మూడు రోజుల మార్కెట్ లాభాలకు బ్రేక్

నష్టాల్లో ముగిసిన సూచీలు ముంబయి: మూడు రోజుల స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. కీలక రిటైల్ ద్రవ్యోల్బణం, ఐఐపి గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో మారెట్లలో ఊగిసలాట ధోరణి కనిపించింది. ప్రారంభంలో మార్కెట్లు నష్టాలతో మొదైనాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెన్సెక్స్ 193 పాయింట్లు నష్టపోయి 39,756 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 11,906 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. బుధవారం ట్రేడింగ్‌లో టాటాస్టీల్ షేర్లు […] The post మూడు రోజుల మార్కెట్ లాభాలకు బ్రేక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నష్టాల్లో ముగిసిన సూచీలు

ముంబయి: మూడు రోజుల స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. కీలక రిటైల్ ద్రవ్యోల్బణం, ఐఐపి గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో మారెట్లలో ఊగిసలాట ధోరణి కనిపించింది. ప్రారంభంలో మార్కెట్లు నష్టాలతో మొదైనాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెన్సెక్స్ 193 పాయింట్లు నష్టపోయి 39,756 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 11,906 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. బుధవారం ట్రేడింగ్‌లో టాటాస్టీల్ షేర్లు బాగా లాభపడగా, యస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. లోహాలు, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్లు నష్టపోయాయి.

రిలయన్స్ క్యాపిటల్ షేర్లు 7 శాతం నష్టపోయాయి. ప్రైస్ వాటర్ హౌస్ ఆడిటర్లు కంపెనీనుంచి తప్పుకోవడంతో ఆ ప్రభావం కంపెనీ షేర్లపై పడింది. ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా షేర్లు వరసగా అయిదో రోజు ట్రేడింగ్‌లోను దిగజారాయి. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ ఈ సంస్థ గ్రేడింగ్‌ను తగ్గించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక యస్ బ్యాంక్ షేర్లు 3 శాతం నష్టపోయాయి. ఈ బ్యాంక్‌కు చెందిన ఫారిన్ కరెన్సీ ఇష్యూవర్ రేటింగ్‌ను మూడీస్ తగ్గించనుందన్న వార్తలు దీనికి కారణం. మరో పక్క ఆసియా మార్కెట్లలో జపాన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిసాయి.

Sensex snaps 3-day gaining streak, slips 194 pts

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడు రోజుల మార్కెట్ లాభాలకు బ్రేక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: