గ్యాంగ్‌స్టర్‌గా వరుణ్‌తేజ్

  కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపించిన కథానాయకుడు వరుణ్‌తేజ్. ముకుంద, కంచె, అంతరిక్షం, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ యువ కథానాయకుడు. ప్రస్తుతం వరుణ్‌తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్‌తేజ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండగా […] The post గ్యాంగ్‌స్టర్‌గా వరుణ్‌తేజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపించిన కథానాయకుడు వరుణ్‌తేజ్. ముకుంద, కంచె, అంతరిక్షం, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ యువ కథానాయకుడు. ప్రస్తుతం వరుణ్‌తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్‌తేజ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండగా తమిళ హీరో అధర్వ మురళీ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజాహెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః ఐనాంక్ బోస్, సంగీతంః మిక్కీ జె.మేయర్, ఫైట్స్‌ః వెంకట్, ఎడిటింగ్‌ః ఛోటా కె.ప్రసాద్.

Valmiki movie releasing on September 6th

The post గ్యాంగ్‌స్టర్‌గా వరుణ్‌తేజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: