ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలు : స్పీకర్ పోచారం

బాన్సువాడ టౌన్ (కామారెడ్డి):  ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలని, ఉపాధ్యాయులు దేవుళ్లని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మంచి విద్యా బోధన అందుతుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని సియూపిఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. మొదటి రోజు కావడంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, పాఠశాలలు మొదటి రోజు నుంచే ఉపాధ్యాయులు విద్యార్థుల […] The post ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలు : స్పీకర్ పోచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బాన్సువాడ టౌన్ (కామారెడ్డి):  ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలని, ఉపాధ్యాయులు దేవుళ్లని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మంచి విద్యా బోధన అందుతుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని సియూపిఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. మొదటి రోజు కావడంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, పాఠశాలలు మొదటి రోజు నుంచే ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూడాలన్నారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలో విద్యుత్ సమస్య ఎందుకు ఉందని ప్రశ్నించారు. వేసవి కాలం కావడంతో వేసవిలో వైర్లు తెగిపోయాయని, వైర్లు కనెక్షన్లు సరిచేస్తామని ఉపాధ్యాయులు చెప్పారు. ఈ సందర్బంగా తరగతి గదులన్ని స్పీకర్ తిరిగి పరిశీలించారు. బెంచీలపై దుమ్మును చూసి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయుడు విఠల్‌కు సూచించారు. పాఠశాలలోని తరగతి గదిలో గల విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంవత్సరంలో 232 రోజులు పాఠశాలలు పనిచేస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి విద్యా బోధన జరుగుతుందని, బడుగు, బలహీన వర్గాల పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కొనసాగిస్తుందని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్య మెరుగ్గా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మెరిట్ ఆధారంగా ఎంపికై మంచి అనుభవజ్ఞులుంటారని ఆయన పేర్కొన్నారు. ఎవరి సిఫారసుతోనో, రికమండేషన్స్‌తో రారని, మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయులను భర్తీ చేస్తారన్నారు. ఉపాధ్యాయుల సేవలను వాడుకోవాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు కట్టి అప్పుల పాలు అయ్యే బదులు ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్యా బోధన జరుగుతుందని, ఈ క్రమంలో తమ పిల్తలను తల్లిదండ్రులు  ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులతో పాటు మంచి భవనాలు, ఆహ్లాదకర వాతావరణంలో మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన జరుగుతుందన్నారు. పదవ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుబాటులో తీసుకుని రావడం జరిగిందని, పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశ్యంతో వారానికి మూడు సార్లు గుడ్లను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన వారికి హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల, బాలుర హాస్టళ్లలో వసతులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన విద్యార్థులు సంబంధిత ఉపాధ్యాయులకు తెలియజేస్తే వార్డెన్లతో మాట్లాడి వసతులు కల్పిస్తామన్నారు. కూలీ, నాలీ చేసుకునే తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు కట్టే బదులు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలన్నారు. సియుపిఎస్ పాఠశాలలో గతంలో భయంకర వాతావరణం ఉండేదని, ప్రహరీ గోడ లేకపోవడంతో పందులు, గాడిదలు, కుక్కలు లోపలికి వచ్చే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మండమైన భవనం, ప్రహరీ కట్టించి అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. పాఠశాలలో బాలికలకు టాయిలెట్స్ ఉన్నాయని, బాలురకు లేవని ప్రధానోపాధ్యాయులు తమ దృష్టికి తీసుకుని రావడం జరిగిందని, త్వరలోనే మూత్రశాలలు కట్టిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు ప్రైవేట్ పాఠశాలలో ఉండవన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం రోజు కావడంతో హైదరాబాద్ నుంచి బయలుదేరి రావడం జరిగిందన్నారు. మొదటి రోజు కాబట్టి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, అన్ని క్లాసుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున క్లాసులు సరిగ్గా జరుగడం లేదని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ, రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించామని, మరికొన్ని ప్రారంభిస్తున్నామన్నారు. పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఈ సంవత్సరంతో కలుపుకుని 908 రెసిడెన్షియన్స్ స్కూళ్లు నడిపిస్తున్నామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాఠశాలల మొదటి రోజు నుంచే మంచి విద్యా బోధన అందించి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకుని రావాలన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అన్ని వసతులతో పాఠశాలల్లో విద్యను అందించాలన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు మంచి విద్యా బోధన అందించేందుకు కృషిచేయాలన్నారు. ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విఠల్, సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, నాయకులు జంగం గంగాధర్, ఎజాస్, కొత్తకొండ భాస్కర్, బాబా, టీఆర్‌ఎస్ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు స్పీకర్ తో పాటు ఉన్నారు.

Public Schools Are Temples : Speaker Pocharam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలు : స్పీకర్ పోచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: