మన్మథుడు 2 హల్‌చల్

నాగార్జున హీరోగా మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. నాగార్జున, పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఒక షెడ్యూల్ మినహా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. త్వరలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున-రకుల్‌ప్రీత్ సింగ్, నాగార్జున-కీర్తిసురేష్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ […] The post మన్మథుడు 2 హల్‌చల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నాగార్జున హీరోగా మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. నాగార్జున, పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఒక షెడ్యూల్ మినహా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. త్వరలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున-రకుల్‌ప్రీత్ సింగ్, నాగార్జున-కీర్తిసురేష్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా ఈనెల 13న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నారు. ‘మన్మథుడు’ ఇన్‌స్పిరేషన్‌తో ఈ ఫన్ రైడర్ తెరకెక్కుతోంది. చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేః రాహుల్ రవీంద్రన్, సత్యానంద్, ఎడిటర్స్‌ః ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి, డైలాగ్స్‌ః కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్.

Manmadhudu 2 movie teaser releasing on June 13

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మన్మథుడు 2 హల్‌చల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: