వాహన విక్రయాలు అధ్వాన్నం…

  మే నెలలో 20 శాతం తగ్గిన దేశీయ అమ్మకాలు న్యూఢిల్లీ: మే నెలలో దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 20.55 శాతం మేరకు తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో వాహన సేల్స్ 3,01,238 యూనిట్లుగా ఉండగా, 2018 మే నెలలో 2,39,347 యూనిట్లకు తగ్గుముఖం పట్టాయి. ఈమేరకు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్( సియామ్) గణాంకాలను వెల్లడించింది. దేశీయంగా ప్యాసింజర్ వాహన మొత్తం అమ్మకాలు 18 ఏళ్ల కనిష్ట స్థాయికి క్షీణించాయి. డిమాండ్ ఆశించిన […] The post వాహన విక్రయాలు అధ్వాన్నం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మే నెలలో 20 శాతం తగ్గిన దేశీయ అమ్మకాలు

న్యూఢిల్లీ: మే నెలలో దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 20.55 శాతం మేరకు తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో వాహన సేల్స్ 3,01,238 యూనిట్లుగా ఉండగా, 2018 మే నెలలో 2,39,347 యూనిట్లకు తగ్గుముఖం పట్టాయి. ఈమేరకు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్( సియామ్) గణాంకాలను వెల్లడించింది. దేశీయంగా ప్యాసింజర్ వాహన మొత్తం అమ్మకాలు 18 ఏళ్ల కనిష్ట స్థాయికి క్షీణించాయి. డిమాండ్ ఆశించిన మేరకు లేకపోకపోవడం తయారీ సంస్థలు కూడా ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి.

గణాంకాల ప్రకారం, దేశియంగా కార్ల అమ్మకాలు 26.03 శాతం తగ్గాయి. 2018 మే నెలలో 1,99,479 యూనిట్ల సేల్స్‌కు ఉండగా, ఈ ఏడాది మేలో 1,47,546 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అలాగే మోటర్ సైకిల్ అమ్మకాల్లో 4.89 శాతం తగ్గుదల కనిపించింది. గతేడాది మేలో 12,22,164 యూనిట్లు ఉండగా, ఈ మే నెలలో 11,62,373 యూనిట్లకు తగ్గాయి. మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు గత ఏడాది మే నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది మేలో 6.73 శాతం తగ్గాయి. ఈ విక్రయాలు 18,50,698 యూనిట్ల నుంచి 17,26,206 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 10.02 శాతం మేర తగ్గాయి. అన్ని విభాగాల వాహనాల విక్రయాలు 8.62 శాతం తగ్గాయి. గత ఏడాది మేలో 22,83,262 యూనిట్లుగా ఉన్న విక్రయాలు ఈ ఏడాది మే లో 20,86,358 యూనిట్లకు మాత్రమే పరిమితమయ్యాయని సియామ్ పేర్కొంది.

కేంద్ర నుంచి ప్యాకేజీ కోరుతున్న పరిశ్రమ

దేశీయ వాహన అమ్మకాలు క్షీణించడంతో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రభుత్వం తగిన సాయం చేయాలని కోరుతున్నాయి. తక్షణమే ప్యాకేజీ ప్రకటించిన వాహన పరిశ్రమను ఆదుకోవాలని మోడీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాయి. జిఎస్‌టి రేటులో తగ్గింపు, అలాగే ఉద్దీపన చర్యలు వంటివి ప్రభుత్వం చేపట్టాలని ఆటో పరిశ్రమ నిధులు కోరుతున్నారు. ఆశించిన మేరకు అమ్మకాలు లేకపోవడంతో వాహన తయారీ సంస్థలు కొన్ని రోజుల పాటు తమ ఉత్పత్తి ప్లాంట్‌లను మూసివేయడానికి సిద్ధమవుతున్నాయి.

దేశియ మార్కెట్లలో అమ్మకాలు తగ్గడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రూ.35,000 కోట్ల విలువ గల 5 లక్షలకు పైగా ప్రయాణ వాహనాలు జూన్ మొదటి వారానికి అమ్మకాలు లేక డీలర్స్ వద్దనే ఉన్నాయని వారంటున్నారు. రూ. 17,500 కోట్ల విలువ గల ద్విచక్ర వాహనాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని వివరించారు. టాటా మోటర్స్, మహింద్రా, మారుతి సుజుకి వంటి కంపెనీలు మే-జూన్ మధ్య తమ ప్లాంట్‌లను మూసివేసే షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించాయి. మార్కెట్‌లో డిమాండ్ లేనప్పుడు వాహనాలను ఉత్పత్తి చేయలేమని, మే, జూన్ నెలలో డిమాండ్‌ను పరిశీలించి మా ఉత్పత్తిని అంచనా వేస్తామని టాటా మోటర్స్ ప్రయాణ వాహనాల విభాగధిపతి మయాంక్ పారిక్ అన్నారు.

Vehicle Sales Declined

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వాహన విక్రయాలు అధ్వాన్నం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: