ఇది వనపర్తి మహిళల బ్రాండ్

    అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని వాటితో కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తే స్థానికంగానే ఉపాధి పొందే అవకాశాలు చాలా ఉంటాయి. వనపర్తి జిల్లాకు చెందిన మహిళా సంఘాల సభ్యులు ఇదే పని చేశారు. వనపర్తిలో ఎగుమతి చేసే నాణ్యత కల్గిన వేరుశనగ పంట పండుతుంది. దీని ఆధారంగా చేసుకొని ఇక్రిశాట్ సౌజన్యంతో వనపర్తి మండల మహిళా సమాఖ్య సభ్యులు వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. బ్రాండ్ వనపర్తి ఉత్పత్తులతో విజయాన్ని సాధించారు.. […] The post ఇది వనపర్తి మహిళల బ్రాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని వాటితో కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తే స్థానికంగానే ఉపాధి పొందే అవకాశాలు చాలా ఉంటాయి. వనపర్తి జిల్లాకు చెందిన మహిళా సంఘాల సభ్యులు ఇదే పని చేశారు. వనపర్తిలో ఎగుమతి చేసే నాణ్యత కల్గిన వేరుశనగ పంట పండుతుంది. దీని ఆధారంగా చేసుకొని ఇక్రిశాట్ సౌజన్యంతో వనపర్తి మండల మహిళా సమాఖ్య సభ్యులు వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. బ్రాండ్ వనపర్తి ఉత్పత్తులతో విజయాన్ని సాధించారు..

వనపర్తి వేరుశనగ పంటకు అక్షయపాత్ర వంటింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వేరుశనగ పండించే జిల్లా వనపర్తి. ఇక్కడి నేలల స్వభావం కారణంగా అప్లోటాక్సిన్ అనే శిలీంద్రం లేకుండా ఉత్పత్తి వస్తుంది. ప్రతి సంవత్సరం లక్షల క్వింటాళ్ల వేరుశనగ దేశ, విదేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే వనపర్తి జిల్లాలో వేరుశనగ ఉత్పత్తుల ఆధారంగా ఏర్పడిన పరిశ్రమలు ఏమీ లేవు. మహిళా సంఘాల నేతృత్వంలో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పించవచ్చని భావించారు కలెక్టర్ శ్వేతామహంతి. తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఇక్రిశాట్ అధికారులతో మాట్లాడారు. వారు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. వనపర్తి మండల పరిధిలోని దత్తాయపల్లి గ్రామంలో గత ఏడాది బెంగళూరు, ఢిల్లీ నుండి యంత్రాలను తెప్పించి యూనిట్‌ను ఏర్పాటు చేశారు.

 

 

అదే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు, ఇద్దరు టెక్నీషియన్స్ దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు మూడు రకాల వేరుశనగ ఉత్పత్తులను బ్రాండ్ వనపర్తి పేరుతో మార్కెట్ చేస్తున్నారు. మహిళా సమాఖ్య సంఘాల్లో సభ్యులుగా ఉన్నప్పటికి రుణాలు తీసుకోవడం, చెల్లించడం మాత్రమే ఉండేది. స్వయం ఉపాధి కోసం 100 రోజుల పనికి పోయేవాళ్లు. ఈ యూనిట్ ఏర్పాటుకు సెర్బ్, సిబిఎఫ్ నుండి నిధులు రూ. 50 లక్షలు వచ్చాయి. “మా మహిళా సమాఖ్య నుంచి ముడి సరుకుల కోసం రూ. 8 లక్షలు పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతం చిక్కీ, గానుగ నూనె, ఉత్పత్తి చేస్తున్నాం. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఉత్పత్తులను పరిశీలన చేస్తున్నారు. మార్కెట్‌లో ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది” అంటూ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తిరుపతమ్మ ఆనందం వ్యక్తం చేస్తోంది.

బట్టర్.. చిక్కీలు..
ప్రస్తుతం ఇక్కడ తీసే గానుగ నూనెను కొనుగోలు చేసేందుకు త్వరలో ఆయిల్ ఫెడ్‌తో ఒప్పందం కుదరనుంది. ఇక పీనట్ బట్టర్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసి అంగన్‌వాడీల్లోని పిల్లలకు పోషకాహారం కింద అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేరుశనగ చిక్కీలకు స్థానికంగా మంచి డిమాండ్ ఉంది. ఈ యూనిట్‌లో రోజుకు 48 లీటర్ల గానుగ నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. పీనట్ బట్టర్ ఆర్డర్ వస్తే రోజుకు రెండు క్వింటాళ్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇక చిక్కీ లు రోజుకు 780 బార్స్ తయారు చేస్తున్నారు. ఒ క్కో చిక్కీ బార్‌ను రూ. 9లకు విక్రయిస్తున్నా రు. అలాగే లీటర్ గానుక నూనె రూ. 205గా ఉంది. రానున్న కాలంలో ప్రభు త్వ సహకారంతో మరిన్ని ఉత్పత్తులు చేసి వనపర్తి బ్రాండ్‌ను దేశ, విదేశాలకు విస్తరిస్తామని మహిళా సం ఘం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశ ఫలించాలని కోరుకుందాం.

Groundnut Processing Centre Started At Wanaparthy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇది వనపర్తి మహిళల బ్రాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: