నెరవేరనున్న దశాబ్దాల కల…

  ప్రిన్సిపల్ సెక్రటరీతో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల సమావేశం సింగరేణి స్థలాల్లో కార్మికులకు పట్టాలు 1713 ఎకరాల సింగరేణి భూమి ప్రభుత్వానికి అప్పగింత 15వేల మంది కార్మికులకు ప్రయోజనం మంచిర్యాల : సింగరేణి కార్మికులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న వారి కల సిఎం కెసిఆర్ చొరవతో నెరవేరనుంది. సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న కార్మికులకు దశాబ్దాల కాలంగా పట్టాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్ నర్సింగరావు అధ్యక్షతన […] The post నెరవేరనున్న దశాబ్దాల కల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రిన్సిపల్ సెక్రటరీతో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల సమావేశం
సింగరేణి స్థలాల్లో కార్మికులకు పట్టాలు
1713 ఎకరాల సింగరేణి భూమి ప్రభుత్వానికి అప్పగింత
15వేల మంది కార్మికులకు ప్రయోజనం

మంచిర్యాల : సింగరేణి కార్మికులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న వారి కల సిఎం కెసిఆర్ చొరవతో నెరవేరనుంది. సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న కార్మికులకు దశాబ్దాల కాలంగా పట్టాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్ నర్సింగరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు బాల్కసుమన్, గండ్రవెంకటరమణ రెడ్డి, వనమావెంకటేశ్వర్‌రావు, ఆత్రం సక్కు, రేగా కాంతరావులు పాల్గొన్నారు. కాగా సిఎం చంద్రశేఖర్‌రావు 2018 ఫిబ్రవరి నెలలో శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన సింగరేణీల ఆత్మీయసమ్మేళనంలో పాల్గొన్నప్పుడు సింగరేణి స్థలాల్లో ఎంతో కాలంగా ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న కార్మికులకు ఇంటి స్థలాలపై పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

సిఎం హామీపై సింగరేణి సంస్థ ప్రత్యేక చొరవ తీసుకొని కార్మికులు ఇండ్లు నిర్మించుకున్న కంపెనీ స్థలాలు గతంలో ప్రభుత్వం ద్వార సింగరేణి సంస్థకు మైనింగ్ కార్యకలాపాలకోసం కేటాయించారు. ఈస్థలాలకు పట్టాలు మంజూరు కావడం కోసం వాటిని తిరిగి జిల్లా కలెక్టర్‌లకు అప్పగించారు. వీటితో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న సింగరేణి స్థలాలను గుర్తించి వాటిని కూడా ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకునేందుకు కలెక్టర్‌లకు అప్పగించారు. ఈవిధంగా ఆరు జిల్లాల్లో కలిపి 1.713 ఎకరాల భూమిని తిరిగి సింగరేణి యజమాన్యం ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో కంపెనీ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ద్వారా పట్టాలు అందించేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఈనెలాఖరు లోగా కార్మికులందరికి ఇండ్ల పట్టాలు లభించే అవకాశాలు ఉన్నాయి.

బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో బొగ్గుగనులు విస్తరించిఉండగా బెల్లంపల్లి కేంద్రంగా 1926లో బొగ్గు గనుల ప్రస్థానం మొదలైంది. అప్పటినుండి బొగ్గుగనుల అవసరాల కోసం సింగరేణి సంస్థ మండలంలోని భూదకలాన్ (పెద్దభూద) గ్రామ శివారులో సర్వేనెంబర్ 170లో ఉన్న వేలాధి ఎకరాల భూములను లీజుకు తీసుకుంది. ఈభూమిలో గనులు, వివిధడిపార్ట్‌మెంట్‌లు , నివాసాల కోసం క్వార్టర్లు నిర్మించగా గనులు మూతపడడంతో వివిధ డిపార్ట్‌మెంట్‌లు మూసివేతకు గురయ్యాయి. దాదాపు గత పదిహేను యేండ్లుగా సింగరేణి సంస్థ కార్యకలాపాలు కొనసాగడం లేదు. దీంతో కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇచ్చి భూమి యజమాన్యపు హక్కు కల్పించాలని మాజీకార్మికులకు పాతక్వార్టర్లను స్వాధీనం చేయాలని డిమాండ్ కొనసాగుతుంది.

శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో కూడా కార్మికులు నివసిస్తున్న ఇండ్లకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని దశాబ్దాల కాలంగా కోరుతున్నారు. అంతకు ముందు ఉన్న టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల హాయంలో కూడా హామీలు ఇచ్చినప్పటికి నెరవేర లేదు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పట్టాల వ్యవహారంపై దృష్టినికేంద్రికరించింది. గుర్తింపు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబిజికెఎస్ విజయంసాధించిన తర్వాత సిఎం కెసిఆర్ సింగరేణి ప్రాంతాలలో నివసిస్తున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించారు.

అంతేకాకుండా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా శాసనసభ సమావేశంలో పట్టాల సమస్యను లేవనెత్తారు. మూడు ఏరియాల్లో ఎన్నో యేండ్లుగా నివాసం ఉంటున్న కార్మికులు, కార్మికేతరులకు భూమి అప్పగించేందుకు సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆరు నెలలుగా ఎన్నికల కోడ్ ఉండడంతో కొద్దిపాటి జాప్యం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఈనెలాఖరులోగా అందరికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ప్రాంతాలలో ఉన్న కార్మికులు, కార్మికేతరులకు పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది.

మూడు ఏరియాల్లో 1.713 ఎకరాల సింగరేణి భూమిని ఇప్పటికే ప్రభుత్వానికి అప్పగించారు. శ్రీరాంపూర్ ఏరియాలో 176.18 ఎకరాల భూమి అవసరం ఉందని గుర్తించి దానిని కూడా ప్రభుత్వానికి అప్పగించారు. ఈభూముల్లో అధికారులు అన్ని రకాల సర్వే పనులు కూడా ముగించారు. బెల్లంపల్లి ఏరియాల్లో కొంత మంది కార్మికులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రోసిడింగ్స్ కూడా సిద్దం చేసినట్లు సమాచారం. మిగితా రెండు ప్రాంతాల్లో కొద్దిరోజుల్లోనే పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులకు పట్టాలు ఇచ్చే వ్యవహారంపై జిల్లా కలెక్టర్ భారతీహోళికేరి కూడా మార్గదర్శకాలు అందాయి. ఈనేపథ్యంలో ధరఖాస్తులు స్వీకరించడాన్ని ప్రారంభించారు. ఏదిఎమైనా దశాబ్దాల కాలంగా పట్టాలు లేకుండా ఇబ్బందులకు గురవుతున్న కార్మికులు ప్రస్తుతం సిఎం కెసిఆర్ చొరవతో పట్టాలు అందుతుండడంతో కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Full rights for Workers who built Houses in Singareni

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నెరవేరనున్న దశాబ్దాల కల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: