తల్లి కాబోతున్న‌ సమంత…!

హైదరాబాద్ : ప్రముఖ నటి , అక్కినేని నాగచైతన్య సతీమణి సమంత తల్లి కాబోతున్నట్టు కోలీవుడ్ కోడై కూస్తోంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న సమంత ప్రస్తుతం ’ ఓ బేబీ‘ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం సమంత వెరైటీగా ప్రమోషన్స్ చేస్తోంది. వచ్చే నెల 5 ’ఓ బేబీ‘ విడుదల కానుంది. ఈ క్రమంలో సమంత తన ట్విట్టర్ ఎకౌంట్ ఐడిని బేబీ అక్కినేనిగా మార్చుకుంది. సమంత ఇలా తన ట్విట్టర్ ఎకౌంట్ […] The post తల్లి కాబోతున్న‌ సమంత…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ నటి , అక్కినేని నాగచైతన్య సతీమణి సమంత తల్లి కాబోతున్నట్టు కోలీవుడ్ కోడై కూస్తోంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న సమంత ప్రస్తుతం ’ ఓ బేబీ‘ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం సమంత వెరైటీగా ప్రమోషన్స్ చేస్తోంది. వచ్చే నెల 5 ’ఓ బేబీ‘ విడుదల కానుంది. ఈ క్రమంలో సమంత తన ట్విట్టర్ ఎకౌంట్ ఐడిని బేబీ అక్కినేనిగా మార్చుకుంది. సమంత ఇలా తన ట్విట్టర్ ఎకౌంట్ ఐడిని మార్చుకోవడానికి ఏదో ప్రత్యేకత ఉందని సోషల్ మీడియాలో ముచ్చట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో సమంత తల్లి కాబోతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాను తల్లి కాబోతున్నట్టు వస్తున్న వార్తలను సమంత ఖండించింది. మీరు తల్లి కాబోతున్నారా అని ఓ అభిమాని సమంతను అడిగాడు. దీంతో సమంత తీవ్ర స్థాయిలో మండిపడింది. మీకు తెలిస్తే కాసింత నాక్కూడా చెప్పండంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ’ ఓ బేబీ ‘ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది.

Actress Samantha Is Pregnant

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తల్లి కాబోతున్న‌ సమంత…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: