అతి పెద్ద మంచినీటి సరస్సు

ఈ బైకాల్ సరస్సు రష్యాలోని సైబీరియా ప్రాంతం లో ఉంది. చంద్రవంక ఆకారంలో ఉండే ఈ అందమైన సరస్సును పర్ల్ ఆఫ్ రష్యా అని పిలుస్తారు. * లేక్ బైకాల్ అతిపెద్ద మంచి నీటి సరసుల్లో ఒకటి. ఎత్తయిన పర్వతాలు, కొండల మధ్య ఇంచుమించు 636 కిలోమీటర్ల పొడవు, 20 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రపంచంలో లోతైన సరస్సు ఇదే. దాదాపు 5,387 అడుగుల లోతు ఉంటుంది. అంతేకాదూ.. ప్రపంచంలో గడ్డ కట్టని మంచినీటిలో […] The post అతి పెద్ద మంచినీటి సరస్సు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఈ బైకాల్ సరస్సు రష్యాలోని సైబీరియా ప్రాంతం లో ఉంది. చంద్రవంక ఆకారంలో ఉండే ఈ అందమైన సరస్సును పర్ల్ ఆఫ్ రష్యా అని పిలుస్తారు.
* లేక్ బైకాల్ అతిపెద్ద మంచి నీటి సరసుల్లో ఒకటి. ఎత్తయిన పర్వతాలు, కొండల మధ్య ఇంచుమించు 636 కిలోమీటర్ల పొడవు, 20 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రపంచంలో లోతైన సరస్సు ఇదే. దాదాపు 5,387 అడుగుల లోతు ఉంటుంది. అంతేకాదూ.. ప్రపంచంలో గడ్డ కట్టని మంచినీటిలో 20 శాతం నీరు ఈ సరస్సులోనే ఉంటుంది.
* ఈ సరస్సు తీర ప్రాంతం పొడవు 2,100 కిలోమీటర్లు.
* బైకాల్ సరస్సులో ఇంచుమించు 30 దీవులు వరకూ ఉంటాయి. వీటిల్లో ఒకటి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరస్సు దీవి. ఈ సరస్సులోని ఒల్కహాన్ అనే దీవిలో ఊళ్లు కూడా ఉంటాయి. అందులో 1500 జనాభా ఉంటుంది.
* పురాతనమైన సరస్సుల్లో ఇదీ ఉంది. ఎప్పుడో ఇంచుమించు 25 మిలియన్ ఏళ్ల క్రితమే ఏర్పడిందట. ఎత్తయిన నేలల మధ్యనో, పర్వత శ్రేణుల మధ్యనో భౌగోళిక మార్పుల ఫలితంగా లోతైన ప్రదేశం ఏర్పడినప్పుడు దాన్ని ‘రిఫ్ట్ వ్యాలీ’ అంటారు. ఈ రకంగానే ప్రాచీన కాలంలోనే ఈ బైకాల్ సరస్సు ఏర్పడింది.

Lake Baikal Russia

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అతి పెద్ద మంచినీటి సరస్సు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.