తాగుబోతు దయ్యం

ముసురు పట్టిన రాత్రి. 1960 నాటి మోడల్ కారు రోడ్డు మీద కన్పించింది. రైల్వేస్టేషన్ రోడ్డులో చిన్నపాటి రేకుల షెడ్డులో నడుస్తున్న హోటల్‌లో టీ తాగుతున్న నైట్‌డ్యూటీ కానిస్టేబు ల్సు గతుక్కుమని చూశారు. ఈ కారు మసీదు పక్క ఓ మట్టి రోడ్డులో నాలుగుటైర్లు కూరుకుపోయి ఉండేది. భలేగా దూసుకుపోతోంది. ఇలాంటి కార్లు బాగు అవుతాయా? అని కానిస్టేబుల్ ముకుల్ అడిగాడు. “దేని పనోడు దానికుంటాడు. మన ఇన్‌స్పెక్టర్ దయ్యాలున్నాయంటాడు. ఈ బెంగాల్‌లో చేతబడికి పెట్టింది పేరు. […] The post తాగుబోతు దయ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముసురు పట్టిన రాత్రి. 1960 నాటి మోడల్ కారు రోడ్డు మీద కన్పించింది. రైల్వేస్టేషన్ రోడ్డులో చిన్నపాటి రేకుల షెడ్డులో నడుస్తున్న హోటల్‌లో టీ తాగుతున్న నైట్‌డ్యూటీ కానిస్టేబు ల్సు గతుక్కుమని చూశారు. ఈ కారు మసీదు పక్క ఓ మట్టి రోడ్డులో నాలుగుటైర్లు కూరుకుపోయి ఉండేది. భలేగా దూసుకుపోతోంది. ఇలాంటి కార్లు బాగు అవుతాయా? అని కానిస్టేబుల్ ముకుల్ అడిగాడు.
“దేని పనోడు దానికుంటాడు. మన ఇన్‌స్పెక్టర్ దయ్యాలున్నాయంటాడు. ఈ బెంగాల్‌లో చేతబడికి పెట్టింది పేరు. ఇన్‌స్పెక్టర్‌కు అనుక్షణం దయ్యాల పిచ్చి. అంతకు ముందు నలుగురు ఇన్‌స్పెక్టర్లు పనిచేశారు. దయ్యాలంటేనే ఈసడించేవారు. ఇలా ఉంటారు నమ్మినవాళ్లు, నమ్మనోళ్లు.”
“అయినా మూలపడ్డకారు ఎప్పుడు బాగుపడింది. ఇలా పరుగులు తీసే గుర్రమయ్యంది?” ఆశ్చర్యం వ్యక్తం చేసాడు? మరో కానిస్టేబుల్ ఇక్బాల్ “ఈ డొక్కుడోలు కారును మన ఇన్‌స్పెక్టర్ గాని చూస్తే అందులో ఎప్పటినుంచో ఓ దయ్యం కాపురం పెట్టేసిందని చెబుతాడు” అని పకపక నవ్వాడు.
ఇద్దరు రైన్‌కోట్లు సరిచేసుకుని సైకిళ్లు ఎక్కి చెరోదారి పట్టారు. ఆ ఇద్దరిలో రైల్వేస్టేషన్ రోడ్డులో డ్యూటీ చేసే ఇక్బాల్ ఆ వైపునకు సాగాడు.
తను చర్చించిన డొక్కుకారు రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉంది. దాని నంబర్ ప్లేట్ నీటికి తడిసి మెరుస్తోంది. బాగా శిథిలమైన కారును చాలా బాగా తయారు చేయించి రోడ్డు ఎక్కించారు అనుకున్నాడు. ఆ నెంబర్ ప్లేట్ చూస్తునే ఆ పక్క నుంచి సైకిల్ పోనిస్తూ డ్రయివింగ్ సీటులోకి తొంగి చూసాడు. ప్రేతకళతో పీక్కుపోయి, ఎముకలకు అంటుకుపోయిన చర్మంతో ఓ ముసలి డ్రయివర్ కన్పించాడు.
“అవునయ్యా! ఈ కారు కార్ఖానా పక్కనే మట్టిరోడ్డులో నాలుగుటైర్లు కూరుకుపోయి ఉండేది. ఎప్పుడు బాగుచేయించారు?” ఏదైనా విషయం రాబట్టాలంటే ఇలానే ఏదో ఒక విషయంతో మాటలు కలపాలని ప్రశ్నించాడు.
ఇంగ్లీష్ దొరల చుట్టల్లాంటి చుట్ట ఒకటి గట్టిగా దమ్ముపీల్చి వదిలినట్టు వదిలాడు డొక్కుముఖం డ్రయివర్. బదులీయకుండా గుప్పుమని చుట్టపొగ ముఖం మీద ఊదేసాడు.
“అడిగిందానికి జవాబు చెప్పవా?” చేత్తో కమ్మేసిన చుట్ట పొగను చెదరగొడ్తూ కానిస్టేబుల్ ఇక్బాల్ చిరాకెత్తిపోయాడు. మరోమాటకు అవకాశం లేకుండా వెంటనే కారుస్టార్టు చేసి ఆ
డొక్కు ముఖం డ్రయివర్ కారును వెనక్కి మళ్లించుకుని పోయాడు.
ముసురు పట్టినందున రోడ్డుమీద పడ్డ నీళ్లు స్ట్రీట్‌లైట్ వెలుగుల్లో తళతళమెరుస్తుంటే నల్లకారు స్పీడ్‌గానే జారుపోతున్నట్లు దూసుకుపోయింది. ఇక్బాల్‌కు అహం దెబ్బతిన్నట్లు అయ్యింది. అడిగిందానికి బదులీయకుండా వెళ్లిపోతున్నాడు. ఈసారి ఎదురుపడని కారులోంచి బయటకి ఈడ్చేసి జవాబులు రాబడతాయని తర్కించుకుంటూ రైల్వేఫుట్‌బ్రిడ్జి వైపునకు వెళ్లిపోయాడు.
వేకువ ఆరుగంటలకు డ్యూటీ దిగిన ఇక్బాల్, ముకుల్ సైకిళ్లు తొక్కుకుంటూ మసీదు రోడ్డువైపు సాగారు. ఇద్దరు నిద్రలేమి కళ్లతో వెడుతూ కార్ఖానా పక్కనే ఉన్న నల్లకారును చూసి సైకిళ్లు ఆపారు. ఇక్బాల్ నోరు బార్లాతెరిచాడు.
“కొన్ని గంటల క్రితం ఇదే నంబర్ కారును, ఇదే నల్లకారును తిరుగాడడం చూసాను. అప్పుడు బాగుచేసినట్లుంది. ఇప్పుడు మట్టిలో కూరుకుపోయిన పగిలిన టైర్లుతో ఉంది. ఏమిటిదంతా? ఇందులో కూర్చుని డ్రయివ్ చేసినోడు కూడా బాగా ఎముకలు తేరిపోయిన ముఖంతో
భీతిగొలిపేలా ఉన్నాడు. కొంపదీసి దయ్యంగాడు కాడు కదా” ఇక్బాల్ ఒకింత నాలుక తడారిపోయినట్లు అయిపోయాడు.
ముకుల్‌కు దయ్యాలపై నమ్మకం బొత్తిగా లేకున్నా తను రాత్రి నల్లకారు పరుగులు తీయడం, ఉదయానికి యధాతథంగా ఉండడంతో చాలా ఆశ్చర్యపోయాడు.
“మన ఇన్‌స్పెక్టర్ నమ్మినట్లు దయ్యాలున్నాయి. నైట్‌డ్యూటీకి వెళ్లే ముందు సాయంత్రం ఐదింటికి ఈ కారు సంగతి తేల్చుకుందాం.” చెప్పి సైకిల్ ఎక్కాడు.
***
సాయంత్రం కారున్నచోట వాకబు చే సారు ఇద్దరు కానిస్టేబుళ్లు. అదిగోండి ఆ రేకుల షె డ్డు లాంటి నివాసమే ఈ కారు నడిపే డ్రయివర్ ఇ ల్లు. అక్కడ అడగండి అని చెప్పారు. ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ ఇంటికి వెళ్లారు.
అక్కడో మధ్య వయసురాలు కన్పించింది.
“ఆ కారు డ్రయివర్ ఎక్కడ?”
“ఆ కారు నడిపేది మా నాన్న స్టీఫెన్. ఎప్పుడో రోడ్డు యాక్సిడెంట్‌లో చచ్చిపోయాడు. బ హుశా మీకు రాత్రి కన్పించి ఉంటాడు. అమవాస్య లో ముసురుపడితే మా నాన్న ఆత్మ ఆ కారు నడుపుతూ కన్పిస్తాడు. నిన్న అమావాస్య పైగా ము సురుపట్టే ఉంది. ఈ రోజూ రైల్వేస్టేషన్ రోడ్డులో కన్పిస్తాడు. రాత్రి మీద దిగే ప్యాసింజర్లకు వారి గమ్యాలకు బాడుగ తీసుకుని చేరుస్తాడు ” చెప్పి ఆవులించింది.
ఇద్దరు కానిస్టేబుళ్లు అయోమయంగా ఆమె మాటలను నమ్మశక్యం కానట్టు వింటూ ఆమెను అనుమానంగా చూసారు. ఆమె కాళ్లు నక్కి తిరిగి ఉన్నాయేమో అని ఆత్రంగా చేసారు. ఆమె వారి భయాన్ని గుర్తించి నేను మనిషినే. మా నాన్న ఆత్మను లోగడ చూసేటప్పుడు భయపడేదాన్ని. ఇప్పుడు అలవాటు అయిపోయింది.
“స్టీఫెన్ ప్రమాదంలో చనిపోయాడా?”
“ మానాన్న నిత్యం తాగుతూనే ఉండేవాడు. కారును ఎక్కువగా ఈ ఊళ్లో శవాలు చేరవేతకే వెళ్లేవాడు. అందుకే ఆ కారును శవాలకారు అని పిలిచేవారు.” ఇదే నాదగ్గర ఉన్న సమాచారం అన్నట్లు చెప్పింది.
ఇద్దరు కానిస్టేబుళ్లు తడారిన పెదాలతో ఆ ఇంటిలోకి తొంగి చూసారు. నులకమంచంలో నిద్రపోతున్న స్టీఫెన్ కన్పించాడు. రాత్రి చూసిన ఇక్బాల్ గుర్తుపట్టి లోపలికి వెళ్లాడు. ఎముకలు తేరిన డొక్కుముఖం డ్రైవర్ స్టీఫెన్ ముఖం చిట్లించి నిద్రలోనే కీచుగా ఆవులించాడు. ఇక్బాల్‌వంగి లేలే అంటూ కప్పుకున్న దుప్పటి లాగేసాడు. ఒక్క డొక్కుముఖమే ఉంది. తప్పితే మొం డెం, చేతులు, కాళ్లు లేవు. కంపరమెత్తిపోయి పరుగులు తీసారు.
చాలా దూరం పరుగెత్తాక వెనక్కి తిరిగి ఆ రేకుల ఇంటిని చూసారు. దయ్యాల కొంపలా కన్పించింది. ఇద్దరికి అక్కడికి ఒకగంట తర్వాత సన్నపాటి జ్వరం రాజుకుంది. ఇద్దరు సెలవు కోరితే పై అధికార్లు ఇవ్వలేదు. ముసురు తగ్గలేదు. ఇద్దరు కానిస్టేబుళ్లు రైన్‌కోటు వేసుకుని కాళ్లీడ్చుకుంటూ రైల్వేస్టేషన్ రోడ్డులో నడవసాగారు. అక్కడ వైన్‌షాపు ముందు నల్లకారు ఆగి ఉంది. దాన్ని చూడగానే మరోసారి ఠారెత్తిపోయారు. అయినా ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కారును సమీపించారు. కారుతోబాటు టైర్లు బాగానే ఉన్నాయి. వైన్‌షాప్ కౌంటర్‌లో వ్యక్తిని అడిగాడు.
“ఆ కారు డైవర్ ఇక్కడికి వచ్చాడా?”
“వచ్చాడు. ఆ స్టోర్‌రూమ్‌లో కూర్చుని తాగుతాడు. వాడికి బిల్లు ప్రిపేర్ చేయం. ఓనర్సు చెప్పారు. ఏమిటో వారిమధ్య అలాంటి అవగాహ న ఉంది.” అని చెప్పి వేరే పనిలో పడ్డాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి స్టోర్‌రూమ్‌లోకి వెళ్లారు. చిన్నపాటి డిమ్‌లైట్‌లో ఫుల్‌బాటిల్ తెరిచి ఎత్తిపోసుకుంటున్నాడు స్టీఫెన్. పక్కనే ఉన్న కిటిలోంచి వస్తున్న ఈదురుగాలికి పరవశించసాగాడు. ఆ వెంటనే ఇటుగా తిరిగాడు. ఇద్దరు కానిస్టేబుళ్లను చూ సాడు. “ నాకోసమే వచ్చారా? కారు బాడుగకు కావాలా? ఎక్కడికి పోవాలి?” బొంగురు గొంతుతో అడిగాడు.
“ఇలా ఫుల్‌బాటిల్ తాగేసి కారేం
నడుపుతావు? అని ఇక్బాల్ ధైర్యం తెచ్చుకుని అడిగి ముఖంలోకి చూసాడు.
