‘న్యారా’తో మహిళలకు అవగాహన…

  డిజిటల్ హెల్త్ టెక్నాలజీ స్టార్టప్ అయిన వివంట్ ప్రపంచ రుతు పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం ‘న్యారా’ (Nyra)పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. మహిళలు రుతుక్రమం, సంతానోత్పత్తి, అండాల విడుదల, జీవన శైలి, శారీరక శ్రమ వంటి పలు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ‘న్యారా’ యాప్‌లో పొందుపరిచారు. యాపిల్, గూగుల్ ప్లేస్టోర్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా మహిళలు తమ ఆరోగ్యం, పరిశుభ్రతపై అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. […] The post ‘న్యారా’తో మహిళలకు అవగాహన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డిజిటల్ హెల్త్ టెక్నాలజీ స్టార్టప్ అయిన వివంట్ ప్రపంచ రుతు పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం ‘న్యారా’ (Nyra)పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. మహిళలు రుతుక్రమం, సంతానోత్పత్తి, అండాల విడుదల, జీవన శైలి, శారీరక శ్రమ వంటి పలు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ‘న్యారా’ యాప్‌లో పొందుపరిచారు. యాపిల్, గూగుల్ ప్లేస్టోర్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా మహిళలు తమ ఆరోగ్యం, పరిశుభ్రతపై అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.

ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీలో అందుబాటులో ఉందీ యాప్. త్వరలో ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. నెలసరి సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, సంతాన సంబంధిత సమస్యలు వంటి పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. భారత్ దేశంలో 80శాతం మంది సానిటరీ నాప్‌కిన్స్ ఇప్పటికీ వాడడం లేదని ఓ సర్వేలో తేలింది. భారతదేశంలో23 మిలియన్ల మంది బాలికలు రుతుస్రావం సమయంలో వచ్చిన ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోవటం వల్లనే గర్ల్ డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి.

Women should be Aware of Menstruation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘న్యారా’తో మహిళలకు అవగాహన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.