో వడగాడ్పులు వీచాయి. వేడిమికి తట్టుకోలేక నలుగురు ప్రయాణికులు రైల్లోనే చనిపోయారు. చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా లేదు. గత మూడు దశాబ్దాల్లో ఇన్ని రోజులపాటు వడగాడ్పులు కొనసాగడం ఇదే మొదటిసారి. సూర్యతాపానికి తట్టుకోలేక కాస్త సేదదీరేందుకు వేలాది మంది కాస్త చల్లగా […] The post మూడు దశాబ్దాల్లో ఇదే సుదీర్ఘ వేసవి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భానుడి భగభగకు దేశం కుతకుత
మూడింట రెండొంతుల ప్రాంతం నిప్పుల కొలిమి
త్వరలో రుతుపవనాలు లేనట్టే

న్యూఢిల్లీ: దేశంలో దాదాపు మూడింట రెండొంతుల ప్రాంతం మంగళవారంనాడు భానుడి ప్రతాపానికి గురైంది. అత్యధిక వేడిమితో వడగాడ్పులు వీచాయి. వేడిమికి తట్టుకోలేక నలుగురు ప్రయాణికులు రైల్లోనే చనిపోయారు. చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా లేదు. గత మూడు దశాబ్దాల్లో ఇన్ని రోజులపాటు వడగాడ్పులు కొనసాగడం ఇదే మొదటిసారి. సూర్యతాపానికి తట్టుకోలేక కాస్త సేదదీరేందుకు వేలాది మంది కాస్త చల్లగా ఉండే పర్వత ప్రాంతాలకు ప్రయాణమయ్యారు. అయితే అక్కడ కూడా సరిగా ఉపశమనం లభించలేదు. ఉత్తర, మధ్య భారతం , ద్వీపకల్ప ప్రాంతంలోనూ వేడి గాలులు కొసాగాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ, రాజస్థాన్ లోని చురు, బికనీర్, హర్యానాలోని హిసార్, భివాని, పంజాబ్‌లో పాటియాలా, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో కుతకుతలాడిపోయాయి. జూన్ నెల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశరాజధానిలో సోమవారం 48 డిగ్రీల సెలిసియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం చిరు జల్లులు కురిసినా పాలం విమానాశ్రయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 54.4 కు చేరుకుంది. ‘వాయు’ తుఫాను కారణంగా రుతుపవనాలు మరికొంత ఆలస్యం కావచ్చని నిపుణులు హెచ్చరించారు. గుజరాత్ వైపు పయనిస్తున్న ‘వాయు’ తుఫాన్ వల్ల అక్కడ వానలు కురుస్తాయని చెప్పారు. 2019 లో 32 రోజులపాటు ఎడతెగకుండా ఎండలు కాశాయి. మరో మూడు వారాల్లో జూన్ వస్తుందనగా ఇన్ని రోజులపాటు తీవ్రంగా ఎండలు కాయడం ఇది రెండోసారి. 1988లో 33 రోజులు, 2016లో 32 రోజులు ఎడతెగకుండా ఎండలు కాశాయి.

High Temperatures Recorded this Summer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడు దశాబ్దాల్లో ఇదే సుదీర్ఘ వేసవి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: