అల్పాహారం గుండెకు బలం!

  ఆహారపానీయాలు, వ్యాయామాల ప్రస్తావన వస్తే చాలు… చాలామంది మనకు అంత సమయం ఎక్కడుందిలే అనేస్తారు. అయితే ఇలాంటి వాళ్లల్లో చాలా మంది గంటల కొద్దీ సమయాన్ని టి.వి ముందు గడిపేస్తుంటారు. పైగా వీళ్లల్లో ఎక్కువ మంది బ్రేక్‌ఫా్‌స్టను వదిలేసేవాళ్లే! అంతిమంగా ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. గుండె విభాగానికి సంబంధించిన ఒక ప్రత్యేక శాస్త్రవేత్తల బృందం కొన్ని విషయాలను బయట పెట్టింది. అందులో భాగంగా, అతి త క్కువ సమయం మాత్రమే టి.వి చూస్తూ, ఆహార […] The post అల్పాహారం గుండెకు బలం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆహారపానీయాలు, వ్యాయామాల ప్రస్తావన వస్తే చాలు… చాలామంది మనకు అంత సమయం ఎక్కడుందిలే అనేస్తారు. అయితే ఇలాంటి వాళ్లల్లో చాలా మంది గంటల కొద్దీ సమయాన్ని టి.వి ముందు గడిపేస్తుంటారు. పైగా వీళ్లల్లో ఎక్కువ మంది బ్రేక్‌ఫా్‌స్టను వదిలేసేవాళ్లే! అంతిమంగా ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. గుండె విభాగానికి సంబంధించిన ఒక ప్రత్యేక శాస్త్రవేత్తల బృందం కొన్ని విషయాలను బయట పెట్టింది. అందులో భాగంగా, అతి త క్కువ సమయం మాత్రమే టి.వి చూస్తూ, ఆహార పానీయాల విషయంలో శ్రద్ద వహించేవారు బాగా ఆరోగ్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు. గుండె జబ్బులు, పక్షవాతం వీరిలో బాగా తక్కువని వారు చెబుతున్నారు. ఎందుకంటే వీళ్ల రక్తనాళాలు పెళుసుబారడం, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం చాలా తక్కువ. అయితే, జీవనశైలి విషయంలో కొన్ని సాధారణ నియమాల పట్ల కొందరు దృష్టి పెడుతున్నారు గానీ, గుండె జబ్బులు రావడానికి కారణాలను చాలామంది గుర్తించడం లేదు.

గుండె ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించడం అంటే, గుండె జబ్బులకు దారి తీసే బాహ్య, అంతర కారణాలన్నింటినీ లోతుగా అర్థం చేసుకోవడమే! అదే సమయంలో మొత్తం శరీర వ్యవ స్థ పైన దృష్టి సారించడం కూడా! పరిశోధకుల అధ్యయనాలు ఈ దిశగానే సాగుతున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడే జీవన శైలిలో శక్తిమంతమైన అల్పాహారానికి ఎంతో ప్రాధాన్యం ఉందని వారు కనుగొన్నారు. కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు మేలే చేస్తాయని వారు స్సష్టం చేస్తున్నారు. అల్పాహారంలో జంతుపరమైన మాంసం తక్కువగానూ, చేపలు, సముద్రపు చేపలను తరచూ తీసుకోవచ్చని చెబుతున్నారు. వీటితోపాటు కాయగూరలు, పండ్లు, గింజదాన్యాలు, చిక్కుడు గింజలు, తృణధాన్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. ఆలివ్ నూనె శ్రేష్టం అనీ, గుడ్లు, మీగడ, పెరుగు మితంగానే తీసుకోవాలని చెబుతున్నారు.

Breakfast Recipe Ideas for Healthy Heart

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అల్పాహారం గుండెకు బలం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: