త్వరలో కలెక్టర్ల సమావేశం?

కొత్త రెవెన్యూ చట్టంపై స్పష్టత వచ్చే అవకాశం హైదరాబాద్: త్వరలో భూ సమస్యలను కలెక్టర్ల స మావేశంలో చర్చించి, రెవెన్యూ ప్రక్షా ళన విలీనంపై సిఎం కెసిఆర్ కీలక ని ర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. త్వరలో కలెక్టర్లతో సిఎం కెసిఆర్ సమావేశమై ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా సమాచారం. ప్రధానంగా రెవెన్యూ ప్రక్షాళనపై కఠిన నిర్ణయాలకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదిక కానుందని సమాచారం. 9 నెలలుగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ తొలగడంతో సిఎం కెసిఆర్ […] The post త్వరలో కలెక్టర్ల సమావేశం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
కొత్త రెవెన్యూ చట్టంపై స్పష్టత వచ్చే అవకాశం

హైదరాబాద్: త్వరలో భూ సమస్యలను కలెక్టర్ల స మావేశంలో చర్చించి, రెవెన్యూ ప్రక్షా ళన విలీనంపై సిఎం కెసిఆర్ కీలక ని ర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. త్వరలో కలెక్టర్లతో సిఎం కెసిఆర్ సమావేశమై ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా సమాచారం. ప్రధానంగా రెవెన్యూ ప్రక్షాళనపై కఠిన నిర్ణయాలకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదిక కానుందని సమాచారం. 9 నెలలుగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ తొలగడంతో సిఎం కెసిఆర్ పాలనపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెలలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు అధికారిక సమాచారంగా తెలుస్తోంది. ప్రధానంగా భూ కేటాయింపులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల భూ సేకరణ, పరిహారం చెల్లింపులు, ధరణి ప్రాజెక్టు, మ్యుటేషన్లు, భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పార్ట్ బి భూముల వివరాలపై సిఎం చర్చించనున్నట్టుగా తెలిసింది.

ఈ మేరకు పార్ట్ బి భూముల సమాచారాన్ని అందించాలని రెవెన్యూ శాఖ సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లతో సమావేశం అనంతరమే కొత్త చట్టంపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మొత్తం 2 కోట్ల 40 లక్షల 71 వేల 495 ఎకరాల భూ విస్తీర్ణంలో 74 లక్షల 42 వేల 910 ఎకరాల భూ విస్తీర్ణం వివాదాస్పదమేనని గుర్తించిన అధికారులు ఆ భూములను పార్ట్ బిలో చేర్చగా, కోటి 76 లక్షల 81 వేల 621 ఎకరాల భూమిని వివాదహితంగా అధికారులు తేల్చారు.

రెవెన్యూ విభాగానికి మరింత పనిభారం

జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో రెవెన్యూ విభాగానికి మరింత పనిభారం పెరిగింది. తాత్కాలిక కేటాయింపులు, సర్ధుబాట్లలో భాగంగా ఆర్డీఓలు, డీఆర్‌ఓ (జిల్లా రెవెన్యూ అధికారి)లను జాయింట్ కలెక్టర్లుగా నియమిం చారు. దీంతో రాష్ట్రంలో అనేక రెవెన్యూ డివిజన్లలో ఖాళీలు ఏర్పడ్డాయి. తద్వారా రెవెన్యూ డివిజన్‌లలో అనేక సమస్యలు పెరుగుతున్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి పోస్టులు కూడా ఖాళీగా ఉండడంతో భూ సమస్యల పరిష్కారంలో జాప్యం పెరిగింది. జాయింట్ కలెక్టర్లకు భూ సంబంధిత వ్యవహారాల అప్పగింత నేపథ్యంలో డిఆర్‌ఓలు లేకపోవడంతో సరైన సమాచారం అందుబాటులో లేకుండా పోతుందని ప్రజలు పేర్కొంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, నూతన పట్టాదారు పాసు పుస్తకాలు, ధరణి ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలతో ఈ శాఖ పనితీరు మరింత కీలకంగా మారింది. కీలకమైన సిసిఎల్‌ఏ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో ప్రతికూలంగా మారింది. గతంలో ఎస్‌కె సిన్హా, రేమండ్‌పీటర్ సిసిఎల్‌కు పూర్తి స్థాయిలో కమిషనర్‌గా కొనసాగారు. రాజీవ్‌శర్మ, ఎస్పీ సింగ్, ప్రదీప్‌చంద్రలు ఇన్‌చార్జీలుగా వ్యవహారించారు. ఆ తరువాత ఈ శాఖకు పూర్తి స్థాయిలో సిసిఎల్‌ఏ నియామకం జరగలేదు. భూ రికార్డుల ప్రక్షాళన అంతా సిసిఎల్‌ఏ కనుసన్నల్లోనే జరగాల్సి ఉండగా, ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో తప్పు ఒప్పుల సవరణపై పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయి.

తహసీల్దార్లకు వెబ్‌లింక్ ఇవ్వాలి

సిబ్బందికి శిక్షణ, జమాబందీ సుదీర్ఘకాలంగా జరగడం లేదు. తాజాగా రిజిస్ట్రేషన్ సేవలను కూడా తహసీల్దార్లకు కట్టబెట్టడంతో పనిభారం మరింత పెరిగింది. పనిఒత్తిడిలో తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ సేవలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. రైతుబంధు పథకం, పాసు పుస్తకాల పంపిణీ, ధరణి ప్రాజెక్టు పరిశీలనలో నిమగ్నం కావడంతో అదనపు బాధ్యతలను సమయం చిక్కడం లేదు.
ధరణి ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 21 మండలాల్లో అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో తప్పొప్పులు సరిదిద్దే బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో వీటిని సరిచేసి ‘ధరణి’లో ఆన్‌లైన్ రికార్డులను సవ్యంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ధేశించింది.

ఇందులో భాగంగా 12 రకాల రెవెన్యూ తప్పులను సరిదిద్దే మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. భూ రికార్డుల్లో మార్పులు, చేర్పులను రోబోట్ రోల్ విధానంలో కంప్యూటరీ కరణకు వీఆర్‌ఓ, తహసీల్దార్, మండల సర్వేయర్లు వెబ్‌ల్యాండ్‌తో అనుసం ధానం చేసి తహసీల్దార్లకు వెబ్‌లింక్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆన్‌లైన్ ఇబ్బందులు, సర్వర్‌డౌన్, ధరణి ప్రాజెక్టులో అనేక ఆపన్ష్లు లేక అవస్థలు పడుతున్నారు.

వెబ్‌ల్యాండ్ విధానంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను జారీ చేసే కార్యాచరణలో అనేక అవరోధాలు ఎదురవు తున్నాయి. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించాలన్న లక్షం కష్టతరంగా మారింది. భూ సంబంధిత న్యాయపరమైన వివాదాలను ఆర్‌ఓఆ ర్ 1బీ రిజిస్ట్రర్‌లో నమోదు చేసి తరువాత పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయంతో భూ యజమానులకు కలిసి వస్తుందనే ఆశా భావం వ్యక్తమవుతోంది.

CM KCR Meeting With District Collectors soon

Related Images:

[See image gallery at manatelangana.news]

The post త్వరలో కలెక్టర్ల సమావేశం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: