రైతుల అవసరాలకు అనుగుణంగా మొక్కలు నాటాలి…

  సుబేదారి: వ్యవసాయ శాఖ ద్వారా హరితహారంలో రైతులను పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకుగాను పూర్తిస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి రైతుల అవసరాలకు అనుగుణంగా మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జెపాటిల్ వ్యవసాయ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో మండల వ్యవసాయ అధికారులు, గ్రామస్థాయి వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జనవరి, ఫిబ్రవరి మాసంలో నిర్వహించిన సర్వే ఆధారంగా కాకుండా, రైతులకు వారి అవసరాలకు […] The post రైతుల అవసరాలకు అనుగుణంగా మొక్కలు నాటాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుబేదారి: వ్యవసాయ శాఖ ద్వారా హరితహారంలో రైతులను పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకుగాను పూర్తిస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి రైతుల అవసరాలకు అనుగుణంగా మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జెపాటిల్ వ్యవసాయ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో మండల వ్యవసాయ అధికారులు, గ్రామస్థాయి వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జనవరి, ఫిబ్రవరి మాసంలో నిర్వహించిన సర్వే ఆధారంగా కాకుండా, రైతులకు వారి అవసరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి జులై 6 నాటికి పూర్తిస్థాయి నివేదికలు అందజేయాలని, అదేవిధంగా మొక్కలు పంపిణీతో పాటు వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకొని నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు.

రైతులను ప్రోత్సహించేందుకు మొక్కలు నాటే విధానాన్ని వాటి వల్ల వచ్చే ఆదాయ వివరాలతో పాటు కలిగే ప్రయోజనాలు, మార్కెటింగ్ విధానాలు మున్నగు వాటిని తెలియజేయడం ద్వారా రైతులు చైతన్యవంతులై విరివిగా మొక్కలు నాటేందుకు సంసిద్ధం కావడం జరుగుతుందని, అందుకు గాను పూర్తిస్తాయిలో తగు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా శాశ్వత ప్రయోజనాలతో పాటు భూగర్భజలాల అభివృద్ధి, పొలాల గట్లపై నీడనిచ్చే చెట్లు కాకుండా, టేకు, సాంజిటోరం, బాంబు వంటి చెట్లను నాటడం ద్వారా ఆదాయంతో పాటు ఇతర ప్రయోజనాలు పొందడం జరుగుతుందని ఆయన తెలిపారు. జులై 6న నిర్వహించే సమావేశంలో పూర్తిస్థాయిలో రైతుల వివరాలు, సర్వే నెంబర్, మొక్కలు నాటే భూమి వివరాలతో పాటు, రైతుల పూర్తి వివరాలు అందజేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాల్, మండల వ్యవసాయశాఖ అధికారులు అఫ్జల్‌పాషా, శ్రీధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీలత, గ్రామ వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Plants Planted According to the Needs of Farmers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రైతుల అవసరాలకు అనుగుణంగా మొక్కలు నాటాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.