సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించండి : హరీశ్ రావు

మన తెలంగాణ / సిద్దిపేట ప్రతినిధి :  సమాజంలో మార్పు రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి, ఎంఎల్ఎ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టిటిసి భవనంలో ఏర్పాటు చేసిన షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. చెట్లు లేకపోవడంతోనే పర్యావరణం దెబ్బతినడంతో పాటు ఎండ తీవ్రత ఎక్కువవుతుందన్నారు. దీంతో అనేక […] The post సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించండి : హరీశ్ రావు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ / సిద్దిపేట ప్రతినిధి :  సమాజంలో మార్పు రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి, ఎంఎల్ఎ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టిటిసి భవనంలో ఏర్పాటు చేసిన షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. చెట్లు లేకపోవడంతోనే పర్యావరణం దెబ్బతినడంతో పాటు ఎండ తీవ్రత ఎక్కువవుతుందన్నారు. దీంతో అనేక మంది వడదెబ్బకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంతు బాధ్యతగా ప్రజలందరూ ముందుకు వచ్చి చెట్లను పెంచాలన్నారు. ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు సంభవిస్తున్నాయన్నారు. ప్లాస్టిక్‌ను నివారించడంలో సిద్దిపేట ముందుండాలన్నారు. ప్లాస్టిక్‌ను వాడకుండా జ్యూట్ బ్యాగులను వాడాలన్నారు. ప్రజలు తలుచుకుంటేనే ఏ పనైనా సులువవుతుందన్నారు. ప్లాస్టిక్ నివారణ మార్పు సిద్దిపేట నుండే ప్రారంభించుదామన్నారు. వ్యవసాయరంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. రసాయన ఎరువులతో పండించిన పంటలు తినడంతో ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. రైతన్నలు సేంద్రీయ పంటలు పండించే విధంగా ముందుకు సాగాలన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో నిజమైన సంతోషం కలుగుతుందన్నారు. భావితరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పెద్ద ఎత్తున చెట్లు పెంచాల్సిందేనన్నారు. ప్రస్తుతం తాగే నీళ్లను బాటిళ్ల ద్వారా కొనుక్కొవాల్సి వస్తుందని, చెట్లు పెంచకపోతే రానున్న కాలంలో గాలి కొనే పరిస్థితి నెలకొంటుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిరంతరం సేవలందించడమే తన ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సైతం ముందుకు వచ్చి విధిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించి తనకు బహుమతిగా ఇవ్వాలన్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో రైతుల్లో ఎంతో విశ్వాసం పెరిపోయిందన్నారు. పెరిగిన పింఛన్లు ఈ నెల నుంచి అందించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 181 మందికి షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు రాజనర్సు, వేలేటి రాధాకృష్ణశర్మ, జాప శ్రీకాంత్‌రెడ్డి, కోల రమేష్, పాల సాయిరాం, గుడాల శ్రీకాంత్ గౌడ్, ఉమేష్, అల్లం ఎల్లం, రవి తదితరులు ఉన్నారు.

Focus On Organic Farming : Harish Rao

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించండి : హరీశ్ రావు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: