క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

ఆరుగురు అరెస్టు, పరారీలో నలుగురు రూ.8లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మనతెలంగాణ/హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 10మంది ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆరుగురిని అరెస్టు చేయగా, నలుగురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.8లక్షల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన జైనీ రూపాని, నజిం జిలాని, మోహిత్ జైన్, నిఖార్ మహేశ్వరీ, రాహుల్ జైన్, వైభవ్ సాల్వి, […] The post క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆరుగురు అరెస్టు, పరారీలో నలుగురు
రూ.8లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 10మంది ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆరుగురిని అరెస్టు చేయగా, నలుగురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.8లక్షల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన జైనీ రూపాని, నజిం జిలాని, మోహిత్ జైన్, నిఖార్ మహేశ్వరీ, రాహుల్ జైన్, వైభవ్ సాల్వి, బరఖాత్ లలాని, దినేష్ సలీం, సోహైల్, సాహిల్‌లు ముఠాగా ఏర్పాడి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ముఠాలో నాయకుడు బరఖాత్ లలానీ, దినేష్ సలీం, సోహైల్, సాహిల్ పరారీలో ఉన్నారు. ముఠా నాయకుడు బర్‌ఖాత్ లలానీ సికింద్రాబాద్‌లోని సింధీకాలనీకి చెందినవాడు.

విలాసాలకు అలవాటుపడ్డ లలానీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. స్నేహితులతో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. వారిని అరెస్టు చేయడంతో బరఖాత్ అమెరికాకు పారిపోయాడు. 2019 ఐపిఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బెట్టింగ్ నిర్వహించాడు. స్నేహితులు దినేష్, సోహైల్, సాహిల్, జైనిల్, నిజాం ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. మొబైల్ యాప్ మ్యాచ్‌బాక్స్9.డేచ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బారఖాత్ తరఫున గోవాలో ఉంటూ వీరు బెట్టింగ్ నిర్వహించారు. తమ స్నేహితుల ద్వారా పరిచయమైన వారిని బెట్టింగ్, పంటర్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ కట్టేవారి వద్ద నుంచి అడ్వాన్సుగా డబ్బులు తీసుకుని మొబైల్ యాప్ లింక్‌ను ఇచ్చే వారు. సికింద్రాబాద్ ఏరియాకు చెందిన మోహిత్ జైన్, నిఖార్, రాహుల్, వైభవ్ ఏజెంట్ల ద్వారా ఆపరేటింగ్ చేసేవారు. పంటర్స్ నుంచి వచ్చిన డబ్బులను తీసుకుని డానిష్, సోహైల్‌కు తెలిపే వారు. ఈ విధంగా బెట్టింగ్ నిర్వహించినందుకు 3శాతం కమీషన్ తీసుకుంటున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ మధు మోహన్ రెడ్డి, ఎస్సై కెఎన్ ప్రసాద్ వర్మ, శ్రీశైలం, నరేందర్, ఎండి తకియుద్దిన్ పాల్గొన్నారు.

Cricket betting racket arrested by Hyd Police

The post క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: