లావెండర్ నూనెతో ఉపశమనం…

  లావెండర్ పూలు అందంగా కనిపించటమే కాక పరిమళ భరితంగా ఉంటాయి. గుత్తులుగా పూస్తాయి ఈ పువ్వులు. లావెండర్ పుష్పాల నుండి తైలాన్ని తీస్తారు. దీనిలో ఔషధగుణాలుంటాయి. చర్మారోగ్యానికీ, సౌందర్యానికీ, లావెండర్ తైలం బాగా ఉపయోగపడుతుంది. ఈ పూలతో, హెర్బల్ టీని తయారు చేస్తారు. ఈ టీని తాగడం వల్ల హుషారు, చురుకుదనం పెరుగుతాయి. నిద్రలేమి తొలగిపోతుంది. గుండెశ్వాస కోశానికి సంబంధించిన అనారోగ్యాలు, చర్మవ్యాధులు, జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్స్‌పై లావెండర్ ఆయిల్ తన ప్రభావాన్ని చూపుతుంది. […] The post లావెండర్ నూనెతో ఉపశమనం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లావెండర్ పూలు అందంగా కనిపించటమే కాక పరిమళ భరితంగా ఉంటాయి. గుత్తులుగా పూస్తాయి ఈ పువ్వులు. లావెండర్ పుష్పాల నుండి తైలాన్ని తీస్తారు. దీనిలో ఔషధగుణాలుంటాయి. చర్మారోగ్యానికీ, సౌందర్యానికీ, లావెండర్ తైలం బాగా ఉపయోగపడుతుంది. ఈ పూలతో, హెర్బల్ టీని తయారు చేస్తారు. ఈ టీని తాగడం వల్ల హుషారు, చురుకుదనం పెరుగుతాయి. నిద్రలేమి తొలగిపోతుంది. గుండెశ్వాస కోశానికి సంబంధించిన అనారోగ్యాలు, చర్మవ్యాధులు, జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్స్‌పై లావెండర్ ఆయిల్ తన ప్రభావాన్ని చూపుతుంది.
లావెండర్ ఆయిల్ ఉపయోగాలు

* ఈ ఆయిల్ సెంట్‌వాసనను పీలుస్తూంటే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది.
* అల్జీమర్స్ వ్యాధిలోని తీవ్ర స్వభావాన్ని కొంత అదుపు చేస్తుంది.
* చర్మగాయాలను నివారిస్తుంది.
* కోరింత దగ్గు తగ్గడానికి సాయపడుతుంది. నడుము, వీపు కండరాల నొప్పులకు లావెండర్ ఆయిల్ మసాజ్ తో ఉపశమనం కలుగుతుంది.
* నిద్రలేమిని తొలగించి సుఖ నిద్రపట్టేలా చేస్తుంది.

* లావెండర్ నూనె ఇన్‌హేలర్‌ను వాడితే జలుబుకు ఉపశమనం కలుగుతుంది.
* ఒత్తిడిని తగ్గిస్తుంది.
* చర్మం ముడతలు పడకుండా రక్షణగా పనిచేస్తుంది.
* తలనొప్పి, మైగ్రేన్ బాధలను నివారిస్తుంది.
* రక్త ప్రసరణ వ్యవస్ధ పనితీరుకు తోడ్పడుతుంది. రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది.

* నరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. * అధిక రక్తపోటును అదుపు చేస్తుంది. * బ్రాంబైటీస్, ఆస్తా వ్యాధుల ఉపశమనానికి చేసే మసాజ్ ఆయిల్స్‌లో లావెండర్ తైలం కూడా ఉంటుంది.
* చర్మకణాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* మంచి సువాసన కోసం లావెండర్ ఆయిల్‌ను అగరువత్తుల తయారీలో వాడుతారు. సొరియాసిస్ వ్యాధికి నివారణగా పనిచేస్తుంది.
* కీటకాలు కుట్టి మంటగా ఉన్నప్పుడు, ఈ తైలం ఆ బాధను పోగొడుతుంది. * ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, మానసిక సమస్యను తొలగించి, మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది * జామ్స్, సలాడ్, జెల్లీస్ లాంటి వాటితయారీలో అదనపు రుచి కోసం లావెండర్‌ను కలుపుతారు. * లావెండర్ పేగుల కదలికలను పెంచుతుంది. జీర్ణ రసాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. * బెణికిన నొప్పులు, వాపులకు, కండరాల నొప్పులకు లవెండర్ ఆయిల్‌తో మసాజ్ చేయడం మంచిది.

Health issues solve with Lavender oil

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లావెండర్ నూనెతో ఉపశమనం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.