ఆదిలాబాద్ డిఎస్‌పి, ఎస్‌ఐ సస్పెన్షన్…

  నిరుద్యోగులకు టోపీ వేసిన సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణ ఆదిలాబాద్‌ : నిరుద్యోగులకు భారీ ఎత్తున టోపీ వేసిన షోర్‌స్కేర్ టెక్నో మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నకిలీ సంస్థనుంచి ముడుపులు తీసుకున్నారనే ఆ రోపణలు ఎదుర్కొంటున్న ఆదిలాబాద్ సబ్ డివిజన్ డిఎస్‌పి కె నరసింహారెడ్డి, జైనథ్ ఎస్‌ఐ తోట తిరుపతిలను ్త డిజిపి ఎం మహేందర్‌రెడ్డి శనివారం సాయంత్రం సస్పెండ్‌చేశారు. పోలీస్ శాఖలో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో సుమారు 50 లక్షలకు […] The post ఆదిలాబాద్ డిఎస్‌పి, ఎస్‌ఐ సస్పెన్షన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిరుద్యోగులకు టోపీ వేసిన సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణ

ఆదిలాబాద్‌ : నిరుద్యోగులకు భారీ ఎత్తున టోపీ వేసిన షోర్‌స్కేర్ టెక్నో మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నకిలీ సంస్థనుంచి ముడుపులు తీసుకున్నారనే ఆ రోపణలు ఎదుర్కొంటున్న ఆదిలాబాద్ సబ్ డివిజన్ డిఎస్‌పి కె నరసింహారెడ్డి, జైనథ్ ఎస్‌ఐ తోట తిరుపతిలను ్త డిజిపి ఎం మహేందర్‌రెడ్డి శనివారం సాయంత్రం సస్పెండ్‌చేశారు. పోలీస్ శాఖలో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో సుమారు 50 లక్షలకు పైగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు రాగా, జిల్లా ఎస్పి విష్ణు ఎస్ వారియర్ నిర్వహించిన రహస్య విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎస్‌పి, ఎస్‌ఐలపై పూర్తి విచారణ చేపట్టి నివేదికను అందించడంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ 11న ఆదిలాబాద్ గ్రామీణ పోలీసు స్టేషన్‌లో అప్పటి ఎస్‌ఐ తోట తిరుపతి కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌కు చెందిన నాగారం కళ్యాణ్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ నిరుద్యోగులకు డిజిటల్ ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని 596 మంది నిరుద్యోగుల నుంచి రూ. 50 వేల నుండి రెండు లక్షల వరకు ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేశారు. సుమారు రూ. 3.57 కోట్లు వసూలు చేశారు. ఈ క్రమంలో జిల్లా ఎస్‌పి విష్ణు ఎస్ వారియర్‌కు వచ్చిన సమాచారం మేరకు తంతోలి గ్రామ శివారులో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సెమినార్ నిర్వహించి నిరుద్యోగులు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలియగా డిఎస్‌పికె నర్సింహారెడ్డి, అప్పటి అదిలాబాద్ గ్రామీణ ఎస్‌ఐ తోట తిరుపతి, సిబ్బందితో కలిసి సోదాలు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

డిఎస్‌పి కె నర్సింహారెడ్డి దర్యాప్తు కొనసాగించారు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. కోట్లాది రూపాయలు వసూలు చేసి నిరుద్యోగులను దగా చేసిన ఈ వ్యవహారంపై నమోదు చేసిన కేసు దర్యాప్తులో నిర్లక్షంగా ఉంటూ సరిగా దర్యాప్తు చేయకుండా సమయాన్ని వృధా చేస్తూ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి వీరిపై డిజిపికి నివేదిక పంపించగా, డిఎస్‌పి, ఎస్‌ఐలను సస్పెండ్ చేస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు.

Adilabad DSP and SI suspension for taking Bribe

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆదిలాబాద్ డిఎస్‌పి, ఎస్‌ఐ సస్పెన్షన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: