కథనే నమ్ముకుంటా

  సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బి చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటించిన సినిమా ‘వజ్ర కవచధర గోవింద’. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జివిఎస్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్‌పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సప్తగిరితో ఇంటర్వూ విశేషాలు… మంచి కథ చుట్టూ వినోదం… నేను హీరోగా చేసిన తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’కు మంచి పేరు, డబ్బులు […] The post కథనే నమ్ముకుంటా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బి చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటించిన సినిమా ‘వజ్ర కవచధర గోవింద’. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జివిఎస్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్‌పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సప్తగిరితో ఇంటర్వూ విశేషాలు…
మంచి కథ చుట్టూ వినోదం…
నేను హీరోగా చేసిన తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’కు మంచి పేరు, డబ్బులు వచ్చాయి. రెండో సినిమా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’కి పేరు మాత్రమే వచ్చింది. ఇప్పుడు మూడో సినిమాగా ‘వజ్ర కవచధర గోవింద’ చేశాను. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆశీస్సులతో పేరు, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. చిన్న బడ్జెట్‌లో చేసిన సినిమా ఇది. ఓ మంచి కథ చెబుతూ దాని చుట్టూ మంచి వినోదాన్ని అల్లుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.
దొంగగా నటించా…
ఈ సినిమాలో నేను దొంగగా నటించాను. ఇక వజ్రం చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాలో నా పాత్ర పేరు గోవిందు. వజ్రానికి, గోవిందుకు ఉన్న సంబంధం ఏంటి? ఆ వజ్రం వల్ల అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? ఎన్ని లాభాలు పొందాడు? ఎంత వినోదాన్ని పంచాడు? ఎంత భావోద్వేగాలకు గురిచేశాడు? అనేదే ఈ సినిమా.
అద్భుతంగా తెరకెక్కించాడు…
‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ తర్వాత దర్శకుడు అరుణ్‌పవార్‌తో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. ఇక నాకు ‘వజ్ర కవచధర గోవింద’ కథ బయటి నుంచి వచ్చింది. మహేంద్ర, పచ్చల ప్రకాశ్‌తో పాటు మరో అబ్బాయి కలిసి ఈ కథ తయారు చేశారు. ఈ కథ ఎవరు డైరెక్ట్ చేస్తే బావుంటుందని ఆలోచిస్తే అప్పుడు నాకు దర్శకుడు అరుణ్ గుర్తొచ్చాడు. వెంటనే అతన్ని పిలిచి కథ ఇచ్చాం. ఇక అరుణ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలో నా పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది.
సందేశం ఉండేలా చూసుకుంటా…
నా గత రెండు సినిమాల్లో కామెడీ కాస్త తక్కువగా చేశాను. ఆ రెండు సినిమాల్లో సందేశం ఎక్కువగా ఉంటుంది. అలా చేయడానికి కారణం నాలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్. ఇక ‘వజ్ర కవచధర గోవింద’లో మంచి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. నా సినిమాల్లో సందేశం ఉండేలా చూసుకుంటాను.
కమేడియన్‌గా కూడా చేస్తా…
మంచి పాత్ర వస్తే కమేడియన్‌గా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నాకు మంచి కమేడియన్ పాత్రలు రావడం లేదు. హీరోగా చేస్తున్నాడు కదా… ఇక కమేడియన్‌గా ఏం చేస్తాడులే అనుకుంటున్నారేమో. కానీ కమేడియన్‌గా ఇప్పుడు కూడా చేస్తాను.
కథే ముందుకు తీసుకెళ్తుంది…
నేను కథను నమ్ముతాను. కథే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. నా శక్తికి మంచినదైనా బాగా చేయాలని అనుకుంటా. కథ లేకపోతే ఏ సినిమా అయినా ఇప్పుడు ఆడే పరిస్థితుల్లో లేవు. ఇకమీదట కూడా కథనే నమ్ముకుంటా.
ఇదంతా ఆ గుర్తింపు వల్లే…
నన్ను నేను నమ్ముకున్న వ్యక్తిని. కాబట్టి నాకు సక్సెస్ వస్తుందని నమ్ముతున్నా. ఇక కమేడియన్‌గా నాకు మంచి గుర్తింపు వచ్చింది. హీరోగా మూడు సినిమాలకు అది ఉపయోగపడింది. మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇదంతా కమేడియన్ అనే గుర్తింపు వల్లే.

Saptagiri special interview

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కథనే నమ్ముకుంటా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: