సైనికులు లేకపోతే మనం లేము…

  దర్శక నిర్మాత హరినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్ రాణాప్రతాప్’. ఎ జవాన్ స్టోరీ అనేది క్యాప్షన్. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొ ందుతున్న ఈ చిత్రంలో హరినాథ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమం లో ఈ సినిమా ట్రైలర్‌ను సీనియర్ నటుడు సుమన్, బిగ్ ఆడియో సీడీని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను మేజర్ పాత్రలో నటించాను. […] The post సైనికులు లేకపోతే మనం లేము… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దర్శక నిర్మాత హరినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్ రాణాప్రతాప్’. ఎ జవాన్ స్టోరీ అనేది క్యాప్షన్. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొ ందుతున్న ఈ చిత్రంలో హరినాథ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమం లో ఈ సినిమా ట్రైలర్‌ను సీనియర్ నటుడు సుమన్, బిగ్ ఆడియో సీడీని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను మేజర్ పాత్రలో నటించాను. చాలా పవర్‌ఫుల్ పాత్ర నాది. దేశ సరిహద్దుల్లో ఆర్మీ గురించి చాలా గొప్పగా చూపించారు ఈ చిత్రంలో. హరినాథ్ పొలిచెర్ల ఈ సినిమాలో టైటిల్ పాత్రలో అద్భుతంగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు”అని అన్నారు.ఈ కార్యక్రమం లో జొన్నవిత్తుల, జ్యోతి రెడ్డి, వడ్లపల్లి కృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Soldiers’ services are Priceless

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సైనికులు లేకపోతే మనం లేము… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: