కొత్త అనుభూతిని కలిగించే చిత్రం ‘స్పెషల్’

  విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న అజయ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘స్పెషల్’. నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా వాస్తవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ “ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘స్పెషల్’. ఇందులో పోలీస్ పాత్రలో నటించాను. నలుగురు […] The post కొత్త అనుభూతిని కలిగించే చిత్రం ‘స్పెషల్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న అజయ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘స్పెషల్’. నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా వాస్తవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ “ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘స్పెషల్’. ఇందులో పోలీస్ పాత్రలో నటించాను. నలుగురు హీరోల్లో ఒకరిగా కనిపిస్తాను. ఇలాంటి సినిమా చేయడం సవాలుగా అనిపించింది. దర్శకుడు వాస్తవ్ చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే చిత్రమిది. నా కెరీర్‌లో సమ్‌థింగ్ ‘స్పెషల్’ చిత్రమిదవుతుంది. రాజమౌళి ‘విక్రమార్కుడు’ చిత్రం తర్వాత విలన్‌గా కన్నడలో దాదాపు 14 సినిమాలు చేశాను. తమిళంలోనూ నటించాను. ఇక నటుడిగా నేను అన్ని రకాల పాత్రలు పోషించాను. ప్రస్తుతం తెలుగులో భీష్మ, సరిలేరు నీకెవ్వరు, సాయిధరమ్‌తేజ్ సినిమాల్లో నటిస్తున్నాను”అని అన్నారు.

Special telugu movie releasing on June 21st

The post కొత్త అనుభూతిని కలిగించే చిత్రం ‘స్పెషల్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: