సక్సెస్ వస్తేనే పేరొస్తుంది

కమేడియన్ సప్తగిరి హీరోగా అరుణ్‌పవార్ దర్శకత్వంలో శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జివిఎస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్‌పవార్ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… త్రివిక్రమ్ నాకు స్ఫూర్తి… మా స్వస్థలం నెల్లూరు. ఇంటర్ పూర్తిచేసి విఎఫ్‌ఎక్స్ నేర్చుకున్నాను. అనంతరం 10 సంవత్సరాల పాటు విఎఫ్‌ఎక్స్ విభాగంలో పనిచేశాను. ఇక ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ వద్ద […] The post సక్సెస్ వస్తేనే పేరొస్తుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కమేడియన్ సప్తగిరి హీరోగా అరుణ్‌పవార్ దర్శకత్వంలో శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జివిఎస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్‌పవార్ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
త్రివిక్రమ్ నాకు స్ఫూర్తి…
మా స్వస్థలం నెల్లూరు. ఇంటర్ పూర్తిచేసి విఎఫ్‌ఎక్స్ నేర్చుకున్నాను. అనంతరం 10 సంవత్సరాల పాటు విఎఫ్‌ఎక్స్ విభాగంలో పనిచేశాను. ఇక ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ వద్ద ‘అతడు’ సినిమా నుంచి పనిచేస్తున్నాను. చివరగా ‘అ..ఆ’ సినిమాకు చేశాను. త్రివిక్రమ్ వద్ద పనిచేస్తున్న సమయంలోనే దర్శకత్వంపై పూర్తి అవగాహన కలిగింది. దర్శకుడిగా త్రివిక్రమ్ నాకు స్ఫూర్తి. కథ రాయడం, తెరపై దాన్ని అందంగా చెప్పడం ఆయన నుంచే నేర్చుకున్నాను.
సప్తగిరితో రెండో సినిమా…
నేను ఎవరి వద్ద అసిస్టెంట్‌గా పనిచేయలేదు. మొదట పెద్దగా అవగాహన లేకుండా ఓ సినిమా చేశాను. అది నిరాశపరిచింది. ఆతర్వాత సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో సప్తగిరితో మరో సినిమా చేద్దామని అనుకున్నాను. ఇక సప్తగిరితో నేను చేసిన రెండో చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’.
ఊరు బాగు కోసం…
వినోదాత్మకంగా సాగే ఎమోషనల్ చిత్రమిది. వజ్రం చుట్టూ కథ తిరుగుతుంది. చిత్రంలో హీరో పేరు గోవిందం. ఈ రెండు కలిసేలా చిత్రానికి ‘వజ్ర కవచధర గోవింద’ అని పేరు పెట్టాం. ఇక హీరో ఊరిలో మోసానికి గురవుతాడు. దీంతో ఊరు నుంచి బయటకు వచ్చి ఊరు బాగు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. ఈక్రమంలో చోటు చేసుకునే ఆసక్తికర సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం.
వినోదంతో పాటు సందేశం…
ఈ చిత్రంలో కామెడీతో పాటు ఫ్లాష్‌బ్యాక్ ఎమోషనల్‌గా ఉంటుంది. సినిమాలో సందేశం కూడా ఉంటుంది. మనం చేసే పనే కాదు వెళ్లే మార్గం కూడా మంచిదై ఉండాలని చెప్పే చిత్రమిది.
పెద్ద హీరోల కోసం…

Vajra kavachadhara govinda director Arun pawar interview

The post సక్సెస్ వస్తేనే పేరొస్తుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: