పాముకాటు చికిత్సకు కొత్తమందులు తపనిసరి

లండన్ : పాముకాటు చికిత్సకు కొత్తమందులు తప్పనిసరి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వందేళ్ల క్రితం నాటి చికిత్సనే అనుసరిస్తున్నారు. పాము విషాన్ని గుర్రం లో ఎక్కించి యాంటీబాడీస్‌ను తయారు చేస్తున్నారు. ఇది ఎంతో వ్యయంతో కూడుకున్న పని. అయినా అంతగా పనిచేయక ఇతర అవ లక్షణాలు దీనివల్ల కలుగుతున్నా యి. 2030 నాటికి పాము కాటు మరణాలను సగానికి సగం తగ్గించాలని ప్రపంచ బ్యాంకు లక్షంగా పెట్టుకుంది. సరాసరిన ప్రతి ఐదు నిముషాలకు 50 మంది […] The post పాముకాటు చికిత్సకు కొత్తమందులు తపనిసరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్ : పాముకాటు చికిత్సకు కొత్తమందులు తప్పనిసరి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వందేళ్ల క్రితం నాటి చికిత్సనే అనుసరిస్తున్నారు. పాము విషాన్ని గుర్రం లో ఎక్కించి యాంటీబాడీస్‌ను తయారు చేస్తున్నారు. ఇది ఎంతో వ్యయంతో కూడుకున్న పని. అయినా అంతగా పనిచేయక ఇతర అవ లక్షణాలు దీనివల్ల కలుగుతున్నా యి. 2030 నాటికి పాము కాటు మరణాలను సగానికి సగం తగ్గించాలని ప్రపంచ బ్యాంకు లక్షంగా పెట్టుకుంది. సరాసరిన ప్రతి ఐదు నిముషాలకు 50 మంది పాము కాటుకు గురవుతున్నారు.

ఏటా 81,000 నుంచి 138000 మంది పాముకాటుకు మరణిస్తున్నారు. 4 లక్షల మంది శాశ్వతంగా వికలాంగులవుతున్నారు. సంపన్న దేశాల్లో చాలామంది పాముకాటుకు గురవుతున్నా పేద కుటుం బాలు ఎవరైతే పొలాల్లో పనిచేస్తుంటారో వారు తీవ్రంగా పాముకాటుకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో పాము కాటు చికిత్సలతో ఎక్కువ మందిని బతికించాలన్న లక్షం తో 80 మిలియన్ పౌండ్లతో వెల్‌కమ్ ట్రస్ట్ ఏర్పాటైంది. పాముకాటును సరైన విషం విరుగుడు మందుతో నయం చేయవచ్చని వెల్‌కమ్ ట్రస్టు డైరక్టర్ మైక్ టర్నర్ చెప్పారు. పాముకాటు చికిత్స గత శతాబ్దంలో కాస్త పురోగతి చెం దినా అందుబాటులో మాత్రం ఉండడంలేదు. ఇప్పుడు ఇది ఛాలెంజ్‌గా తయారైంది.

ప్రస్తుతం లభిస్తున్న పాముకాటు విరుగుడు మందులు చాలా ఖరీదు పలుకుతున్నాయి. ఒక్కో వయల్ 160 డాలర్ల వరకు ధర పలుకుతోంది. మొత్తం కోర్సు పూర్తి చేయాలంటే 800 నుంచి 1600 డాల ర్ల వరకు ఖర్చవుతోంది. రైతుకు వచ్చే వార్షిక ఆదాయమే 200 డాలర్లు అయినప్పుడు పాముకాటు వైద్యానికి ఎంత ఖర్చు పెట్టగలడు? సాధారణంగా పాము కాటు పడగానే స్థానిక నాటు వైద్యుల్ని ఆశ్రయిస్తుంటారు తప్ప ఆస్పత్రు లకు వెళ్లరు. అందుకే ఆ పాముకాటు రోగుల సంఖ్య బయటపడడం లేదు. విషంతో ఆధారపడకుండా కొత్తరకం మందులను కనుగొనడం తప్పనిసరి అని ట్రస్టు చెబుతోంది.

ప్రపంచం మొత్తం మీద ఉపయోగపడే సర్వసాధారణ మందులైతేనే పాముకాటు చికిత్సకు వెసులుబాటు కలుగు తుందని అభిప్రాయ పడుతున్నారు. మరో ఏడేళ్లలో వెల్ కమ్ ట్రస్టు కొత్త చికిత్సా విధానాలను కనుక్కోవాలన్న లక్షంతో వెల్‌కమ్ ట్రస్టు ఉంది. ఆయా ఉత్పత్తి కంపెనీల సహకారంతో తక్కువ ధరకు ఉత్తమమైన మందులను వాడుక లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.
                                                                                                          సైన్స్ విభాగం

New Drugs are Essential for Treatment of Snakebite

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాముకాటు చికిత్సకు కొత్తమందులు తపనిసరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: