ప్రపంచ కప్ విజేత ఎవరో?

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ రానే వచ్చింది. ఇంగ్లండ్ వేదికగా 12వ ప్రపంచ క్రికెట్ పండగ అభిమానులను అలరిస్తోంది. మే 30న ప్రారంభమైన ఈ మెగా క్రికెట్ సంగ్రామం జులై 14న లార్డ్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగే క్రికెట్ సమరం అభిమానులను కనువిందు చేస్తోంది. భారత్, ఇంగ్లండ్,  ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు […] The post ప్రపంచ కప్ విజేత ఎవరో? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ రానే వచ్చింది. ఇంగ్లండ్ వేదికగా 12వ ప్రపంచ క్రికెట్ పండగ అభిమానులను అలరిస్తోంది. మే 30న ప్రారంభమైన ఈ మెగా క్రికెట్ సంగ్రామం జులై 14న లార్డ్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. దాదాపు నెలన్నర రోజుల పాటు జరిగే క్రికెట్ సమరం అభిమానులను కనువిందు చేస్తోంది. భారత్, ఇంగ్లండ్,  ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు ఈ మెగా టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్, బైర్‌స్టో, విలియమ్సన్, బట్లర్, రసెల్, హార్దిక్, రోహిత్, ధోని, మిల్లర్, ఆమ్లా, మాక్స్‌వెల్, షాయ్ హోప్ వంటి విధ్వంసక ఆటగాళ్లు తమ బ్యాట్‌తో అభిమానులను అలరించనున్నారు. అంతే కాకుండా బుమ్రా, భువనేశ్వర్, సౌథి, బౌల్ట్, స్టార్క్, కమిన్స్, అమీర్, మలింగ, రబడా, ఆర్చర్, లియాన్, స్టెయిన్ వంటి బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించేందుకు సిద్ధమయ్యారు.

 

ప్రపంచకప్‌కు లార్డ్, ట్రెంట్‌బ్రిడ్జ్, ఓవల్, ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్ వంటి చారిత్రక వేదికలు ఆతి థ్యం ఇవ్వనున్నాయి. ప్రపంచకప్ కోసం ఇంగ్లం డ్, వేల్స్ క్రికెట్ బోర్డులు భారీ ఏర్పాట్లు చేశాయి. గ తంతో పోల్చితే ఈసారి విజేత జట్టుకు ఇచ్చే ప్రైజ్‌మనీ కూడా భారీగా పెరిగింది. ప్రపంచకప్‌ను సా ధించే జట్టుకు రికార్డు స్థాయిలో దాదాపు 28 కోట్ల రూపాయల నగదు నజరానా అందనుంది. గతం తో పోల్చితే ఈసారి విశ్వ సంగ్రామాన్ని మరింత ప కడ్భందీగా నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అన్ని చర్యలు తీసుకుంది. ఎటువంటి లో టు లేకుండా ప్రపంచకప్‌ను నిర్వహించేందు ఐసిసి నడుంబిగించింది.

సర్వం సిద్ధం

ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఆదరణ కలిగిన టో ర్నీగా వన్డే ప్రపంచకప్ పేరు తెచ్చుకుంది. నాలుగేళ్లకోసారి జరిగే వన్డే ప్రపంచకప్ క్రికెట్ ప్రేమికులను కనువిందు చేస్తుంది. ఈసారి ఇంగ్లండ్ వేదికగా వి శ్వ క్రికెట్ సంగ్రామం జరుగనుంది. ఇంగ్లండ్ రి కార్డు స్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌కు వేదికగా నిలిచింది. మే 30 నుంచి ప్రారంభమైన ఈ ప్రపంచకప్‌లో పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరగనుంది. ప్రతి జట్టు ప్రత్యర్థితో ఒక్కసారి తలపడుతుంది. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. తొలి సెమీఫైనల్ జులై 9న మాంఛెస్టర్‌లో, రెండో సెమీఫైనల్ జులై 11న బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది. ఫైనల్ సమరం జులై 14న చారిత్రక లార్డ్ మైదానంలో జరుగనుంది. సుదీర్ఘకాలం పాటు సాగనున్న ఈ మెగా సంగ్రామంలో లీగ్ దశలో మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 30న లండన్‌లోని లార్డ్‌లో ఇంగ్లండ్‌దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేస్తోంది.

ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలి యా, మాజీ ఛాంపియన్లు భారత్, వెస్టిండీస్, శ్రీలం క, పాకిస్థాన్‌లతో సహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు పాలుపంచుకుంటున్నాయి. వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ జట్లు క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. మిగతా జట్లు ఐసిసి ర్యాంకింగ్స్ ప్రకారం నేరుగా ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకున్నాయి.

తిరోగమనంలో విండీస్

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ ప్రస్తుతం వరుస ఓటములతో దిక్కుతోచని స్థితికి ప డిపోయింది. తొలి మూడు ప్రపంచకప్‌లలో వెస్టిండీస్ ఎదురులేని శక్తిగా కొనసాగింది. ఎప్పుడైతే 1983 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి పాలైందో అప్పటి నుంచి వెస్టిండీస్ ఆధిపత్యానికి తెరపడిందనే చెప్పాలి. ఆ తర్వాత ఎప్పుడూ కూడా వెస్టిండీస్ మళ్లీ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరలేక పోయింది. క్లైవ్ లాయి డ్, రిచర్డ్, రిచి రిచర్డ్‌స న్, మాల్కం మా ర్షల్, డెస్మండ్ హేన్స్, గార్న ర్, గ్రినిడ్జ్, గస్‌లోగి, హార్పర్, కార్ల్ హూపర్, బిషన్, వాల్ష్, అంబ్రోస్, పార్టర్‌సన్ తదితరులు ఉన్నప్పుడూ ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్ ఎదురులేని శక్తిగా సాగింది. ఆ తర్వాత బ్రియాన్ లారా, చంద్రపాల్, శా మ్యూల్స్, శర్వాన్ తదితరులు ఉన్నప్పుడూ కూ డా పర్వాలేదనిపించింది. అయితే ప్ర స్తుతం క్రిస్‌గే ల్, ఆండ్రి రసె ల్, పొలార్డ్, బ్రావో వంటి స్టార్లు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. బోర్డుకు, క్రికెటర్లకు మధ్య పా రితోషికం విషయంలో తలెత్తిన వివాదం విండీస్ క్రి కెట్‌ను దెబ్బతీసింది. ఇరువురి మధ్య తలెత్తిన ఆధిప త్య పోరు నేపథ్యంలో కరీబియన్ క్రికెట్ తిరోగమనంలో ప్రయాణిస్తోంది.

కపిల్ సేన సంచలనం

 

ఇంగ్లండ్ వేదికగా 1983లో జరిగిన మూడో ప్రపంచకప్‌లో భారత జట్టు చారిత్రక ప్రదర్శనతో ప్రపం చ క్రికెట్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కపిల్‌దేవ్ సారథ్యంలో 1983 వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన భారత్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఈ టోర్నీలో కనీసం ఒకటి రెండు విజయాలు సా ధించినా గొప్పేనని అందరు భావించారు. అయితే తొలి లీగ్ మ్యాచ్‌లోనే భారత్ పెను సంచలనం సృష్టించింది. వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచి ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న వెస్టిండీస్‌ను మ ట్టికరిపించి భారత జట్టు పెను సంచలనం నమోదు చేసింది. అప్పటివరకు ప్రపంచకప్‌లో ఓటమే తెలియని కరీబియన్ జట్టుకు తొలి ఓటమి రుచి చూ పించింది. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లను భారత్ ఓడించింది. జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కపిల్‌దేవ్ చేసిన సెంచరీ ఇప్పటికే అరుదైన శతకంగా నిలిచింది. 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు క ష్టాల్లో చిక్కుకున్న భారత్‌ను కపిల్‌దేవ్ హోరోచిత సెంచరీతో ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కపిల్‌దేవ్ అజేయంగా

175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్ గా అప్పట్లో కపిల్ రికార్డు నెలకొల్పాడు. ఇక, వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో కూడా భారత్ జయభేరి మో గించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. దీంతో విండీస్ హ్యాట్రిక్ ట్రోఫీని సాధించడం లాంఛనమేనని అందరూ భావించారు. అయితే పట్టువీడకుం డా పోరాడిన కపిల్ సేన విండీస్ వంటి బలమైన జట్టును 140 పరుగులకే ఆలౌట్ చేసి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ ప్రపంచ క్రికెట్‌లో బలమైన శక్తిగా మారింది.

నెరవేరిన సచిన్ కల

ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ప్రపంచకప్ సాధించాలనే కోరిక చాలా ఏళ్లపాటు కలగానే మిగిలిపోయింది. 1992 ప్రపంచకప్ నుం చి బరిలోకి దిగుతున్నా సచిన్ ఒక్కసారి కూడా భా రత్‌కు ట్రోఫీని అందించలేక పోయాడు. సచిన్, గం గూలీ, సెహ్వాగ్, ధోని, అజారుద్దీన్, కుంబ్లే, హర్భజ న్, ప్రసాద్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజాలు జట్టులో ఉన్నా భారత్‌కు ప్రపంచకప్ కలగానే ఉండిపోయిం ది. అయితే 2011 లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో మాస్టర్ సచిన్ కల నెరవేరింది. యువరాజ్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన ఈ టోర్నమెంట్‌లో భారత్ విజేతగా ని లిచింది. యువరా జ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌కు రెం డోసారి విశ్వవిజేత గా నిలిపాడు. దీంతో వెస్టిండీస్, ఆస్ట్రేలియా తర్వాత రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. సుదీర్ఘ కాలంపాటు ప్రపంచకప్‌లో పాల్గొ న్న సచిన్ తన ఆఖరి విశ్వకప్‌లో ట్రోఫీని సాధించా డు. ధోని సారథ్యంలోని భారత జట్టు విశ్వకప్‌తో సచిన్‌కు అరుదైన గౌరవాన్ని అందించింది.

ఐదు జట్లకే అందలం

 

వన్డే ఫార్మాట్‌లో ఇప్పటికే 11 ప్రపంచకప్‌లు జరిగి పోయాయి. 1975లో తొలిసారి గా వన్డే ప్రపంచకప్‌ను నిర్వహించారు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన తొలి ప్రపంచకప్ నుంచి ఎన్నో జట్లు ఈ టోర్నీలో పాలుపంచుకుం టూ వస్తున్నాయి. ఇందులో కొన్ని జట్లు మాత్రమే విశ్వకప్పును సొంతం చేసుకున్నాయి. కొన్ని జట్లు మొదటి ప్రపంచకప్ నుంచి బరిలోకి దిగుతున్నా ఒ క్కసారి కూడా ప్రపంచ ఛాంపియన్‌గా నిలువలేక పోయాయి. ఈ రెండు జట్లు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు మాత్రమే. ప్రపంచానికే క్రికెట్‌ను పరిచ యం చేసిన జట్టుగా గుర్తింపు పొందిన ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విశ్వవిజేతగా నిలువలేక పోయింది. వన్డే ఫార్మాట్‌లో ఎంతో మెరుగైన జట్టుగా పేరు తెచ్చుకున్న ఇంగ్లండ్ ప్రపంచకప్‌కు వచ్చే సరికి పేలవమైన ఆటతో నిరాశ పరచడం అ లవాటుగా మార్చుకుంది. రికార్డు స్థాయిలో మూ డు సార్లు ఫైనల్‌కు చేరినా ఒక్కసారి కూడా ట్రోఫీని సొంతం చేసుకోలేక పోయింది. 1979లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫైనల్‌కు చే రింది. అయితే ఫైనల్లో మాత్రం అప్పటి ఛాంపియ న్ వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఇక, రెండో సా రి భారత ఉపఖండంలో జరిగిన 1987 ప్రపంచకప్‌లో ఫైనల్లో ప్రవేశించింది. ఈసారి చిరకాల ప్రత్య ర్థి ఆస్ట్రేలియా చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఇక, చివరి సారిగా ఆ స్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఆతిథ్యం ఇచ్చిన 1992 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరింది. అయితే ఈసారి పాకిస్థాన్ చేతిలో పరాజయం చవిచూసిం ది. ఇంజమాముల్ హక్, వసీం అక్రమ్‌ల ధాటికి త ట్టుకోలేక తుది సమరంలో ఇంగ్లండ్ బోల్తా పడిం ది. ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ ఫైనల్‌కు చేరలేదు. కాగా, ఈసారి సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో మాత్రం ఇంగ్లండ్‌కు ట్రోఫీని సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌ లింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న ఇంగ్లండ్ ఈ సారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు తొలి ప్రపంచకప్ నుంచి క్రమం తప్పకుండా పా ల్గొంటూ వస్తున్న మరో జట్టు న్యూజిలాండ్. ఈ జ ట్టు కూడా ఒక్కసారి కూడా ప్రపంచకప్‌ను గెలవలేక పోయింది. తొలి సారి కిందటి ప్రపంచకప్‌లో  ఫైనల్‌కు చేరింది. అయితే తుది సమరంలో పటిష్టమైన ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసిం ది. ప్రతి టోర్నమెంట్‌లో కూడా భారీ ఆశలతో బరిలోకి దిగే న్యూజిలాండ్ కీలక సమయంలో పరాజ యం పాలుకావడం అలవాటుగా మార్చుకుంది. దీంతో సుదీర్ఘ ప్రపంచకప్ ప్రస్థానంలో ఒక్కసారి కూడా కివీస్ విశ్వవిజేతగా నిలువలేక పోయింది. ఈసారైనా ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తోం ది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న న్యూజిలాండ్ ఈసారి ప్రపంచకప్ కప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ విలియమ్స న్, రాస్ టైలర్, మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో, నిశ మ్, గ్రాండోమ్, నికోల్స్ తదితరులతో కివీస్ బ్యా టింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బౌల్ట్, సౌ థి, సోధి, ఫెర్గూసన్, సాంట్నర్ తదితరులతో బౌ లింగ్ కూడా మెరుగ్గానే కనిపిస్తోంది. దీంతో కివీస్ ఈసారి భారీ ఆశలతో టోర్నీకి సిద్ధమైంది. మరోవై పు 1992 నుంచి ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న దక్షిణాఫ్రికా కూడా ఒక్కసారి కూడా విశ్వవిజేతగా నిలువలేక పోయింది. ఆస్ట్రేలియా త ర్వాత ప్రపంచ క్రికెట్‌లో అంత బలమైన జ ట్టుగా సౌతాఫ్రికా పేరు తెచ్చుకుంది. వన్డేల్లో ఎంతో ఘనమైన రికార్డును కలిగిన దక్షిణాఫ్రి కా ప్రపంచకప్‌కు వచ్చే సరికి పేలవమైన ప్రదర్శనతో నిరాశే మిగుల్చుతోంది. ఈసారైనా సఫా రీ జట్టు మెరుగ్గా ఆడుతుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రబడా, ఎంగిడి, ఫెలుక్‌వాయో, స్టెయిన్స్, ఇమ్రాన్ తాహిర్, మో రిస్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉన్నారు. దీంతో సౌతాఫ్రికా కూడా ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆస్ట్రేలియా హవా

మరోవైపు ప్రపంచకప్ క్రికెట్ ప్రస్థానంలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఇ ప్పటి వరకు 11సార్లు వన్డే ప్రపంచకప్‌లు జరిగా యి. ఇందులో ఆస్టేలియా ఏకంగా ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. 1987లో తొలిసారిగా ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 1999, 2003, 2007లలో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, చివరి సారి గా 2015లో కూడా ఆస్ట్రేలియా విశ్వవిజేతగా అవతరించింది. ఈసారి కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. కాగా, వెస్టిండీస్, భారత్‌లు రెండేసి సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాయి. విండీస్ 1975, 1973లలో విజేతగా నిలిచింది. భార త్ 1983, 2011లలో వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. 1992లో పాకిస్థాన్ 1996లో శ్రీలంకలు ప్రపంచకప్‌ను సాధించాయి. ఈ జట్లు తప్ప మరే జట్టు కూడా ప్రపంచకప్‌ను గె లవలేదు. కాగా, ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విశ్వ సంగ్రామంలో కొత్త ఛాంపియన్ అవతరించ డం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా రు. ఇందులో ఇంగ్లండ్‌కు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలు కూడా ఇవే లక్షంతో ఉన్నాయి.

దీంతో ప్రపంచకప్ సమరం ఉత్కంఠభరితంగా సాగడం ఖాయం. పాపం ఇంగ్లండ్  ప్రపంచ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రస్థానం కలిగిన ఇంగ్లండ్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్‌ను ముద్దాడలేక పోయింది. రికార్డు స్థా యిలో మూడు సార్లు ఫైనల్‌కు చేరినా కేవలం రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. వన్డే క్రికెట్ ప్రారంభమైన తొలి రోజుల్లో ఇంగ్లండ్ మెరుగైన జట్టుగా పేరు తెచ్చుకుంది. తొలి ఐదు ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్ ఏకంగా ఐదు సార్లు ఫైనల్‌కు చేరింది. అయితే ఒక్కసారి కూడా ప్రపంచకప్‌ను గెలువలేక పోయింది. భారత్, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఫైనల్ చేరిన తొలిసారే ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నా యి. కానీ, ఇంగ్లండ్ మాత్రం ఆ రికార్డును అందుకోలేక పోయింది. ఆస్ట్రేలియా కూడా రెండో ప్రయత్నంలో ప్రపంచకప్‌ను దక్కించుకుంది. న్యూజిలాం డ్ ఒకసారి ఫైనల్ చేరినా ట్రోఫీని మాత్రం గెలవలేక పోయింది.

