కాజల్ ఐటెం సాంగ్ ఎవరి కోసమో తెలుసా …

హైదరాబాద్‌ : ప్రముఖ నటి కాజల్ బన్నీ సినిమాలో ప్రత్యేక గీతంతో సందడి చేయనుందన్న వార్తలు కోలీవుడ్ లో వస్తున్నాయి. గతంలో కాజల్ ’జనతా గ్యారేజ్‘ సినిమాలో ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఎన్ టిఆర్ తో కలిసి ఆమె ’ పక్కా లోకల్ ‘ అనే గీతంతో ఈ సినిమాలో సందడి చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలో […] The post కాజల్ ఐటెం సాంగ్ ఎవరి కోసమో తెలుసా … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : ప్రముఖ నటి కాజల్ బన్నీ సినిమాలో ప్రత్యేక గీతంతో సందడి చేయనుందన్న వార్తలు కోలీవుడ్ లో వస్తున్నాయి. గతంలో కాజల్ ’జనతా గ్యారేజ్‘ సినిమాలో ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఎన్ టిఆర్ తో కలిసి ఆమె ’ పక్కా లోకల్ ‘ అనే గీతంతో ఈ సినిమాలో సందడి చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ ప్రత్యేక గీతంలో ఆడిపాడనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ కు ఇది 19వ సినిమా కావడంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రత్యేక గీతంలో ఆడిపాడేందుకు కాజల్ కు భారీ పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై సినిమా యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. ఆర్య2, ఎవడు సినిమాల్లో అల్లు అర్జున్ కూ కాజల్ జోడీగా నటించిన విషయం తెలిసిందే.

Actress Kajal Item Song In Bunny Film

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాజల్ ఐటెం సాంగ్ ఎవరి కోసమో తెలుసా … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: