సిఎం లక్ష్యం నెరవేర్చలి.. రైతుల రుణం తీర్చుకోవాలి: సిఎండి ప్రభాకర్

  హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకాని జూన్ 21వ తేదీన ప్రారంభించిలని సిఎం కెసిఆర్ నిర్ణయించినందున నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. గోదావరి నుంచి 2 టిఎంసిల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేశామని ఆయన అన్నారు. కొన్ని రిజర్వాయర్ల పనులు, లిప్టుల పనులు ఇంకా జరుగుతున్నాయని, ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల డిమాండ్ వచ్చే […] The post సిఎం లక్ష్యం నెరవేర్చలి.. రైతుల రుణం తీర్చుకోవాలి: సిఎండి ప్రభాకర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకాని జూన్ 21వ తేదీన ప్రారంభించిలని సిఎం కెసిఆర్ నిర్ణయించినందున నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. గోదావరి నుంచి 2 టిఎంసిల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేశామని ఆయన అన్నారు. కొన్ని రిజర్వాయర్ల పనులు, లిప్టుల పనులు ఇంకా జరుగుతున్నాయని, ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి 3 టిఎంసిల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినందున, మరో 2,160 మెగావాట్లు అదనంగా అవసరం అవుతుందని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,152 మెగావాట్లు విద్యుత్తు అందించడానికి సిద్దమవుతున్నట్టు అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 2,890 కోట్ల వ్యయంతో విద్యుత్త్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభాకర్ రావు తెలిపారు.

మొత్తం 15 డెడికేటెడ్ సబ్ స్టేషన్లు నిర్మించామని, వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించామన్నారు. గతంలో 30 మెగావాట్లు విద్యుత్త్ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉందని, సముద్రమట్టానికి 618 మీటర్టకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి తెలంగాణ బీళ్లకు నదుల నీళ్లను మళ్లించే బృహత్ కార్యానికి విద్యుత్ సంస్థలు పూనుకున్నాయి. తెలంగాణ రైతులకు సాగునీరు అందించే అతిపెద్ద క్రతువులో విద్యత్ శాఖది చాలా కీలక ప్రాత అని ప్రభాకర్ రావు తెలియజేశారు. విద్యత్ సంస్థల ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని,  కోటికి పైగా  ఎకరాలకు సాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో సిఎం కెసిఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టుల ద్వారా అనుకున్న విధంగా నీటిని ఎత్తిపోసే బాధ్యత విద్యుత్ ఉద్యోగలపై ఉందని, నిర్ణీత గడువులోగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి లిప్టులను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి సమర్థతను చాటుకోవాలన్నారు.  సిఎం కెసిఆర్ లక్ష్యం నెరవేర్చలి… రైతుల రుణం తీర్చుకోవాలని ప్రభాకర్ రావు అన్నారు.

Kaleshwaram project to be inaugurated on June 21

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సిఎం లక్ష్యం నెరవేర్చలి.. రైతుల రుణం తీర్చుకోవాలి: సిఎండి ప్రభాకర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: