వింత పక్షులు

  కాక్ ఆఫ్ ది రాక్ పేరే కాదు! దీని రూపమూ వింతే మరి. తల నారింజ ఎరుపు రంగుల్లో, శరీరం బూడిద రంగులో భలే గమ్మత్తుగా ఉంటుంది. అంతే కాదు దీనికో చిత్రమైన కిరీటమూ ఉంటుంది. కొండలపై గూళ్లు కట్టుకుంటుందని దీనికి కాక్ ఆఫ్ ది రాక్అనే పేరొచ్చింది. గోల్డెన్ ఫెసంట్ ‘తలపై బంగారపు కుచ్చు పెట్టుకున్నట్టుందే’ అనుకుంటున్నారా?ఇలా రంగురంగుల్లో మెరిసిపోవడమే దీని గొప్ప. పొడవైన తోకతో ఉండే ఈ పక్షి ఇంచుమించు 40 అంగుళాల […] The post వింత పక్షులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కాక్ ఆఫ్ ది రాక్
పేరే కాదు! దీని రూపమూ వింతే మరి. తల నారింజ ఎరుపు రంగుల్లో, శరీరం బూడిద రంగులో భలే గమ్మత్తుగా ఉంటుంది. అంతే కాదు దీనికో చిత్రమైన కిరీటమూ ఉంటుంది. కొండలపై గూళ్లు కట్టుకుంటుందని దీనికి కాక్ ఆఫ్ ది రాక్అనే పేరొచ్చింది.

గోల్డెన్ ఫెసంట్

‘తలపై బంగారపు కుచ్చు పెట్టుకున్నట్టుందే’ అనుకుంటున్నారా?ఇలా రంగురంగుల్లో మెరిసిపోవడమే దీని గొప్ప. పొడవైన తోకతో ఉండే ఈ పక్షి ఇంచుమించు 40 అంగుళాల పొడవు ఉంటుంది. చైనాలో దీన్ని అదృష్టం, సంపదలకి గుర్తుగా భావిస్తారు.

కింగ్ వల్చర్

చూస్తేనే ‘బాబోయ్ ఇదేం జీవిరా’ అనుకుంటున్నారు కదూ. ఇది రాబందుల్లో ఓ రకం. రెండున్నర అడుగుల పొడవు ఉంటుందిది. దీని ప్రత్యేకత అంతా దీని ముఖంలోనే ఉంది. కనురెప్పలు లేని దీని కళ్లు, విచిత్రంగా ఉండే కొక్కెంలాంటి ముక్కు ఓ భయంకరమైన ఆకారంలా కనిపించేట్టు చేస్తాయి.

సూపర్బ్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్

మామూలుగా ఉన్నప్పుడు పక్షిలానే ఉంటుంది. పురి విప్పి నాట్యం చేసిందంటే బయటపడుతుంది దీని అసలు రూపం. ఇది జతని ఆకర్షించడానికి డ్యాన్స్ చేస్తుంది. అప్పుడిలా ఎరుపు, నలుపు రంగుల్లో గమ్మత్తయిన రూపంతో కనువిందు చేస్తుంది.

Most Beautiful Birds in the World

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వింత పక్షులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: