డీజిల్ లేకపోవడంతో నిలిచిన 108 సేవలు…

  కామారెడ్డి : అత్యవసర పరిస్థితుల్లో, ఎక్కడైనా ప్రమాదం జరిగినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది 108. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ కొట్టగానే నిమిషాల్లోనే వచ్చి పేషంట్‌ను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్ళి ప్రాణాలు నిలబెట్టే 108 సేవలు గత 4 నాలుగు రోజులుగా నిలిచిపోయాయి. 108 వాహనాలకు డీజిల్ లేకపోవడంతో వాహనాలు నిలిచిపోయినట్లు తెలిసింది. జిల్లా మొత్తంగా 108 వాహనాలు 13 ఉండగా కేవలం బాన్సువాడ, జుక్కల్‌లో 2 వాహనాలు మాత్రమే ప్రస్తుతం పని […] The post డీజిల్ లేకపోవడంతో నిలిచిన 108 సేవలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కామారెడ్డి : అత్యవసర పరిస్థితుల్లో, ఎక్కడైనా ప్రమాదం జరిగినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది 108. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ కొట్టగానే నిమిషాల్లోనే వచ్చి పేషంట్‌ను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్ళి ప్రాణాలు నిలబెట్టే 108 సేవలు గత 4 నాలుగు రోజులుగా నిలిచిపోయాయి. 108 వాహనాలకు డీజిల్ లేకపోవడంతో వాహనాలు నిలిచిపోయినట్లు తెలిసింది. జిల్లా మొత్తంగా 108 వాహనాలు 13 ఉండగా కేవలం బాన్సువాడ, జుక్కల్‌లో 2 వాహనాలు మాత్రమే ప్రస్తుతం పని చేస్తున్నట్లు తెలిసింది. మిగతా వాహనాలకు డీజిల్ లేకపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి.

అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసినా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో రోడ్డు పై 108 వాహనం యొక్క కుయ్…కుయ్… చప్పుళ్ళు లేక రహదారులు మూగబోయాయి. డీజిల్‌తో పాటు సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో పాటు డీజిల్ లేక 108 వాహనాలు కదలలేని దుస్థితి జిల్లాలో నెలకొంది. 108 వాహనాలను జివికె సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నా వారు సరియైన సమయంలో జీతాలు ఇవ్వకపోవడంతో పాటు డీజిల్‌ను ఇవ్వకపోవడంతోనే వాహనాలు నిలిచిపోయినట్లు తెలిసింది.

108 వాహనాలు నిలిచిపోవడంతో నిరుపేదలకు వైద్యసేవలు అందలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జాతీయ రహదారితో పాటు ఇతర రాష్ట్రీయ రహదారులు ఉండగా ఎక్కువగా జాతీయ రహదారుల పై ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైనా 108కు ఫోన్ చేయగానే నిమిషాల్లో వచ్చే వాహనాలు గత నాలుగు రోజులుగా వాహనాలు రాకపోవడంతో ప్రమాదాలకు గురైన వారు ఆటోలలో, ఇతర వాహనాలలో ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎవరైనా 108 సిబ్బందికి ఫోన్ చేస్తే తమ వాహనాలలో డీజిల్ లేదనే సమాదానం చెప్పుతున్నారని పలువురు తెలిపారు.

108 సేవలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొందని 108 సేవల్లో పాల్గొనే సిబ్బంది మన తెలంగాణతో తెలిపారు. అత్యవసర పరిస్థితిల్లో ఆదుకునే ఆపద్భందువులాంటి 108కు ఇబ్బందులు రావడం సరికాదని 108 వాహనాలకు సరిపడే డీజిల్‌తో పాటు పని చేసే సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని ప్రజలు కోరుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి 108 వాహనాలకు కలిగిన ఇబ్బందులను తెలుసుకొని సత్వరమే చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

 

108 Services stopped due to Diesel

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డీజిల్ లేకపోవడంతో నిలిచిన 108 సేవలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: