గిరీష్ కర్నాడ్ కన్నుమూత…

  రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర ప్రముఖుల సంతాపం బెంగళూరు: ప్రఖ్యాత నాటక రచయిత, నటుడు జ్ఞానపీఠ గ్రహీత గిరీష్‌కర్నాడ్ (81) తన నివాసంలో సోమవారం తెల్లవారు జామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఉదయం 8.30 గంటల వరకు ఆయన కన్నుమూశారన్న సంగతి కుటుంబ స భ్యులకు తెలియరాలేదు. ఆయనకు భార్య సరస్వతి, కుమారుడు రఘుకర్నాడ్, కుమార్తె రాధ ఉన్నారు. రఘుకర్నాడ్ జర్నలిస్టు, రచయిత. గత కొంతకాలంగా తనతండ్రి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని విలేఖరులకు […] The post గిరీష్ కర్నాడ్ కన్నుమూత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర ప్రముఖుల సంతాపం

బెంగళూరు: ప్రఖ్యాత నాటక రచయిత, నటుడు జ్ఞానపీఠ గ్రహీత గిరీష్‌కర్నాడ్ (81) తన నివాసంలో సోమవారం తెల్లవారు జామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఉదయం 8.30 గంటల వరకు ఆయన కన్నుమూశారన్న సంగతి కుటుంబ స భ్యులకు తెలియరాలేదు. ఆయనకు భార్య సరస్వతి, కుమారుడు రఘుకర్నాడ్, కుమార్తె రాధ ఉన్నారు. రఘుకర్నాడ్ జర్నలిస్టు, రచయిత. గత కొంతకాలంగా తనతండ్రి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని విలేఖరులకు రఘు చెప్పారు.

ఆయన అభిమానులకు తాను కృతజ్ఞుడినని, ఆయన జ్ఞాపకాలు కర్ణాటక లోని ప్రతివారిలో శాశ్వతంగా ఉంటాయని తాను ఆశిస్తున్నట్టు రఘు చెప్పారు. సాహిత్యం లోను, రంగస్థలం, సినిమా రంగాల్లోను అయిదు దశాబ్దాల పాటు బహుముఖ ప్రజ్ఞ చూపిస్తూ కర్నాడ్ చెరగని ముద్ర వేశారు. బహుముఖ ప్రతిభావంతుడైన గిరీష్ అనేక వివాదాస్పద అంశాలపై నిర్బయంగా మాట్లాడే వారు. పద్మశ్రీ, పద్మభూషణ్ బిరుదులు పొందిన ఆయన ప్రస్తుత తరంలో ముఖ్యమైన సాహితీ వేత్తల్లో ఒకరు. తన మాతృభాష కన్నడంలో భారతీయ సాహిత్య విలువలను చాటి చెప్పగలిగారు. స్వయంగా ఆయన రచించడమే కాక, అనేక నాటకాల్లో సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించారు.

యయాతి, తుగ్లక్, నాగమండల వంటి నాటకాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. అవి ఇంగ్లీష్, ఇతర భా షల్లోకి అనువదించబడ్డాయి. కన్నడ, హిందీ సినిమా రంగాల్లో నటునిగా ఆయనను తెలియని వారు లేరు. సంస్కార, నిషాంత్, మంధన్ నుంచి వాణిజ్యపరమైన టైగ ర్ జిందా హై, శివాయ్ వంటి చిత్రాల్లో కూడా నటించి అభిమానం పొంద గలిగారు. గిరీష్ కర్నాడ్ పార్థివ దేహానికి బెంగళూరు కల్పలి విద్యుత్ దహన వాటికలో సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి. కర్నాడ్ అభిప్రాయాలకు అనుగుణంగా ఎలాంటి మతపరమైన లాంఛనాలు కానీ, లేదా రాష్ట్రప్రభుత్వ అధికార లాంఛనాలు కానీ కుటుంబ సభ్యులు అంగీకరించ లేదు.

రాష్ట్రపతి, ప్రధాని, కెసిఆర్ సంతాపం
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ తమ సంతాపం ప్రకటిస్తూ కొన్నేళ్లుగా ఆయన చేసిన సేవలకు గాను చిరకాలం గుర్తుంటారన్నారు. భారతీయ సాహితీ ప్రపంచం పేదదైందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అన్ని మాధ్యమ రంగాల్లో ఆయన చూపించిన నటనా కౌశలం ఎల్లప్పుడూ మరువరానిదని మోడీ శ్లాఘించారు. ఆయనకు ప్రియమైన పనులన్నీ రానున్న సంవత్సరాల్లోనూ కొనసాగి కీర్తి పొందుతాయని పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సాంస్కృతిక రాయబారిని తాము కోల్పోయామని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం వెలిబుచ్చారు. కర్నాడ్ మృతికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసిన గిరీష్ కర్నాడ్ సేవలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గాంచారని సిఎం కెసిఆర్ గుర్తి చేశారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇదిలా ఉండగా గిరీష్ కర్నాడ్ మృతిపట్ల కర్ణాటక సిఎం కుమారస్వామి సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి సంతాపంగా ఒకరోజు సెలవు, మూడురోజులు సంతాపదినాలు ప్రకటించారు.

గిరీష్ కర్నాడ్ పుట్టింది మహారాష్ట్రలో…
డాక్టర్ రఘునాధ్ కర్నాడ్,క్రిష్ణాబాయి దంపతులకు మూడో సంతానంగా 1938లో మహారాష్ట్రలో జన్మించారు. ఆ తరువాత ఆ కుటుంబం కర్ణాటక లోని సిర్సి, ధార్వాడ్‌లకు తరలి వచ్చింది. కర్నాడ్ బాల్యం అంతా అక్కడే గడిచింది.. రంగస్థల కళలపై కుటుంబానికి మక్కు వ ఉండడంతో సాహితీ ప్రపంచం వైపు కర్నాడ్ మొగ్గు చూపడానికి పునాది పడింది. నవ్య సాహితీ ఉద్యమంలో కర్నాడ్ భాగస్వామి అయ్యారు. పాశ్చాత్య సాహితీ విప్లవ ప్రభావం నవ్యపై పడింది. అదే స్ఫూర్తితో నాగమండల, హయవాదన, తుగ్లక్, యయాతి వంటి నాటకాలను రచించారు. చిత్రరంగంలో యుఆర్ అనంతమూర్తి నవల ఆధారంగా సంస్కార, ఎస్‌ఎల్ భైరప్ప నవల ఆధారంగా వంశవృక్ష సినిమాలను రచించారు. మాల్గుడి వేస్‌లో స్వా మి తండ్రి పాత్రను ఇంద్రధనుష్ లో అప్పు తండ్రిగా నటి ంచారు. దూరదర్శన్‌లో టర్నింగ్ పాయింట్ పేరున దూ రదర్శన్‌లో ప్రదర్శన ఇచ్చారు. ఆయన తాను నమ్మిన సి ద్ధాంతాల విషయంలో దేనికీ రాజీపడే వారు కాదు. నిర్భయంగా తన రాజకీయ అభిప్రాయాలు వెలిబుచ్చేవారు.

Girish Karnad passes away

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గిరీష్ కర్నాడ్ కన్నుమూత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: