బ్యాంకుల మోసాలు 11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల

  అగ్రస్థానంలో ఐసిఐసిఐ, ఎస్‌బిఐ, హెచ్‌ఎస్‌బిసి దాదాపు అన్ని బ్యాంకుల్లోను వందలాది కోట్ల విలువైన కుంభకోణాలు చివరికి విదేశీ బ్యాంకులకూ తప్పని జాడ్యం ఆర్‌టిఐ సమాధానంకింద ఆర్‌బిఐ అందించిన వివరాలు న్యూఢిల్లీ: గత 11 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశంలో 50 వేలకు పైగా బ్యాంకు కుంభకోణాలు జరగ్గా, వీటిలో అత్యధిక కేసులు ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులలోనే జరిగాయని భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బిఐ) సిటిఐ ప్రతినిధికి అందజేసిన వివరాలు […] The post బ్యాంకుల మోసాలు 11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అగ్రస్థానంలో ఐసిఐసిఐ, ఎస్‌బిఐ, హెచ్‌ఎస్‌బిసి
దాదాపు అన్ని బ్యాంకుల్లోను వందలాది కోట్ల విలువైన కుంభకోణాలు
చివరికి విదేశీ బ్యాంకులకూ తప్పని జాడ్యం
ఆర్‌టిఐ సమాధానంకింద ఆర్‌బిఐ అందించిన వివరాలు

న్యూఢిల్లీ: గత 11 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశంలో 50 వేలకు పైగా బ్యాంకు కుంభకోణాలు జరగ్గా, వీటిలో అత్యధిక కేసులు ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులలోనే జరిగాయని భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బిఐ) సిటిఐ ప్రతినిధికి అందజేసిన వివరాలు వెల్లడించాయి. 2008-09 ఆర్థిక సంవత్సరంనుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో మొత్తం 53,334 బ్యాంక్ కుంభకోణాలు జరగ్గా, వీటి విలువ రూ.2.05 లక్షల కోట్లని ఆర్‌బిఐ తెలిపింది. వీటిలో అత్యధికంగా ఐసిఐసిఐ బ్యాంక్‌లో 6,811 కుంభకోణాలు జరగ్గా ,వాటి విలువ రూ.5,033.81 కోట్లుగా ఉంది. కాగా దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బిఐలో రూ.23,734.74 కోట్ల విలువైన 6,793 కుంభకోణాలు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో రూ.1200.79 కోట్ల విలువైన 2,497 కుంభకోణాలు చోటు చేసుకున్నట్లు పిటిఐ వార్తా సంస్థ ప్రతినిధి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్‌బిఐ ఇచ్చిన సమాధానం వెల్లడించింది.

కాగా జాతీయ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 12,962.96 కోట్ల విలువైన 2160 మోసాలు జరగ్గా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.28,700.74 కోట్ల విలువైన 2,047 కుంభకోణాలు, ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్‌లో రూ.5301.69 కోట్ల విలువైన 1944 మోసాలు జరిగాయని ఆ సమాధానంలో ఆర్‌బిఐ తెలిపింది. కాగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1872 (రూ.12,358.2కోట్లు), సిండికేట్ బ్యాంక్‌లో 1783 (5,830.85కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1813(రూ. 9041కోట్లు) కుంభకోణాల సంఘటనలు జరిగినట్లు ఆ గణాంకాలను బట్టి తెలుస్తోంది.

ఐడిబిఐ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహింద్రా బ్యాంక్‌లలో కూడా వేలాది కోట్ల విలువైన బ్యాంక్ మోసాలు చోటు చేసుకున్నాయి. కాగా బ్యాంక్ మోసాలు భారీగా చోటు చేసుకున్న వాటిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాల, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యుకో బ్యాంక్, తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌లు కూడా ఉన్నాయి, దేశీయ బ్యాంకులే కాకుండా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్. సిటి బ్యాంక్, హెచ్‌ఎస్‌బిసి, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ లాంటి కొన్ని విదేశీ బ్యాంకుల్లో కూడా ఇలాంటి కుంభకోణాలు చోటు చేసుకున్నాయని ఆర్‌ఎఇఐ అందజేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.

చివరికి ఈ మధ్యనే ప్రారంభించిన పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో కూడా 2 లక్షల రూపాయల విలువైన రెండు బ్యాంక్ మోసాలు చోటు చేసుకున్నట్లు ఆ డేటా వెల్లడించింది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.71.542.93 కోట్లు విలువైన దాదాపు 6,801 మోసాలు వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఆర్థిక సంస్థల్లో చోటు చేసుకున్నట్లు ఆర్‌బిఐ గణాంకాలను ఉటంకిస్తూ పిటిఐ ఈ నెల 3న ఒక వార్తా కథనాన్ని ఇచ్చింది. ఈ కథనం ప్రచురితమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ మర్నాడు మీడియా సమావేశం నిర్వహించి దేశంలో పెరిగి పోతున్న బ్యాంక్ మోసాలపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 200809 ఆర్థిక సంవత్సరంలో రూ.1860.09 కోట్ల విలువైన 4,372 బ్యాంకు మోసాలు జరగ్గా ఆ తర్వాతి సంవత్సరాల్లో ఈ మోసాల సంఖ్య , విలువ పెరుగుతూ వచ్చిందే తప్ప ఏ సంవత్సరం కూడా తగ్గుముఖం పట్టిన దాఖలాలు లేవని ఆర్‌బిఐ అందజేసిన వివరాలను బట్టి అర్థమవుతోంది.

Over Rs 2.05 lakh cr frauds in 11 years

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్యాంకుల మోసాలు 11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: