పుణ్య పురుషుడు

వేటగాడు ఉంచిన బోనులో సింహం చిక్కుకొంది. ఎలా బయట పడాలో అర్థం కాలేదు . అక్కడకు వచ్చిన కుందేలు బోనులో చిక్కుకొన్న సింహాన్ని చూసి జాలిపడి ‘సింహం మామా, వేటగాడు వచ్చేలోపున తప్పించుకోవాలి, లేకుంటే చంపేస్తాడు..ఈ బోను నుండి నిన్ను విడుదల చెయ్యాలంటే ఒక్క మనుషుల వల్లే అవుతుంది. ఎవరైనా వస్తే చూసి చెబుతాను‘ అంటూ వెళ్ళింది. కుందేలు వెళ్లిన కొంత సమయం తరువాత వేగంగా వచ్చి ‘సింహం మామా.. సింహం మామా అటుగా ఒక సాధువు […] The post పుణ్య పురుషుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వేటగాడు ఉంచిన బోనులో సింహం చిక్కుకొంది. ఎలా బయట పడాలో అర్థం కాలేదు .
అక్కడకు వచ్చిన కుందేలు బోనులో చిక్కుకొన్న సింహాన్ని చూసి జాలిపడి ‘సింహం మామా, వేటగాడు వచ్చేలోపున తప్పించుకోవాలి, లేకుంటే చంపేస్తాడు..ఈ బోను నుండి నిన్ను విడుదల చెయ్యాలంటే ఒక్క మనుషుల వల్లే అవుతుంది. ఎవరైనా వస్తే చూసి చెబుతాను‘ అంటూ వెళ్ళింది.
కుందేలు వెళ్లిన కొంత సమయం తరువాత వేగంగా వచ్చి ‘సింహం మామా.. సింహం మామా అటుగా ఒక సాధువు వెళ్తున్నారు. మీరు గట్టిగా కాపాడండి కాపాడండి అంటూ అరిచారంటే తప్పకుండా ఇక్కడకు వస్తారు’ అంది.
‘నీ సహాయాన్ని మరువలేను కుందేలు మిత్రమా, ఆ సాధువును పిలిచి బోను నుండి విడిపించమని వేడుకొంటాను. అలా విడిపించిన మరుక్షణమే ఆ సాధువుపై పడి చంపి తింటాను. నాకు చాలా ఆకలిగా ఉంది ’ సింహం అంది .
‘ సింహం మామా ప్రాణం పోసిన వాడినే చంపుట చాలా పాపం, సాధువంటే పుణ్య పురుషుడు. వారిలో గొప్ప మహిమలు ఉంటుంది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని ఎవరో మహానుభావుడు చెప్పినట్లు మా తాతయ్య చెప్పేవారు ’ అంది కుందేలు .
‘పాప పుణ్యాలు మనుషులకే కానీ నా లాంటి సింహానికి కాదు. ఆ పుణ్య పురుషుడిలో శక్తులు ఉండవచ్చు. నేను నిన్ను చంపుతాను అంటూ అని చెప్పి చంపబోతే అతని తపో బలంతో నన్ను ఓడిస్తాడు. బోను నుండి విడుదల చేసిన మరుక్షణం మెరుపులా అతని పై పడి చంపి తింటాను. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడే ఆ సాధువుకు వినపడేలా అరుస్తాను’ అంటూ ‘అయ్యా నన్ను కాపాడండి … నన్ను కాపాడండి’ అంటూ బిగ్గరగా గర్జించసాగింది.
‘సింహం గురించి అర్థం చేసుకోకుండా తొందరపడి ఒక పుణ్యాత్ముడు వస్తున్న విషయం చెప్పాను. విని వచ్చారంటే ఆయన ప్రాణాలు పోతుంది. ఈ సింహం అరుపులు సాధువు వినకుండా ఉంటే బాగుంటుంది .. ’ అనుకొంది కుందేలు.
సాధువుకు సింహం అరుపులు విని సింహం దగ్గరకు వచ్చారు.
ఆ సాధువు సింహం దగ్గరకు రాగానే కాపాడమంటూ కన్నీళ్లతో వేడుకొంది. సాధువు బోను తీయబోతుంటే బోను వెనుకనున్న కుందేలు తీయవద్దు…. తీయవద్దు అంటూ సైగ చేసింది. సాధువు కుందేలును చిరునవ్వుతో చూసాడు. సింహం ఉన్న బోను తలుపులు తీశాడు. సింహం బయటకు రాగానే మెరుపు వేగంతో సాధువు పైకి ఒక్కసారిగా ఎగిరింది. అంతే మరుక్షణమే ఆ సాధువు మీద పడలేదు కానీ ఎప్పటిలా మూసివున్న బోనులో ఉండటం, సాధువు తన దారిన తానూ తిరిగి వెళ్ళుతుండటం గమనించింది. అంతా ఆ పుణ్య పురుషుడి లీల అని తెలుసుకొంది.
ఇక నన్నెవరూ కాపాడలేరు అనుకొంటూ సింహం బాధపడసాగింది.

lion and rabbit full story in Telugu
                                                                                   ఓట్ర ప్రకాష్ రావు, 97874 46026

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పుణ్య పురుషుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.