ఆ విషయంలో నేను చాలా లక్కీ

  తాప్సీ ప్రధాన పాత్రలో వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం ‘గేమ్ ఓవర్’. ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత తాప్సీ దక్షిణాదిన ఈ ద్విభాషా చిత్రాన్ని చేశారు. వీడియో గేమ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాప్సీతో ఇంటర్వూ విశేషాలు… చాలా బాగా నచ్చింది దాదాపు రెండు సంవత్సరాల క్రితం అశ్విన్ శరవణన్ ఈ సినిమా కథ చెప్పారు. నాకు […] The post ఆ విషయంలో నేను చాలా లక్కీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తాప్సీ ప్రధాన పాత్రలో వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం ‘గేమ్ ఓవర్’. ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత తాప్సీ దక్షిణాదిన ఈ ద్విభాషా చిత్రాన్ని చేశారు. వీడియో గేమ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాప్సీతో ఇంటర్వూ విశేషాలు…

చాలా బాగా నచ్చింది
దాదాపు రెండు సంవత్సరాల క్రితం అశ్విన్ శరవణన్ ఈ సినిమా కథ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. తెలుగు, తమిళంలో ఈ సినిమా తీయాలనుకుంటున్నట్లు చెప్పారు. అప్పటికే నేను తమిళంలో నటించి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ సినిమాతో మళ్లీ తమిళంలో రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందనిపించింది. ఆలాగే తెలుగులో ఇలాంటి సినిమా చేస్తే ఆదరిస్తారన్న నమ్మకం ఉంది.
ఎప్పటికీ గుర్తుండిపోతుంది
ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతుంది. సినిమాలో 60 శాతం వరకు నేను వీల్‌చైర్‌లోనే ఉంటాను. ఎంతో ప్రాక్టీస్ చేసి ఈ రోల్‌లో నటించాను. తప్పకుండా ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంటాను.
విజన్ అర్థమైపోయింది
దర్శకుడు అశ్విన్ శరవణన్ నాకు కథ చెప్పిన విధానంతో సినిమాపై ఆయనకున్న విజన్ అర్ధమైపోయింది. ఆయన తీసిన మాయ, మయూరి చిత్రాలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. తన డైరెక్షన్‌లో నటించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది.
బాలీవుడ్‌లో కూడా మంచి అంచనాలు..
బాలీవుడ్‌లో ఈ సినిమాను అనురాగ్ కశ్యప్ విడుదల చేయనున్నారు. సినిమా చూసిన తరువాతే ఆయన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఆయనకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఆయన వల్లే హిందీలో కూడా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
నన్ను ఆ యాంగిల్‌లో చూడడం లేదు
బాలీవుడ్‌లో ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలే చేస్తున్నాను. నిజం చెప్పాలంటే… బాలీవుడ్ వాళ్లు నాకు గ్లామర్ రోల్స్ ఇవ్వడం లేదు. నేను కూడా గ్లామర్ హీరోయిన్‌లా లిప్‌కిస్‌లు పెడతాను, డాన్స్ చేస్తానని చెబుతున్నాను. ఏ డైరెక్టర్ కూడా నన్ను ఆ యాంగిల్‌లో చూడడం లేదనుకుంటా. అయితే నేను ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేశాను. భవిష్యత్తులో హిందీలో కూడా చేస్తానేమో చూడాలి.
అన్ని సందర్భాల్లో కుదరదు..
ఒకే సమయంలో వివిధ భాషల్లో పలు సినిమాల్లో నటించడం అన్ని సందర్భాల్లో కుదరదు. అందుకే నేను కొన్ని సౌత్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. అయితే బాలీవుడ్‌లో కూడా నాకేం ఎక్కువగా అవకాశాలు రావట్లేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను.
కొంత మంది మాత్రమే సంప్రదిస్తున్నారు
ప్రస్తుతం సౌత్‌లో కూడా నాకు అవకాశాలు తగ్గాయి. కొంత మంది డైరెక్టర్స్ మాత్రమే నన్ను సంప్రదిస్తున్నారు. అయితే నా దగ్గరికి వస్త్తున్న కథలు మాత్రం చాలా బాగుంటున్నాయి. అందుకే నేను ఆ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను.
అవకాశాలే నన్ను నిలబెట్టాయి
హిందీ, తెలుగు, తమిళ్ భాషల సినిమాల్లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ విషయంలో నేను చాలా లక్కీ. నాకు వచ్చిన అవకాశాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.
అప్పుడే పెళ్లి చేసుకుంటా..
ఇప్పుడు అయితే నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా విషయానికి వస్తే… నాకు ఎప్పుడైతే పిల్లలు కావాలనే అనిపిస్తోందో అప్పుడు పెళ్లి చేసుకుంటాను.

నిర్మాతగా మారతా..
నాకు కూడా నిర్మాతగా మారాలనే కోరిక ఉంది. కాకపోతే నిర్మాణం అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. అందుకే మంచి పార్ట్‌నర్ కోసం ఎదురుచూస్తున్నాను. మంచి టీమ్ సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా నిర్మాతగా మారతాను. ప్రస్తుతానికైతే నా దృష్టి మొత్తం నటనపైనే ఉంది.

తదుపరి చిత్రాలు..
తమిళంలో ఒక సినిమాకు సైన్ చేశాను. అలాగే తెలుగులో కూడా ఒక ఫిల్మ్ ఉంది. హిందీలో ప్రస్తుతం రెండు సినిమాలు జరుగుతున్నాయి.

Taapsee pannu special interview about Game Over movie

The post ఆ విషయంలో నేను చాలా లక్కీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: