మెదడువాపు వ్యాధితో 36 మంది పిల్లలు మృతి

  పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో రెండు రోజుల వ్యవధిలో మెదడువాపు వ్యాధితో 36 మంది పిల్లలు చనిపోయారు. ప్రస్తుతం 133 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స తీసుకుంటున్న వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్యపరిభాషలో హైపోగ్లైసీమియా అంటారని వైద్యులు చెప్పారు. ముజఫర్‌పూర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలన్నీ మెదడువాపు లక్షణాలు కలిగిన చిన్నారులతో నిండిపోయిందని ప్రభుత్వాధికారులు వెల్లడించారు. అధిక […] The post మెదడువాపు వ్యాధితో 36 మంది పిల్లలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 


పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో రెండు రోజుల వ్యవధిలో మెదడువాపు వ్యాధితో 36 మంది పిల్లలు చనిపోయారు. ప్రస్తుతం 133 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స తీసుకుంటున్న వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్యపరిభాషలో హైపోగ్లైసీమియా అంటారని వైద్యులు చెప్పారు. ముజఫర్‌పూర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలన్నీ మెదడువాపు లక్షణాలు కలిగిన చిన్నారులతో నిండిపోయిందని ప్రభుత్వాధికారులు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రత జ్వరం రావడం, మానసిక ఆందోళన తరచుగా ఉద్వేగానికి లోనుకావడం, కోమా వంటి లక్షణాలు కనిపిస్తే మెదడువాపు వ్యాధిననే డాక్టర్లు తెలిపారు. పిల్లలను ఖాళీ కడుపుతో పడుకోబెట్టడంతో చిన్నారులలో గ్లూకోజ్ స్థాయి తగ్గే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

 

50 Childrens Deaths Due to Hypoglycemia in Bihar

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మెదడువాపు వ్యాధితో 36 మంది పిల్లలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: