ఎటు చూసినా పచ్చదనం

  బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం ‘బుద్ధగయ’. గౌతముడికి జ్ఞానోదయమైన ప్రాంతం కావడంతో ‘బోధ్‌గయ‘గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఎటు చూసినా ప్రశాంతత, పచ్చదనం పరచుకున్న బుద్ధగయకు వెళ్ళాలని, అక్కడ మనోహరమైన ప్రదేశాలను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. అం దరికి మల్లే నేను కూడా అనుకున్నాను.. యాదృచ్చికమో, లేదా ఏదైనా మహిమో తెలియదు కాని నా కు కూడా బుద్ధగయకు వెళ్లే అవకాశం వచ్చింది. వచ్చిందే తడవుగా నేను బయలుదేరి పోయాను. సాధారణంగా హైద్రాబాద్ నుంచి […] The post ఎటు చూసినా పచ్చదనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం ‘బుద్ధగయ’. గౌతముడికి జ్ఞానోదయమైన ప్రాంతం కావడంతో ‘బోధ్‌గయ‘గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఎటు చూసినా ప్రశాంతత, పచ్చదనం పరచుకున్న బుద్ధగయకు వెళ్ళాలని, అక్కడ మనోహరమైన ప్రదేశాలను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. అం దరికి మల్లే నేను కూడా అనుకున్నాను.. యాదృచ్చికమో, లేదా ఏదైనా మహిమో తెలియదు కాని నా కు కూడా బుద్ధగయకు వెళ్లే అవకాశం వచ్చింది. వచ్చిందే తడవుగా నేను బయలుదేరి పోయాను. సాధారణంగా హైద్రాబాద్ నుంచి బయలు దేరు వారు పాట్నా మీదుగా బుద్ధగయకు చేరుకుంటా రు. కాని నేను మాత్రం వారణాసి వెళ్ళి అక్కడ నుం చి బుద్ధగయకు బయలుదేరాను. వారణాసి నుంచి బుద్ధగయ సుమారు 250 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అందువల్ల అక్కడ నుంచి వెహికల్ తీసుకుని బుద్ధగయకు బయలు దేరాను.
వారణాసి నుంచి బుద్ధగయకు సుమారు ఐదు గం టల సమయం పట్టింది. బౌద్ధులకు అతిముఖ్యమైన యాత్రా స్థలాలలో ఒకటైన ఈ బుద్ధగయలో అడుగుపెట్టగానే ఎవరికయినా ఓ పవిత్ర స్థలంలోకి అ డుగుపెట్టామన్న భావన కలగడం అత్యంత సహ జం. నాకు కూడా అదే భావన కల్గింది. ఇక్కడి బ జార్లలో జపాన్, చైనా, టిబెట్, భూటాన్ తదితర దే శాలకు చెందిన బౌద్ధ బిక్షువులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ నాకు కనిపించారు. కాషాయ వ స్త్రాలు ధరించిన వారందరినీ తేదేక దృష్టితో పరికిం చి చూశాను. వాళ్లలో ఎవ్వరికీ మన భాషలు రావు.. వారంతా వారి భాషల్లో మాట్లాడుకుంటున్నారు.
సాక్షాత్తు గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం కల్గించిన పుణ్యక్షేత్రమిదేనట. ఒకప్పుడు దీనిని బోధ్‌గయేగా పిలిచే వారు. క్రమంగా అది బుద్ధగయగా వాడుకలోకి వచ్చింది.
ఈ క్షేత్రాన్ని చారిత్రికంగా ఉరువేల, సంబోధి, వ జ్రాసన లేదా మహాబోధి అని పిలవడం జరుగుతోంది. ‘నిరంజన’ అనే నదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో సుమారు 2,500 సంవత్సరాల క్రితం దట్టమైన అరణ్యం ఉండేదనీ, ఈ అరణ్యంలోనే కపిలవస్తు రాజకుమారుడైన సిద్ధార్థుడు సంచరించేవాడని ఇక్కడి వారు చెప్పగా విన్నాను.
గౌతమ బుద్ధుడు ఫాల్గు నది ఒడ్డున ఉన్న బోధి చెట్టుకింద ధ్యానం చేయడానికి ఇక్కడికి వచ్చాడంటారు.. బుద్ధుడు తన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సం బంధించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందిన ప్రదేశమిదేనట.
అలాగే, 13 వ శతాబ్దంలో టర్కిక్ సైన్యాలు ఈ క్షే త్రాన్ని ఆక్రమించేంతవరకు, ఈ ప్రాంతం కొన్ని శ తాబ్దాలుగా బౌద్ధ నాగరికతకు కేంద్రంగా ఉండేదట. బుద్ధుడు వెళ్ళిన అనేక శతాబ్దాల తరువాత, మౌర్య రాజు అశోకుడు బౌద్ధమతానికి గుర్తుగా పెద్ద సంఖ్యలో ఆరామానాలు, స్తంభాలను నిర్మించాడంటారు.
నిరంతరం బుద్ధుని నామస్మరణంతో మారుమ్రోగే ఈ క్షేత్రంలో చైనా, టిబెట్, భూటాన్, జపాన్, థాయిలాండ్ తదితర దేశాలు నిర్మించిన బౌద్ధాలయాలు అడుగడుగునా నాకు స్వాగతం పలికాయి. వాటిని దూరం నుంచే గమనించి ప్రధానాలయం దగ్గరికి వచ్చాను.
పూర్తిగా ఇటుకలతో నిర్మించిన ఆలయమిది. మహాబోధి ఆలయ ప్రధాన గోపురాన్ని 19 వ శతాబ్దంలో 55 మీటర్ల ఎత్తులో పునర్నిర్మించారు. ప్రధాన గోపురం చుట్టూ, అదే శైలిలో నాలుగు చిన్న గోపురాలు నిర్మించారు. ఈ మహాబోధి ఆలయ నాలుగు సరిహద్దులు రెండు మీటర్ల ఎత్తులో దగ్గరగా రాతి రైలింగుతో ఉన్నాయి. అనేక రైలింగ్‌లు సూర్య, లక్ష్మి ఇంకా అనేక భారతీయ దేవీ దేవతల విగ్రహాలతో ఉంటే, కొన్ని రైలింగ్‌లు తామరపూలతో దర్శనమిచ్చాయి.
ఇతర ఆలయాలకు మల్లే కాకుండా. గర్భగుడి స్థూపాకారంగా ఉండి, చివరన కలశంలాగా గోళాకారంలో దర్శనమిచ్చింది. గుడంతా రాతి కట్టడమే అయినప్పటికీ, ఆలయంపైకి వెళ్ళేందుకు నాలుగువైపుల నుంచి మెట్లున్నాయి. మెట్లు ఎక్కుతున్నపుడు బుద్ధ విగ్రహం ఒకటి కనిపించింది.
ఈ ప్రాంగణంలోకి రాగానే బుద్ధుడు అక్కడ ఇంకా సజీవంగా ఉన్నాడా అనిపించింది.
మందిరం చుట్టూ ఉండే చెట్ల పచ్చదనం వల్ల వాతావరణం అందంగా, ఆహ్లాదంగా ఉండడంతో నన్ను నేనే మైమరచి పోయాను. మందిరం ఆవరణ అంతా చిన్నా, పెద్దా స్థూపాలతో నిండి ఉండగా, వాటిల్లో కొన్ని అద్భుతమైన శిల్పసంపదతో అలరారుతున్నాయి. ప్రధానాలయం తూర్పుదిశగా ఉంది. దీనిని హవిష్ణుకుడనే రాజు నిర్మించాడని కొంతమంది, కాదు అశోక చక్రవర్తి నిర్మించాడని మరికొంతమంది చెబుతారు. ఇతర భక్తులకు మల్లే నా కాళ్ల చెప్పులు తొలగించి ఆలయప్రాంగణంలోకి వెళ్ళాను. అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతున్నట్టనిపించింది. బుద్ధుని పవిత్ర క్షేత్రం అవ్వడం వల్లనేమో అక్కడికి వచ్చిన చాలా మంది భక్తులలో చైనా, జపాన్, భూటాన్, థాయిలాండ్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన భక్తులున్నారు. తెలుగు వాళ్ళు మాత్రం పలుచగా కనిపించారు.
ఈ మందిరంలో పడమర గోడకు ఆనుకొని, తూ ర్పుముఖంగా నిశ్చల సమాధిలో ఆసీనుడైన బుద్ధ భగవానుడి విగ్రహం ఉంది. బుద్ధ భగవానుడి విగ్రహమంతా బంగారంతో తాపడం చేయబడి ఉంది.
బుద్ధుని విగ్రహాన్ని చూడగానే అప్రయత్నంగానే నా చేతులు నమస్కార ముద్రలోకి మారిపోయాయి. నే ను తడుముకోకుండా చేతులు జోడించి కళ్ళు మూ సుకున్నాను. నాతో పాటు ఉన్న ఇతర భక్తులు సై తం వారివారి భాషల్లో కళ్ళు మూసుకుని బుద్ధుని స్మరించుకుంటున్నారు.
అక్కడి నుంచి బయటకు వచ్చి మందిరం వెనుక వైపునకు వెళ్ళాను. ఇక్కడే బోధివృక్షం ఉంది. ఈ బోధి వృక్షం కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిందని అక్కడి గైడ్లు చెప్పారు. ఆ వృక్షంలోని ఒక కొమ్మను అశోక చక్రవర్తి కుమార్తె సంఘమిత్ర శ్రీలంకలోని అనురాధాపురంలో నాటిందంటారు.
బోధి చెట్టుకు రంగురంగుల గుడ్డలు కట్టి ఉన్నా యి. ఇలా గుడ్డలు కడితే కోర్కెలు నెరవేరుతాయట. బుద్ధుడి తపోభూమి అయిన బోధివృక్ష మూలస్థానాన్ని ‘వజ్రాసనం‘ అంటారని అక్కడి వారు చెప్పగా విన్నాను.
ఈ చెట్టు చుట్టూ పెద్ద ఫెన్సింగ్ లాంటిది వేసి గేటు అమర్చారు. ఈ గేటును దాటి లోపలికి వెళితే బుద్ధుడు కూర్చున్న ప్రదేశం ఉంది. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్య ప్రదేశాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా చెబుతారు.
బుద్ధునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఈ క్షేత్రంలోనే ఏడు వారాలు గడిపాడట.
ఆలయప్రాంగణంలో అనేక స్థూపాలు కనిపించాయి. ఆ స్తూపాల మధ్యలో ఒక్కమనిషి పడుకోవటానికి సరిపడే బెడ్డులు పరిచి ఉన్నాయి.కొందరు భక్తులు అక్కడనే పడుకుని నిద్రపోతారట. అలాగే అక్కడే ధ్యానం కూడా చేస్తారట.
అత్యంత పవిత్రమైన బోధివృక్షం ఉన్న ఈ ఆలయాన్ని మహాభోది ఆలయమంటారని అక్కడి వా రు చెప్పారు.
దీనిని దాటుకుని ముందుకు వెళితే బుద్ధుడి పాద స్పర్శతో పునీతమైన ‘చంక్రమణ‘ అనే ప్రదేశం దర్శనమిచ్చింది. దీనికి సమీపంలోనే ‘అనిమేషలోచన‘ అనే స్థూపం, ‘రత్నఘర్ చైత్యం‘ అనే ఆలయం,
‘మచిలింద సరస్సు‘, బుద్ధుడు ధ్యానముద్రలో ఉండే అతిపెద్ద విగ్రహాలను దర్శించుకోవడం జరిగింది. ఇదే ప్రాంగణంలో మరో పక్క బుద్ధుడు తన బోధలను తన శిష్యులకు వివరించిన ప్రదేశం కనిపించింది. ఇక్కడ బుద్ధుని ప్రధాన శిష్యులు జ్నాన బోధను వింటున్న దృశ్యం శిల్పాల రూపంలో కళ్ళకు కట్టినట్లుగా దర్శనమిచ్చింది. ఆలయంలోనే మరో పక్క కేందేల్ లైట్ ప్రాంగణముంది. ఇక్కడకు వచ్చిన భక్తులు ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తారు.
ప్రధానాలయానికి సమీపంలో చైనా, భూటాన్ దే శాలకు చెందిన ఆలయాలతో పాటు పూరీ జగన్నాధుడి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాను. ఆలయానికి సమీపంలో సుజాత స్థూపం ఉంది.
బుద్ధగయకు సమీపంలో దుంగేశ్వరి గుహాలయాలున్నాయి. వీటిని బుద్ధుడు తపస్సు చేసిన ప్రదేశాలుగా చెబుతారు. వీటిని హాకాల గుహలు అనికూడా పిలుస్తారట.
ఇంకా బుద్ధగయకు సమీపంలో బరాబర్ కొండలున్నాయి. ఈ కొండల్లోని గుహలు మహిమాన్వితమైనవని చెబుతారు. ఇక్కడే , లోమాస్ రిషి గుహను కూడా దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.
గయ: బుద్ధగయకు సుమారు 16 కిలోమీటర్లు దూరంలో గయ క్షేత్రముంది. గయాసురుడు పాదం మోపిన క్షేత్రమట. దీనిని శిరోగయగా చెబుతారు. ఇక్కడ పితృ దేవతలకు పిండప్రదానాలు చేస్తే వారికి మోక్షప్రాప్తి కలుగుతుందట. ఆ కారణంగా ఫల్గూ నది ఒడ్డున ఉన్న గ యను నిత్యం వేలాది మంది దర్శిస్తారు.
గయలో ఉన్నముఖ్యమైన ఆలయాల్లో విష్ణుపద మందిరం ఒకటి. విష్ణువు పాదం మోపిన స్థలంగా దీనిని చెబుతారు.
అలాగే ఇక్కడే మంగళగౌరి మందిరం కూడా ఉం ది. దేశంలో ఉన్నఅష్టాదశ శక్తి పీఠాలలో ఇదొకటి. సతీదేవికి చెందిన హృదయ భాగం ఇక్కడ పడింద ని చెబుతారు.
అలాగే గయలో ఉన్న జమ్మా మసీద్ బీహారులోనే అతిపెద్ద మసీదు. ముజాఫీరి రాజకుటుంబం 150 సంవత్సరాల క్రితం ఈ మసీదును నిర్మించారు. ఇక్కడ ఒకేసారి వేలమంది నమాజ్ చేసే వీలుంది. ప్రస్తుతం ఈ మసీదును చారిత్రక ప్రదేశంగా చెబుతున్నారు.
బుద్ధగయను దర్శించుకుని, గయకు చేరుకున్న తరువాత పిండప్రదానాలు కాస్తా పూర్తి చేసుకునే సరికి ఒక్కటే ఆకలి. అయితే అక్కడ మన తెలుగు వాళ్ళ కోసం ఓ పురోహితుడు నిత్యం భోజనాలు ఏ ర్పాటు చేస్తుంటాడు. గయకు వచ్చే తెలుగు భక్తులంతా అక్కడే ఆ పురోహితుని ఇంట్లోనే భోజనం చేస్తారు. నేనుకూడా అక్కడే భోజనం చేశాను. దీనికి గాను కొంత రుసుం పురోహితుడు వసూలు చేస్తా డు. సాధారణంగా గయలో జరిగే పిండప్రదానా లు, భోజనాలు అన్నీ ఆ పురోహితుడే తన ఆధ్వర్యంలో జరిపిస్తూ ఉంటాడు.

ఎలా చేరుకోవాలి:
బీహార్ రాజధాని పాట్నా నుంచి బుద్ధగయ 178 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు అన్ని ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు అనుసంధానించబడి ఉన్నాయి.

బుద్ధగయ ప్రధాన బస్ స్టాప్, ఫాల్గు నదిపై ఉన్న సుజాత వంతెన సమీపంలో ఉంది. ఇక రైలు మార్గం ద్వారా బుద్ధగయకు చేరుకునే వారు గయ రైల్వేస్టేషన్లో దిగి ఇక్కడకు చేరుకోవచ్చు.  అలాగే గయ అంతర్జాతీయ విమానాశ్రయం బుద్ధగయ నుంచి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది చైనా, జపాన్, శ్రీలంక తదితర ఆసియా దేశాలతోపాటు ప్రధాన భారతీయ నగరాలకు కూడా అనుసంధానించబడి ఉంది.

77940 96169

 

Bodh Gaya Tourism in Bihar

 

The post ఎటు చూసినా పచ్చదనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.