పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్య నేరం…

  వికారాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లల్ని పనులకు పంపకుండా బడికి పంపించాలని సర్పంచ్ విజయరాజు, మాజీ మండల ఉపాధ్యక్షుడు కె.రాములు తెలిపారు. వికారాబాద్ మండల పరిధిలోని మదన్‌పల్లి గ్రామంలో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామంలోని ప్రతి పిల్లవాడు బడికి వెళ్ళే విధంగా తగు చర్యలు తీసుకుంటామని వారు నిర్ణయం తీసుకున్నారు. పిల్లల చేత వెట్టి చాకిరి, […] The post పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్య నేరం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వికారాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లల్ని పనులకు పంపకుండా బడికి పంపించాలని సర్పంచ్ విజయరాజు, మాజీ మండల ఉపాధ్యక్షుడు కె.రాములు తెలిపారు. వికారాబాద్ మండల పరిధిలోని మదన్‌పల్లి గ్రామంలో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామంలోని ప్రతి పిల్లవాడు బడికి వెళ్ళే విధంగా తగు చర్యలు తీసుకుంటామని వారు నిర్ణయం తీసుకున్నారు.

పిల్లల చేత వెట్టి చాకిరి, హోటళ్ళలో, దుకాణాలలో పని చేయించుకున్నట్లయితై వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వారు హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. బడి ఈడు పిల్లలను తప్పని సరిగా బడికి పంపాలనే నినాదంతో ప్రపంచ బాల కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ కో ఆర్డినేటర్ ఎన్.శ్యాంసుందర్, సతీష్, మదన్‌పల్లి గ్రామ పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Do not Take the Children to Work

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్య నేరం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: