అందుకే అతడిని చంపారట…

ఉత్తర కొరియా : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ్ముడు కిమ్ జోంగ్ నామ్ 2017లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో నామ్ పై ఇద్దరు మహిళలు విష ప్రయోగం చేసి చంపేశారు. ఈ ఘటనకు వియత్నాం, ఇండోనేషియాకు చెందిన ఇద్దరు మహిళలే కారణమని, వారిని అరెస్టు చేశారు. అయితే నామ్ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. సోమవారం వాల్ స్ట్రీట్ జనరల్ […] The post అందుకే అతడిని చంపారట… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఉత్తర కొరియా : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ్ముడు కిమ్ జోంగ్ నామ్ 2017లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో నామ్ పై ఇద్దరు మహిళలు విష ప్రయోగం చేసి చంపేశారు. ఈ ఘటనకు వియత్నాం, ఇండోనేషియాకు చెందిన ఇద్దరు మహిళలే కారణమని, వారిని అరెస్టు చేశారు. అయితే నామ్ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. సోమవారం వాల్ స్ట్రీట్ జనరల్ నామ్ హత్యపై ప్రత్యేక కథనం రాసింది. నామ్ సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ (సిఐఎ) ఏజెంట్ గా పని చేసేవాడని, అందుకే అతడిని హత్య చేశారని ఆ ప్రతిక పేర్కొంది. హత్యకు ముందు నామ్ మకావూలో ఉండే వాడు. ఆ సమయంలో నామ్ తరచూ సిఐఎ ఏజెంట్లను కలవడంతో పాటు ఆ సంస్థకు చెందిన పనులను చక్కబెట్టేవాడని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. అయితే నామ్ వ్యవహారశైలిని పరిశీలిస్తే అతడు సిఐఎ ఏజెంట్ గా పని చేశాడన్న ఆరోపణలు ఉన్నా, అవి నిర్థారణ కాలేదు. వాల్ స్ట్రీట్ జనరల్ కథనంపై ఉత్తరకొరియా నేతలు సైతం స్పందించారు. నామ్ కచ్చితంగా సిఐఎ ఏజెంట్ అయి ఉంటాడని వారు పేర్కొన్నారు.

Kim Jong Nam Was a CIA Informant

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అందుకే అతడిని చంపారట… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: