విధిగా హెల్మెట్ ధరించండి : ఎస్పీ శశిధర్‌రాజు

లక్ష్మణచాంద (నిర్మల్) :  కుటుంబాల పై ప్రేమ ఉంటే కచ్చితంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపాలని, బయటకెళ్లి ఇంటికి వచ్చేంత వరకు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు  ఎదురు చూస్తారని, హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు.  లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్(డబ్లు) గ్రామంలో బుధవారం ఉదయం వేకువ జామున ఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ధృవీకరణ పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 01 ఆటో, […] The post విధిగా హెల్మెట్ ధరించండి : ఎస్పీ శశిధర్‌రాజు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్ష్మణచాంద (నిర్మల్) :  కుటుంబాల పై ప్రేమ ఉంటే కచ్చితంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపాలని, బయటకెళ్లి ఇంటికి వచ్చేంత వరకు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు  ఎదురు చూస్తారని, హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు.  లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్(డబ్లు) గ్రామంలో బుధవారం ఉదయం వేకువ జామున ఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ధృవీకరణ పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 01 ఆటో, రూ.11వేల విలువ గల అక్రమ మద్యాన్ని స్వాధినం చేసుకున్నారు.ఈ సందర్బంగా ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ తో పాటు ప్రజల్లో నమ్మకం కల్పించడంతో పాటు నేరాల నియంత్రణ, నిందితుల గుర్తించడం కోసం ఈ కార్డన్ సర్చ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ,గ్రామాల పరిధిలోని 24ఎక్స్ 7 నిఘా కోసం బ్లూకోల్ట్ పెట్రో కారు బృందాలను ప్రారంభించడం జరిగిందని ఆయన చెప్పారు. గ్రామాల్లోగానీ, పట్టణాల్లోగానీ, కాలనీల్లోగానీ ఎవరైన అనుమానితులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని ఆయన సూచించారు. అలాగే గ్రామాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒక సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానం ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎంపిటిసి గుజ్జరి గణేష్,నాయకులు జీవన్‌రెడ్డి, ఉపసర్పంచ్ పడిగెల లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో శాలువాతో ఎస్పీని సత్కరించారు. ప్రతి నిత్యం హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తున్న గ్రామంలోని ఇద్దరిని గుర్తించి ఎస్పీ వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐలు జాన్ దివాకర్, రమేష్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డి,లక్ష్మణచాంద ఎస్‌ఐ కొల్లూరి వినయ్‌కుమార్, రవీందర్, 100 మంది పోలీస్ సిబ్బందితో పాటు మాజీ సర్పంచ్ బోడ రాజేశ్వర్, గంగాధర్‌గౌడ్,గంగారెడ్డి, గ్రామస్తులు ఈర అనిల్, లక్పతిరెడ్డి,శ్రీకాంత్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Wear Helmet : Nirmal SP Sasidhar Raju

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విధిగా హెల్మెట్ ధరించండి : ఎస్పీ శశిధర్‌రాజు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: