వరుణ్ తేజ్‌ కారుకు ప్రమాదం…

హైదరాబాద్: మెగా హీరో వరుణ్ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్‌ తేజ్‌ కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  అయితే, ఈ ప్రమాదం నుంచి వరుణ్ సురక్షితంగా బయటపడ్డాడు. షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో వరుణ్ ప్రయాణిస్తున్న కారు ధ్వంసమవడంతో మరో కారులో షూటింగ్‌కు వెళ్లిపోయారు. […] The post వరుణ్ తేజ్‌ కారుకు ప్రమాదం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్: మెగా హీరో వరుణ్ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్‌ తేజ్‌ కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  అయితే, ఈ ప్రమాదం నుంచి వరుణ్ సురక్షితంగా బయటపడ్డాడు. షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.
ఈ ప్రమాదంలో వరుణ్ ప్రయాణిస్తున్న కారు ధ్వంసమవడంతో మరో కారులో షూటింగ్‌కు వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంపై వరుణ్ తేజ్ స్పందించారు. ‘‘రోడ్డు ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు అందరం సురక్షితం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నాపై మీ ప్రేమాభిమానాలు చూపించినందుకు ధన్యవాదాలు.’’ అని సోషల్ మీడియా ద్వారా వరుణ్ తెలిపారు.
Hero Varun Tej car accident at Wanaparthy

The post వరుణ్ తేజ్‌ కారుకు ప్రమాదం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: