చాట్ బండార్ ఇంట్లోనే..!

  పోహా చాట్ కావాల్సినవి: మందపాటి అటుకులు 2 కప్పులు, ఉల్లిపాయ: ఒకటి, బంగాళదుంప ఒకటి, ఆవాలు టీస్పూను, పచ్చిమిరి రెండు, కరివేపాకు పది రెబ్బలు, పసుపు అర టీస్పూను, కారం అర టీస్పూను, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర తురుము, దానిమ్మగింజలు సూను, కొబ్బరి తురుము , ఉల్లిముక్కలు, నిమ్మకాయ అరచెక్క తయారీ విధానం : అటుకుల్ని రెండు మూడుసార్లు కడిగి నీళ్లు వంపేసి పక్కన ఉంచాలి. బాణలిలో రెండు టీస్పూన్ల నూనె వేసి ఆవాలు […] The post చాట్ బండార్ ఇంట్లోనే..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పోహా చాట్

కావాల్సినవి: మందపాటి అటుకులు 2 కప్పులు, ఉల్లిపాయ: ఒకటి, బంగాళదుంప ఒకటి, ఆవాలు టీస్పూను, పచ్చిమిరి రెండు, కరివేపాకు పది రెబ్బలు, పసుపు అర టీస్పూను, కారం అర టీస్పూను, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర తురుము, దానిమ్మగింజలు సూను, కొబ్బరి తురుము , ఉల్లిముక్కలు, నిమ్మకాయ అరచెక్క
తయారీ విధానం : అటుకుల్ని రెండు మూడుసార్లు కడిగి నీళ్లు వంపేసి పక్కన ఉంచాలి. బాణలిలో రెండు టీస్పూన్ల నూనె వేసి ఆవాలు వేసి అవి చిటపటమన్నాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. అవి బాగా వేగాక పసుపు, సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలు వేసి అవి మెత్తగా ఉడికేవరకూ ఉంచాలి. తరవాత పక్కన ఉంచిన అటుకులు వేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్‌లో ఐదు నిమిషాలు ఉంచాలి.
* స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, కారప్పూస, దానిమ్మ గింజలు, కొబ్బరి తురుము పైన చల్లి నిమ్మరసం పిండి అందించాలి.

మటర్ కీ చాట్

కావాల్సినవి : ఎండు బఠాణీలు అరకప్పు, ఉప్పు రుచికి సరిపడా, ఉల్లిముక్కలు కప్పు, తాజాకొత్తిమీర తురుము 4టీస్పూన్లు, అల్లం తురుము టీస్పూను, బ్లాక్‌సాల్ట్: 2 టీస్పూన్లు, జీలకర్రపొడి టీస్పూను, స్వీట్‌చట్నీ 6, కారం అరటీస్పూను
తయారీ విధానం : * బఠాణీలను మూడు నాలుగు గంటలు నాననిచ్చి, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు కూడా పోసి కుక్కర్‌లో ఉడికించాలి. పెనం మీద నీళ్లు చల్లుతూ స్వీట్ చట్నీ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయిస్తూ కలపాలి. ఇప్పుడు ఉడికించిన బఠాణీలు కూడా వేసి బాగా కలిపి చివరగా మిశ్రమం మీద స్వీట్ చట్నీ, కొత్తిమీర తురుమూ చల్లి అందిస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.
స్వీట్ చట్నీకోసం ఖర్జూరాలు అరకప్పు (ఇవి లేకపోతే ఎండు ఖర్జూరాలు తీసుకుని నానబెట్టాలి)
చింతపండు గుజ్జు పావు టీస్పూను, బెల్లం: 2 టీస్పూన్లు, కారం అర టీస్పూను, బ్లాక్‌సాల్ట్ పావు టీ స్పూను, ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం: గింజలు తీసేసిన ఖర్జూరాలు, చింతపండు గుజ్జు బాణలిలో వేసి కొద్దిగా నీళ్లుపోసి మరిగించాలి. చల్లారాక వీటికి బెల్లం, ఉప్పు, బ్లాక్‌సాల్ట్ అన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, చల్లారాకా గాజుసీసాలో పోసి ఫ్రిజ్‌లో పెడితే నిల్వ ఉంటుంది.

ఆలూ బ్రెడ్ పకోడా

కావాల్సినవి:
సెనగపిండి 2 కప్పులు, బ్రెడ్ స్లైసెస్ ఎనిమిది, బంగాళ దుంపలు ఐదు (ఉడికించినవి), కొత్తిమీర తురుము 3, అల్లం తురుము టీస్పూను, పచ్చిమిర్చి రెండు, ఉప్పు టీస్పూను, జీలక ర్ర పావు టీస్పూను, కారం అర టీస్పూను, పసుపు పావుటీస్పూను, ఆమ్‌చూర్‌పొడి అరటీస్పూను, గరం మసాలా పావుటీస్పూను. నూనె సరిపడా.
తయారీ విధానం : * ఓగిన్నెలో సెనగపిండి వేసి, అందులో అరటీస్పూను ఉప్పు, పావుటీస్పూను కారం వేయాలి. తరవాత నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ పకోడీ పిండిలా కలపాలి. * బంగాళ దుంపల పొట్టు తీసి మెదిపి ఉంచాలి.
* పెనం వేడి చేసి ఓ స్పూను నూనె వేయాలి. జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుమూ కూడా వేసి అన్నీ కలుపుతూ రెండు నిమిషాలు వేయించాలి. తరవాత ధనియాలపొడి, మెదిపిన బంగాళదుంపలు, ఆమ్‌చూర్, కారం, గరంమసాలా, ఉప్పు, కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు వేయించి, పక్కన ఉంచి చల్లారనివ్వాలి.
* మళ్లీ పెనం మీద కొద్దిగా నూనె వేసి, ఓ బ్రెడ్ ముక్క ఉంచి, దాని మీద కొంత కూర స్టఫ్ పెట్టి, ఆపైన మరో బ్రెడ్ స్లైస్ ఉంచి నెమ్మదిగా వత్తాలి. ఇప్పుడు దీన్ని త్రికోణాకారంలో కోసి పక్కన ఉంచాలి. ఇలాగే అన్నీ చేయాలి. చివరగా ఈ బ్రెడ్ టోస్టులను సెనగపిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని ఏదైనా చట్నీ లేదా సాస్‌తో అందిస్తే సరి.

 

Aloo Bread Pakora Recipe

 

The post చాట్ బండార్ ఇంట్లోనే..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.