“ఒక బాటిల్ కాదు. ఇదిగో ఇప్పటికి మూడు ఫుల్‌బాటిల్సు తాగేసాను. తాగుడుకు నా డ్రయివింగ్‌కు సంబంధమే లేదు. హిహిహిహి” అని పిశాచపు నవ్వు నవ్వాడు.
“నీవు తాగిందానికి బిల్లు చెల్లించనక్కర్లేదా?”
పగలబడి నవ్వాడు స్టీఫెన్. అతడి డొక్కుముఖం గ్రాఫిక్సులో పెద్దదయినట్లు ఇంతోటి అయ్యేసరికి కానిస్టేబుళ్లకు గుండెల్లో వేగం పెరిగింది. బిక్కముఖాలేసుకుని చూడసాగారు.
“అడిగిన ప్యాసింజర్లకు ఏదైనా చెప్పాలి. రోడ్డు ప్రమాదంలో నన్ను ఢీకొట్టి చంపేసాడు ఈ వైన్‌షాప్ యజమాని. నేను ఆత్మ అయ్యాక వాడిని నానాహింసలు పెట్టాను. వీడి వై న్సు గోదామును ఎప్పటికప్పుడు తగలేసాను. దాంతో వీడు భూతవైద్యులను ఉసిగొలిపాడు. వారిని చావచితకేసాను. ఇక వాడికి ఏ దారి లేక కలుగులో దూరిన ఎలుకలా ఈ స్టోర్‌రూమ్‌లో దాగాడు. నన్ను చంపిన వాడిని వదలకుండా వాడి నెత్తురు మాంసాలు పీల్చి పిప్పిచేసాను. వాడు చచ్చాక కూడా నా నెలవు ఈ గోదామే అయ్యిం ది.” స్టీఫెన్ కిటికీలోంచి రోడ్డుమీద కురుస్తున్న వ ర్షం చూస్తూ తన ఆత్మగాధను చెప్పాడు.
కానిస్టేబుళ్లు ఇద్దరు ఒకరిని ఒకరు పట్టుకుని బయటికి వచ్చారు. కౌంటర్‌లో సేల్స్‌మాన్ బదులు ఓనర్ ఉన్నాడు. కానిస్టేబుళ్లను చూసి ఎందుకు స్టోర్‌లోకి వెళ్లారు? ఇప్పుడు ఫోర్సు తగ్గిన స్టీఫెన్ ఆత్మఅది. అమావాస్యనాడు ముసురు పడితే ఆత్మ స్టోర్‌రూమ్‌లోకి వచ్చి మద్యం బాటిల్సు తాగేస్తుంది. చాలా కాలంగా ఇదోలాస్ మాకు”.
“ఆత్మను వదిలించలేరా? భూతవైద్యులకు బెంగాల్‌లో కొదవలేదు. మరెందుకు ఉపేక్షిస్తున్నారు.”
స్టీఫెన్ ఆత్మ భయంకరమైనది. భూతవైద్యానికి లొంగనిది. మా అన్నను నిత్యం నెత్తురుమాంసాలు పీల్చి మరీ చంపేసింది. రోడ్డు ప్రమాదానికి మా అన్న కారకుడు కాడు. తప్పతాగి రోడ్డుకు అడ్డంపడి స్టీఫెనే కారును ఢీకొన్నాడు. పగబట్టిన ఆత్మ మా అన్నను కబళించేసింది.” అడగకుండానే చెప్పాడు. అప్పటికే ఇద్దరు ఆత్మతో మాట్లాడాక మరింత భయకంపితులై జ్వరాన్ని పెంచుకున్నారు. తలలు పట్టుకుని కూర్చుండి పోయారు.
ఇద్దరిని ఆటోలో ఆసుపత్రికి పంపించడానికి వైన్‌షాప్ ఓనర్ ఏర్పాటు చేసాడు. అప్పటికే స్టీఫెన్ స్టోర్‌రూమ్‌లోంచి బయటకివచ్చి ఇద్దరు కానిస్టేబుళ్లను ఆటో ఎక్కకుండా తన కారులో ఎక్కించుకుని సర్కారు ఆసుపత్రిలో దించేసి వెళ్లిపోయాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు వారం తర్వాత జ్వరం నుంచి కోలుకున్నాక బదిలీపై వేరే చోటికి వెళ్లిపోయారు. వెస్టుబెంగాల్‌లో ఇలాంటి దయ్యం కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి.

 

Ghost Stories in Telugu
                                                                          యర్నాగుల సుధాకర్‌రావు 99852 65313

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తాగుబోతు దయ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.