భార్య మనసు మార్చేందుకు…

  ఒకరోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయం లో తన కోడలిని ‘కొంచెం పెరుగు వుంటే  వేయమ’ అడిగాడు. దానికి కోడలు ‘అయ్యో పెరుగు లేదండీ’ అని చెప్పింది. అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు.  భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్లిపోయిన తరువాత, కొడుకు, కోడలు భోజనానికి కూర్చున్నారు. వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడు కు గమనించాడు. భార్యను ఏమీ అనలేదు. మౌ నంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కానీ పని […] The post భార్య మనసు మార్చేందుకు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒకరోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయం లో తన కోడలిని ‘కొంచెం పెరుగు వుంటే  వేయమ’ అడిగాడు. దానికి కోడలు ‘అయ్యో పెరుగు లేదండీ’ అని చెప్పింది. అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు.  భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్లిపోయిన తరువాత, కొడుకు, కోడలు భోజనానికి కూర్చున్నారు. వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడు కు గమనించాడు. భార్యను ఏమీ అనలేదు. మౌ నంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కానీ పని మీ ద మనసు లగ్నం చేయలేక పోయాడు.
రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే మనసును తొలుస్తున్నది. తన కోసం తన తండ్రి చేసిన త్యాగం, ప్రేమతో పెంచిన తీరు, కష్టపడి వృద్ధి చేసి అందించిన, వ డ్డించిన విస్తరిలాంటి వ్యాపారం.. అన్నీ ఒక్కొక్కటి గా గుర్తుకొచ్చాయి. తన తండ్రి జీవితమంతా చేసి న కష్టం, ఒక కప్పు పెరుగును ఇవ్వలేకపోయిం దా అనే బాధను తట్టుకోలేకపోయాడు.

తండ్రికి ఇపుడు ఇంకొక వివాహం చేస్తే, ఆ భార్య అతని బాగోగులు బాగా చూసుకోగలదు.. కానీ ఇపుడు తండ్రి ససేమిరా ఒప్పుకోడు.. భార్యను దండించితే మనసు మారుతుందన్న నమ్మకం లేదు. ఎంత ఆలోచించినా మార్గం తోచలేదు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి, మరుసటి రోజు హఠాత్తుగా తన తండ్రిని వేరొక ఊరు తీసికొని వెళ్లి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరచి తండ్రిని అక్కడ వుంచి తిరిగి వచ్చేసాడు. మామగారు అంత హఠాత్తుగా ఎక్కడికి, ఎందుకు వెళ్లాడో కోడలికి అర్ధం కాలేదు. భర్తను అడిగింది గానీ తనకు కూడా తెలియదని చెప్పటంతో ఆలోచనలో పడింది. ఒక వారం గడిచిపోయింది. మామగారి విషయం తెలియటం లేదు. భర్తను అడిగే ధైర్యం చేయలేక పోయింది. సహజంగానే ఆతృత పెరిగింది.

ఆ రోజు ఉదయం భర్త వెళ్లిన తరువా త, ఏదో పని మీద గుమాస్తా ఇంటికి వచ్చాడు. కో డలు మామ గారి గురించి ఆరా అడిగింది. “ఏమి జరిగిందో తెలియదు గాని.. పెద్దాయనగారు పెళ్లి చేసుకోబోతున్నారని, ఏర్పాట్లు పూర్తయ్యాయని, వ్యాపారాన్ని కూడా తనే చూసుకుంటారని, ఆయ న కొత్త కాపురం ఈ ఇంట్లోనే ఉంటారని, కొడుకు తన కాపరాన్ని ఒక అద్దె ఇంటి లోనికి మార్చ బో తున్నారని, అందరూ చెప్పుకుంటున్నార నీ..” గుమాస్తా చెప్పిన విషయం విని నివ్వెరపోయింది.
ఒక్కసారిగా కోడలి కంటిముందు, తన భావి జీవితం కనపడింది.

తాను చేస్తున్న తప్పు తెలిసింది. ఇపుడు కొత్త అత్తగారు వ స్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చే సుకుంది. గుమాస్తాను, మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి అడిగి తెలుసుకొని పరుగున వెళ్ళి ఆయన కాళ్లపై పడి క్షమాపణ కోరింది. తన తప్పు తెలుసుకున్నానని, ఇకనుంచి తన తండ్రిలా చూచుకుంటానని ప్రాధేయ పడింది. ఈవిషయాలేవీ తెలియ ని మామగారికి పరిస్థితి అర్ధం కాలేదు.. అపుడు వచ్చాడు కొడుకు. తల్లిదండ్రుల విలువ.. కప్పు పె రుగు విషయంలో తాను పడిన బాధ భార్యకు తెలి య జెప్పటానికి తాను ఇలాచేయవలసి వచ్చిందని వివరించాడు. తనకు తానుగా మారటానికి, భర్త పడిన కష్టం చూచి సిగ్గుపడింది..

 

Wife, Husband Telugu Whatsapp Status

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భార్య మనసు మార్చేందుకు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.