హోరీహోరీ ఖాయం

ఈసారి ప్రపంచకప్‌లో పోరు హోరీహోరీగా సాగ డం ఖాయంగా కనిపిస్తోంది. గతంతో పోల్చితే ఈసారి జట్ల మధ్య ఆసక్తికర సమరం తప్పకపో చ్చు. ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ విజేత భారత్, ఆతిథ్య ఇంగ్లండ్, సంచలనాల పాకిస్థాన్, డార్క్‌హార్స్ న్యూజిలాండ్, వన్డే దిగ్గజం దక్షిణాఫ్రి కా, విధ్వంసక వెస్టిండీస్ జట్లు ఈసారి ట్రోఫీపై కన్నేశాయి. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంకలు బరిలో ఉన్నా వారు ట్రోఫీని గెలవడం అనుకున్నం త తేలికకాదు. క్రిస్ గేల్, షాయ్ హోప్, ఆండ్రి రసె ల్, ఎవిన్ లెవిస్, హెట్మియార్, బ్రాత్‌వైట్ తదితరులతో వెస్టిండీస్ విధ్వంసక జట్టుగా మారింది. దీం తో ఈ ప్రపంచకప్‌లో సంచలనాలు సృష్టించే సత్తా ఈ జట్టుకు ఉందని చెప్పాలి.

డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, మాక్స్‌వెల్, స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్, లియాన్ తదితరులతో కూడిన ఆస్ట్రేలియా కూడా కప్పుపై కన్నేసింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్య, బుమ్రా, భువనేశ్వర్, షమీలతో భారత్ కూడా భారీ ఆశలతో ప్రపంచ కప్‌కు సిద్ధమైంది. మార్టిన్ గుప్టిల్, రాస్ టైలర్, కెప్టెన్ విలియమ్సన్, నికోల్స్, మ్యాట్‌హెన్రి, నిశమ్, బౌల్ట్, సౌథి తదితరులతో నిండిన న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇక, డికాక్, ఆమ్లా, డుప్లెసిస్, ఎంగిడి, ఫులక్‌వాయో, రబడా, డుమిని, మిల్లర్ తదితరులతో దక్షిణాఫ్రికా కూడా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను శాసించే బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సఫారీ జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ జట్టు కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

భారీ ఆశలతో..

మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఈసారి భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే మూడు సార్లు ఫైనల్ చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న ఇంగ్లం డ్, ఈసారి ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీలో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. జాసన్ రాయ్, బైర్‌స్టో, జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్, మోయిన్ అలీ, వోక్స్, శామ్ కరన్, ఆదిల్‌షాలతో ఇంగ్లండ్ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. ఈసారి ఇంగ్లండ్ కచ్చితంగా ట్రోఫీని గెలుస్తుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.

కోహ్లి సేనపై భారీ అంచనాలు

 

ఈ ప్రపంచకప్‌కు టీమిండియా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ కూడా ఓ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విరాట్ కోహ్లి సేన ఎదురులేని శక్తిగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ విరాట్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కొంతకాలంగా ప్రపంచ క్రికెట్ లో విరాట్ ఎదురులేని శక్తిగా కొనసాగుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా అతని బ్యాట్ నుంచి పరుగుల వర ద పారుతూనే ఉంది. ఈసారి కూడా ఇటువంటి ప్రదర్శనే జట్టు ఆశిస్తోంది. రోహిత్ శర్మ రూపంలో మరో పదునైన అస్త్రం భారత్‌కు అందుబాటులో ఉందని చెప్పాలి. వన్డే క్రికెట్‌పై తనదైన ముద్ర వేసి న రోహిత్ విజృంభిస్తే భారత్‌కు ట్రోఫీ సాధించడం కష్టమేమి కాదు. శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్య, శంకర్, కార్తీక్, జడేజా, రాహుల్, బుమ్రా, భువనేశ్వర్, షమి, చాహల్, కుల్దీప్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. సమష్టిగా రాణిస్తే భారత్ తన ఖాతాలో మూడో ప్రపంచకప్‌ను జత చేసుకోవడం ఖాయం.

World Cup 2019

సయ్యద్ కరీం అహ్మద్
మన తెలంగాణ, స్పోర్ట్స్ ప్రతినిధి

 

The post ప్రపంచ కప్ విజేత ఎవరో? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.